
ఐటీడీఏ పీవో వద్దకు వచ్చిన వాకపల్లి గ్రామస్తురాలు కొసాయి, కుటుంబ సభ్యులు
విశాఖపట్నం, పాడేరు: పోలీసుల నిర్బంధం నుంచి తన భర్తను విడిపించాలని జి.మాడుగుల మండలం వాకపల్లి గ్రామానికి చెందిన పాంగి కొసాయి అనే మహిళ వేడుకుంది బుధవారం ఆమె ఐటీడీఏ కార్యాలయానికి వచ్చి ప్రాజెక్టు అధికారి డి.కె. బాలాజీ, సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ వద్ద మొరపెట్టుకుంది. ఈ నెల 4న సోమవారం తన భర్త పాంగి బిర్సు వాహనం మరమ్మతుల కోసం వాకపల్లి నుంచి జి.మాడుగుల వచ్చారని, ఈ సందర్భంగా హోటల్ దగ్గర వేచి ఉన్న అతనిని జి.మాడుగుల పోలీసులు తీసుకెళ్లారని తెలిపింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి సీఐ, ఎస్‌ఐలను వాకబు చేయగా తమ వద్ద లేడని చెప్పారని కొసాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చింది. తన భర్త ఆచూకీని పోలీసులు తెలియజేయడం లేదని, అధికారులు స్పందించి తన భర్తను పోలీసుల నిర్బంధం నుంచి విడిపించాలని వినతిపత్రం అందజేసింది.
Comments
Please login to add a commentAdd a comment