రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా చేయడంతో రాష్ట్రానికి నూతన సీఎంగా చంపయ్ సొరెన్‌ను ప్రకటించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకుడు హేమంత్ సొరెన్ అధికార మహాఘటబంధన్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రాసిన లేఖలో చంపయ్ సొరెన్‌ను జేఎంఎం శాసనసభా పక్షానికి అధిపతిగా ప్రకటించారు. చంపయ్ సొరెన్‌ను ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. హేమంత్ సొరెన్ తన వారసుడిగా చంపయ్‌ను ఎన్నుకునే ముందు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు?
హేమంత్ సొరెన్ తండ్రి శిబు సొరెన్‌తో పాటు జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపక సభ్యులలో చంపయ్ సొరెన్ ఒకరు. అయితే హేమంత్ సొరెన్‌కు అతనిపై నమ్మకం ఉండటానికి ఇది మాత్రమే కారణం కాదు. చంపయ్ సొరెన్.. హేమంత్ సొరెన్‌కు విధేయుడు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి తండ్రి శిబు సోరెన్‌కు సన్నిహితుడు. అదీగాక చంపయ్ సొరెన్ కొల్హాన్ ప్రాంతానికి చెందినవారు. కొల్హాన్ బీజేపీకి కంచుకోటగా ఉంది.
జార్ఖండ్‌కు ఇప్పటి వరకు కొల్హాన్ నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరు బీజేపీ నుండి అర్జున్ ముండా (2010 నుండి 2013 వరకు), రఘువర్ దాస్ (2014 నుండి 2019 వరకు). జార్ఖండ్ రెండవ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌కు చెందిన మధు కోడా.. 2006 నుండి 2008 వరకు సీఎంగా పనిచేశారు. జార్ఖండ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొల్హాన్‌లో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పేలవంగా ఉంది.
అయినప్పటికీ సీఎం హేమంత్ సొరేన్‌కు ఈ ప్రాంతంపై సరైన ఆధరణ లేదు. చంపై సోరెన్‌ను తన వారసుడిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీకి ఎదురుదెబ్బ ఇచ్చినట్లవుతుందని సొరెన్ భావించారు. 'టైగర్ ఆఫ్ కొల్హన్' గా పేరున్న చంపయ్ సొరెన్ జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి సులభమవుతుందని భావించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: రసకందాయంలో జార్ఖండ్ రాజకీయం.. హైదరాబాద్ హోటల్‌కు ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment