husband arrest
-
టైం కోసం వేచి చూశాడు.. ఫ్రెండ్ ఇంట్లోలేడని తెలిసి ఆమెపై..
పెళ్లి చేసుకుని భార్యకు అండగా ఉండాల్సిన భర్తే.. ఆమె పాలిట కీచకుడయ్యాడు. భర్త స్నేహితుడు.. ఆమెపై అత్యాచారం చేసినా.. అదేదీ పట్టించుకోకుండా ఆమెకు విడాకుల ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భోపాల్‌కు చెందిన ఓ హిందూ మహిళ(28)కు మరో వర్గానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం.. సదరు మహిళ తన భర్త వర్గంలోకి మారింది. కాగా, మొదట్లో కొద్ది రోజుల బాగానే సాగిన వివాహ బంధంలో అడ్డంకులు ఎదురయ్యాయి. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రతీరోజు ఏదో ఒక విషయంలో వారి మధ్య తగువు జరుగుతూనే ఉంది. అయితే, వీరి సమస్యను తీర్చేందుకు భర్త స్నేహితుడు.. హసీబ్ సిద్ధిఖీ రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో తరచూ వారి ఇంటికి వస్తూ బాధితురాలిపై కన్నేసిన సిద్ధిఖీ దారుణానికి ఒడిగట్టాడు. ఓరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా, జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పి కన్నీరు పెట్టుకుంది. ఆమె గోడు వినిపించుకోని భర్త.. ఆమె పాలిట దుర్మార్గంగా ప్రవర్తించాడు. స్నేహితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా భార్యకు విడాకులు ఇచ్చాడు. అనంతరం ఇంట్లో నుంచి ఆమె పంపించేశాడు. దీంతో బాధితురాలు ఇండోర్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైంగిక దాడికి పాల్పడిన సిద్ధిఖీతోపాటు మహిళ భర్తను కూడా అరెస్ట్ చేశారు. ఇది కూడా చదవండి: దేశ సరిహద్దుల్లో అమ్మాయిల మృతదేహాల కలకలం.. ఎలా చనిపోయారు? -
శ్వేత బాడీపై గాయాలు.. భర్తే కీలక సూత్రధారి
దొడ్డబళ్లాపురం: భార్యను హత్య చేసిన భర్త ఆమె అనారోగ్యంతో మృతి చెందిందని నాటకమాడిన ఉదంతం నెలమంగల తాలూకా తోణచినకొప్పె గ్రామంలో వెలుగుచూసింది. చౌడేశ్ (35), తన భార్య శ్వేత (30)ను హత్య చేశాడు. చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా ఆలూరు గ్రామానికి చెందిన శ్వేతను తొమ్మిదేళ్ల క్రితం హిరియూరు తాలూకా కురుబరహళ్లికి చెందిన చౌడేశ్‌కిచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగపిల్లలు. హఠాత్తుగా బుధవారం రాత్రి శ్వేతకు అనారోగ్యంగా ఉందని నెలమంగల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చాడు చౌడేశ్. అయితే అప్పటికే ఆమె చనిపోయి ఉందని వైద్యులు తెలిపారు. శ్వేత అనారోగ్యంతో మృతి చెందిందని చౌడేశ్ నమ్మించాడు. మృతదేహాన్ని ఇంటికి తీసికెళ్లగా ఆమె దేహంపై గాయాల గుర్తులు కనబడ్డాయి. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చౌడేశ్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
లాడ్జిలో భర్త రాసలీలలు: నగ్న వీడియోలు తీసిన భార్య
జైపూర్ (రాజస్థాన్): ఆయనో జవాన్. ఇంట్లో కట్టుకున్న భార్య ఉంది. సంసారం సాఫీగా సాగుతుండగా.. భర్త ఫోన్ కాల్స్ నిత్యం మాట్లాడుతుండడం కాపురంలో చిచ్చు రేపింది. భర్తపై ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో భర్త బయటకు వెళ్లినప్పుడు నిఘా వేసింది. ఈసారి బయటకు వెళ్లిన భర్తను వెంబడించగా ఆయన ఓ లాడ్జికి వెళ్లాడు. కొద్దిసేపటికి భార్య మారుతాళంతో లాడ్జిలోని గదిని తెరిచి చూడగా నగ్నంగా భర్త, అతడి ప్రేయసి కనిపించారు. ఈ వీడియోను తీసి ఆమె పలువురికి షేర్ చేయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు చూసి తనను వేధిస్తున్నారని ఆ ప్రేయసి అతడి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తన భార్యతో కలిసి జైపూర్‌లో నివసిస్తున్నాడు. భార్య ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. అయితే ఆమె భర్తకు ఓ ప్రేయసి ఉంది. ఆమెతో తరచూ మాట్లాడుతుండడంతో అతడి భార్యకు అనుమానం వచ్చింది. తన భర్తకు వేరొకరితో సంబంధం ఉందని గుర్తించిన ఆమె భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భర్త ఫోన్లో మాట్లాడుతూ.. పలానా చోటకు రమ్మని తన ప్రేయసికి చెప్పాడు. ఇది తెలుసుకున్న భార్య కొద్దిసేపటికి భర్త వెళ్లిన లాడ్జికి వెళ్లింది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడి వారు ఉన్న గది మారుతాళం తీసుకుని పైకి వెళ్లింది. పోలీసుల సహాయంతో తాళం తెరచి చూడగా ఇద్దరూ భర్త, అతడి ప్రేయసి నగ్నంగా ఉన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీసిన వీడియోను పలువురికి పంపండంతో అవి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. రాజస్థాన్‌లో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఆ వీడియోలు బయటకు రావడంతో తన పరువు పోయిందని అతడి ప్రేయసి ఉల్టా భార్యపై ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలు చూసి తన బంధువులు మనస్తాపానికి గురయ్యాయని వాపోయింది. ప్రస్తుతం ఈ పంచాయితీ శాస్త్రీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కుక్క మలవిసర్జన..దంపతులపై కేసు!
భద్రాచలం: భద్రచలం పట్టణంలోని శిల్పినగర్‌కు చెందిన దంపతులపై సోమవారం కేసు నమోదైంది. కాగా, పోలీసుల కథనం ప్రకారం... శిల్పినగర్‌కు చెందిన నగేష్‌రెడ్డి దంపతులు ఒక పెంపుడు కుక్క ను పెంచుకొంటున్నారు. అయితే అది తరచుగా , వారి ఇంటికి ఎదురుగా ఉన్న వెంకటరమణ అనే వృద్ధురాలి ఇంటి గుమ్మం వద్దకు వెళ్లి మలమూత్ర విసర్జన చేస్తోంది. దీనిపై వృద్ధురాలు నగేష్‌రెడ్డి దంపతులను ఎన్నోమార్లు చెప్పింది. ప్రతిరోజు కుక్కరావడం ఆమె గుమ్మం ముందు మల విసర్జన చేయడం పరిపాటిగా మారింది. కాగా, ఆ దంపతులు మాత్రం ఎంతగా చెప్పినా పట్టించుకొలేదు. అయితే ఆ దంపతులు వృద్దురాలిపై కోపాన్ని పెంచుకున్నారు. నగేష్ దంపతులు వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపర్చారు. ఆమె వెంటనే నగేష్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. చదవండి: వైరల్: అమ్మో..పాము ఎంత భయంకరంగా దాడిచేసింది! -
చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్
సాక్షి, చెన్నై: బుల్లి తెర నటి చిత్ర మరణం కేసు ఓ కొలిక్కివచ్చింది. చచ్చిపో అంటూ ఆమెను భర్త హేమనాథ్ ప్రేరేపించినట్టు విచారణలో వెలుగుచూసింది. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాండియన్ స్టోర్స్ ముల్లై పాత్రధారిణి బుల్లి తెర నటి చిత్ర గతవారం చెన్నైలోని ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందన్న ఆరోపణలతో నషరత్‌పేట పోలీసులు కేసును తీవ్రంగానే పరిగణించాల్సి వచ్చింది. ఆమెతో పాటు హోటల్లో ఉన్న రిజిస్టర్ మ్యారేజ్ భర్త, ప్రియుడు హేమనాథ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరు రోజులుగా ఆయన వద్ద విచారించారు. తొలుత పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో కేసును పలు కోణాల్లో విచారించారు. అనేక మంది వద్ద విచారణ సాగింది. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చిత్ర ఆత్మహత్యకు హేమనాథ్ ప్రేరేపించినట్టు తేలింది. ఆ మేరకు వివరాలు.. చదవండి: (చిత్రను హేమనాథ్ కొట్టి చంపేశాడు..) అనుమానంతో.. లాక్డౌన్ కాలంలో ప్రేమలోపడ్డ చిత్ర, రియల్ వ్యాపారి హేమనాథ్ జంట, ఆంక్షల సడలింపుతో ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. తిరువాన్మీయూరులో ఓ ఇళ్లు నిర్మాణం, చెన్నై శివార్లలోని ఓ కల్యాణ వేదికలో హంగామా వివాహం కోసం షూటింగ్ బిజీలో ఉన్న చిత్రపై ప్రేమతో పాటు అనుమానం కూడా హేమనాథ్ పెంచుకున్నాడు. చివరకు హేమనాథ్ ఒత్తిడితో ఆమె రిజిస్టర్ మ్యారేజ్‌కు అంగీకరించక తప్పలేదు. ఆంక్షల సడలింపుతో రేయింబవళ్లు షూటింగ్ బిజీలో చిత్ర ఉండడంతో అనుమానం పెరిగింది. ఇది ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి షూటింగ్ స్పాట్‌కు వచ్చి ఆమెను వెంట పెట్టుకు వెళ్లే సమయంలో కారులో గొడవపడ్డాడు. హోటల్‌కు వెళ్లిన తర్వా కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో చచ్చిపో అంటూ గట్టిగా అరిచి గది నుంచి హేమనాథ్ బయటకు వచ్చేశాడు. దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఆత్మహత్యకు పాల్పడినట్టు విచారణలో తేలింది. అయితే, ఆమె ఆత్మహత్య ›ప్రేరణకు హేమనాథ్ కారణం కావడంతో ఆయన్ను సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. మంగళవారం పూందమల్లి కోర్టులో హాజరు పరిచినానంతరం పొన్నేరి జైలుకు తరలించారు. చదవండి: (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య) ఆర్డీవో విచారణ.... చిత్ర మరణం కేసు విచారణకు శ్రీపెరంబదూరు ఆర్డీఓ దివ్యశ్రీ శ్రీకారం చుట్టారు. ఆమె తల్లి విజయ, తండ్రి కామరాజ్, సోదరి సరస్వతి, సోదరుడు శరవణన్లను విచారించారు.హేమనాథ్ తండ్రి రవిచంద్రన్, తల్లి వసంతల వద్ద కూడా మంగళవారం విచారణ సాగింది. హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసిన దృష్ట్యా, ఆయన్ను విచారించాల్సి ఉంది. -
పోలీసుల నిర్బంధం నుంచి నా భర్తను విడిపించండి
విశాఖపట్నం, పాడేరు: పోలీసుల నిర్బంధం నుంచి తన భర్తను విడిపించాలని జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి కొసాయి అనే మహిళ వేడుకుంది బుధవారం ఆమె ఐటీడీఏ కార్యాలయానికి వచ్చి ప్రాజెక్టు అధికారి డి.కె. బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ వద్ద మొరపెట్టుకుంది. ఈ నెల 4న సోమవారం తన భర్త పాంగి బిర్సు వాహనం మరమ్మతుల కోసం వాకపల్లి నుంచి జి.మాడుగుల వచ్చారని, ఈ సందర్భంగా హోటల్ దగ్గర వేచి ఉన్న అతనిని జి.మాడుగుల పోలీసులు తీసుకెళ్లారని తెలిపింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐ, ఎస్ఐలను వాకబు చేయగా తమ వద్ద లేడని చెప్పారని కొసాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. తన భర్త ఆచూకీని పోలీసులు తెలియజేయడం లేదని, అధికారులు స్పందించి తన భర్తను పోలీసుల నిర్బంధం నుంచి విడిపించాలని వినతిపత్రం అందజేసింది. -
అక్రమ సంబంధం; నమ్మించి తోసేశాడు
గురుగ్రామ్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను మేడపై నుంచి తోసి చంపేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిందని పోలీసులతో నమ్మబలికాడు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె చావుకు కారణమైన భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ‘వాలీ వ్యూ ఎస్టేట్’ అపార్ట్మెంట్లో గత అక్టోబర్, 27న చోటుచేసుకుంది. వివరాలు.. దీపికా చౌహన్ (32), విక్రం చౌహన్ (35) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల పాప, 5 నెలల బాబు ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా విక్రం ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే షెఫాలి భాసిన్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగేవి. ఘటన జరిగిన రోజు సాయంత్రం విక్రం దీపికా మరోమారు గొడవపడ్డారు. ‘నీ వ్యవహారాలు నచ్చడం లేదు. నన్నూ.. నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఇప్పుడే వెళ్లి భాసిన్ అంతు చూస్తా’ అని దీపిక హెచ్చరించింది. దీంతో తన అక్రమ సంబంధం ‘చెడిపోతుంది’ అని భావించిన విక్రం తన భార్యను హతమార్చాలని పథకం రచించాడు. మంచిగా నటించి ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపికతో బాల్కనీలో కాసేపు ముచ్చటించాడు. ఆమెను నమ్మించి ఒక్కసారిగా 8 అంతస్తుల ఎత్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన దీపిక ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యలో విక్రమ్‌కి సహకరించాడనే అనుమానంతో మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎల్ఎఫ్ ఫేజ్-1 పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ సంజీవ్ కుమార్ వెల్లడించారు. -
అనుమానంతోనే భార్య హత్య
హత్య కేసులో నిందితుడి అరెస్ట్ కానిస్టేబుల్, మరో మహిళపై విచారణ తిరువూరు సీఐ వెల్లడి మేడూరు (గంపలగూడెం): భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు మేడూరులో ఈనెల 7వ తేదీ రాత్రి జరిగిన ఒక మహిళ హత్యకేసులో నిందితుడు భర్త నల్లగట్ల ప్రకాశరావు చెప్పాడు. గ్రామానికి చెందిన నల్లగట్ల నిర్మల (32)ను భర్త వెదురు బొంగుకర్రతో కొట్టిచంపినట్లు కేసు నమోదైంది. ఈ కేసులోమృతురాలి అన్న ఎక్కిరాల మోహన్‌రావు ఫిర్యాదు మేర కేసు నమోదు చేశారు. కాగా నిందితుడైన నిర్మల భర్త ప్రకాశరావును మంగళవారం గ్రామం సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ సమీపంలో అరెస్ట్ చేసినట్లు సీఐ కిషోర్‌బాబు తెలిపారు. తన భార్య వేరే వారితో వివాహేతర సంబంధం పెట్టుకొందన్న కారణంగానే క్షణికావేశంలో కర్రతో కొట్టగా చనిపోయిందని విచారణలో తెలిపినట్లు సీఐ వివరించారు. నిందితుడిని తిరువూరు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. కేసులో మరో ఇద్దరు నిందితులైన కానిస్టేబుల్ నల్లగట్ల సురేష్, మరో మహిళ చిలకమ్మలపై విచారణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎస్సై శివరామకృష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.