
భద్రాచలం: భద్రచలం పట్టణంలోని శిల్పినగర్‌కు చెందిన దంపతులపై సోమవారం కేసు నమోదైంది. కాగా, పోలీసుల కథనం ప్రకారం... శిల్పినగర్‌కు చెందిన నగేష్‌రెడ్డి దంపతులు ఒక పెంపుడు కుక్క ను పెంచుకొంటున్నారు. అయితే అది తరచుగా , వారి ఇంటికి ఎదురుగా ఉన్న వెంకటరమణ అనే వృద్ధురాలి ఇంటి గుమ్మం వద్దకు వెళ్లి మలమూత్ర విసర్జన చేస్తోంది. దీనిపై వృద్ధురాలు నగేష్‌రెడ్డి దంపతులను ఎన్నోమార్లు చెప్పింది. ప్రతిరోజు కుక్కరావడం ఆమె గుమ్మం ముందు మల విసర్జన చేయడం పరిపాటిగా మారింది.
కాగా, ఆ దంపతులు మాత్రం ఎంతగా చెప్పినా పట్టించుకొలేదు. అయితే ఆ దంపతులు వృద్దురాలిపై కోపాన్ని పెంచుకున్నారు. నగేష్ దంపతులు వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాడి చేసి గాయపర్చారు. ఆమె వెంటనే నగేష్ దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment