ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం | We will strengthen the Prakasam barrage | Sakshi
Sakshi News home page

ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం

Sep 6 2024 6:04 AM | Updated on Sep 6 2024 6:04 AM

We will strengthen the Prakasam barrage

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌

సాక్షి, అమరావతి: జల ప్రళయాలను తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తా­మని, దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలి­పారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 400 మి.మీ వర్షం రావడంతో బుడ­మేరు కట్ట తెగి ఎన్నడూ చూడని జలప్రళయం వచ్చిందని, ఈ విపత్తు నుంచి బయట పడేలా కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ఆదే­శాల మేరకు రాష్ట్రంలో వరద నష్టం పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. గురువారం విజయవాడ కలెక్టరేట్‌లో చౌహాన్‌ మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయినవారిని కేంద్రం ఆదుకుంటుందన్నారు. ఫసల్‌ బీమా యోజన కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తామన్నారు. కేంద్ర బృందం నివేదిక వచ్చేలోగా తక్షణ సాయం అందిస్తామన్నారు. బుడమేరు గండ్లను పూడ్చడానికి కేంద్ర ఆర్మీ రంగంలోకి దిగిందని పేర్కొన్నారు.

15 లక్షల క్యూసెక్కులకు పెంచాలి: అంతకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బుడమేరు, వరదప్రాంతాలతో పాటు ఫొటో ఎగ్జిబి­ష­న్‌­ చూశారని, వరద నష్టం గురించి అన్ని వివరాలను తెలియజేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 11.90 లక్షల క్యూసెక్కులను మాత్రమే తట్టుకుంటుందని, దీన్ని 15 లక్షల క్యూసెక్కులకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement