ఢిల్లీ: జార్ఖండ్ ముక్తి మోర్చా నేత చంపయీ సోరెన్ బీబీజేలో చేరుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆదివారం పలువులు ఎమ్మెల్యేలు వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్లిన చంపాయీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరిపోతారంటూ ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో తాజాగా చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’’ అని అన్నారు.
चंपाई दा आप टाईगर थें,टाईगर हैं और टाईगर ही रहेंगें।
NDA परिवार में आपका स्वागत है।
जोहार टाईगर…@ChampaiSoren— Jitan Ram Manjhi (@jitanrmanjhi) August 18, 2024
బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో చంపాయీ ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం ‘ఎక్స్’లో తన ఆవేదనను షేర్ చేశారు. ‘జూలై మొదటివారంలో ముఖ్యమంత్రిగా నేను పాల్గొనాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను నాకు మాటమాత్రమైనా చెప్పకుండా పార్టీ నాయకత్వం రద్దు చేసింది. ఎందుకని ఆరా తీయగా పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఉందని, అప్పటిదాకా ఏ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కాకూడదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా?. ఎమ్మెల్యేల సమావేశంలో నన్ను రాజీనామా చేయమన్నారు. నిర్ఘాంతపోయా. అధికారంపై నాకెలాంటి యావ లేదు కాబట్టి వెంటనే రాజీనామా చేశా. కానీ నా ఆత్మగౌరవం దెబ్బతింది’ అని చెప్పుకొచ్చారు. జీవితాన్ని ధారపోసిన పార్టీలో నా ఉనికే ప్రశ్నార్థకమైంది.
నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని ఆ రోజే ఎమ్మెల్యేల భేటీలో ప్రకటించా. నా ఈ ప్రయాణంలో అన్ని ప్రత్యామ్నాయాలు తెరిచే ఉంటాయని సోరెన్ అన్నారు. ఇది తన వ్యక్తిగత పోరాటమని, ఇతర జేఎంఎం నాయకులను ఇందులోకి లాగదలచుకోలేదని చెప్పారు. ఎంతో చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన తానెప్పుడూ చేయలేదని, కాని అలాంటి పరిస్థితులు కల్పించారని చంపయీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment