Man Sexually Assaulted Friend Wife Was Arrested At Bhopal - Sakshi
Sakshi News home page

Bhopal: కపుల్స్‌ మధ్య గొడవలు.. ఓదారుస్తూనే ఫ్రెండ్‌ భార్యపై కన్నేశాడు

Published Mon, Jul 25 2022 1:43 PM | Last Updated on Mon, Jul 25 2022 2:45 PM

Man Sexually Assaulted Friend Wife Was Arrested At Bhopal - Sakshi

పెళ్లి చేసుకుని భార్యకు అండగా ఉండాల్సిన భర్తే.. ఆమె పాలిట కీచకుడయ్యాడు. భర్త స్నేహితుడు.. ఆమెపై అత్యాచారం చేసినా.. అదేదీ పట్టించుకోకుండా ఆమెకు విడాకుల ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ హిందూ మహిళ(28)కు మరో వర్గానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం.. సదరు మహిళ తన భర్త వర్గంలోకి మారింది. కాగా, మొదట్లో కొద్ది రోజుల బాగానే సాగిన వివాహ బంధంలో అడ్డంకులు ఎదురయ్యాయి. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.  ప్రతీరోజు ఏదో ఒక విషయంలో వారి మధ్య తగువు జరుగుతూనే ఉంది. అయితే, వీరి సమస్యను తీర్చేందుకు భర్త స్నేహితుడు.. హసీబ్ సిద్ధిఖీ రంగ ప్రవేశం చేశారు.

ఈ క్రమంలో తరచూ వారి ఇంటికి వస్తూ బాధితురాలిపై కన్నేసిన సిద్ధిఖీ దారుణానికి ఒడిగట్టాడు. ఓరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆమె గోడు వినిపించుకోని భర్త.. ఆమె పాలిట దుర్మార్గంగా ప్రవర్తించాడు. స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఇంట్లో నుంచి ఆమె పంపించేశాడు. దీంతో బాధితురాలు ఇండోర్‌ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: దేశ సరిహద్దుల్లో అమ్మాయిల మృతదేహాల కలకలం.. ఎలా చనిపోయారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement