భోపాల్: వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన నాటినుండి ఎదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రమాదాల కారణంగానో, సౌకర్యాల విషయంలోనే ఎదో ఒక విధంగా హైలైట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఈ ట్రైన్ మరోసారి ట్రెండింగ్ అయ్యింది. ఈ రైలులో ప్రయాణిస్తున్న ఓ అభాగ్యుడికి ఫుడ్ పార్సిల్ లో బొద్దింక రావడంతో రైలు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.
పైన పటారం లోన లొటారం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. సరికొత్త హంగులతో ఆర్భాటంగా ప్రారంభమైన ఈ రైళ్ళలో అంతా అత్యాధునికమేనని ప్రచారం చేస్తుండటంతో ఆహారం కూడా హైజీనిక్ గా ఉంటుందని భావించి ఫుడ్ ఆర్డర్ చేశాడో అభాగ్యుడు.
తీరా ఆర్డర్ వచ్చాక ఆత్రుతతో ఓపెన్ చేసి చూస్తే రోటీలకు బొద్దింక అతుక్కుని ఉంది. దీంతో రోటీలకంటే ముందు ఖంగుతిన్న ప్రయాణికుడు సుబోధ్ పహాలాజన్ ఈ ఉదంతం మొత్తాన్ని ఎక్స్(ఒకప్పటి ట్విట్టర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రోటీకి అతుక్కున్న బొద్దింక ఫోటో తోపాటు వందే భారత్ రైలులో నాకు ఒక బొద్దింక వచ్చిందని క్యాప్షన్ కూడా రాశారు.
దీనికి రైల్వే కేటరింగ్ సేవ వారు స్పందింస్తూ.. మీకు ఎదురైన చేదు అనుభవానికి చింతిస్తున్నాము. దీనికి బాధ్యులైన వారి మీద వెంటనే చర్యలు తీసుకుంటాము. మీ పీఎన్ఆర్ నెంబరు ఫోన్ నెంబరు మాకు డైరెక్ట్ మెసేజు పంపగలరు అని కోరుతూనే మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
@IRCTCofficial found a cockroach in my food, in the vande bharat train. #Vandebharatexpress#VandeBharat #rkmp #Delhi @drmbct pic.twitter.com/Re9BkREHTl
— pundook🔫🔫 (@subodhpahalajan) July 24, 2023
ఇది కూడా చదవండి: మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
Comments
Please login to add a commentAdd a comment