మధ్యప్రదేశ్‌లో ‘ఆప్‌’ పాగా.. మేయర్‌ పీఠం కైవసం | AAP Candidate Rani Agrawal Wins MP Singrauli mayor seat | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లోకి ‘ఆప్‌’ గ్రాండ్‌ ఎంట్రీ.. మేయర్‌ పీఠం కైవసం

Published Mon, Jul 18 2022 7:48 AM | Last Updated on Mon, Jul 18 2022 7:48 AM

AAP Candidate Rani Agrawal Wins MP Singrauli mayor seat - Sakshi

భోపాల్‌: దేశ రాజధాని ఢిల్లీతోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్‌ ఎన్నికల్లో మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి రాణి అగర్వాల్‌ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రకాశ్‌ విశ్వకర్మను 9,352 ఓట్ల తేడాతో ఓడించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితమయ్యారు. మధ్యప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ నెగ్గడం ఇదే తొలిసారి.    

2014లో తొలిసారి జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన రాణి అగర్వాల్‌.. తాజాగా సింగ్రౌలీ మేయర్‌గా విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె పోటీ చేసినప్పటికీ పరాజయం పాలయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఆమెకు మద్దతుగా ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రచారంలో పాల్గొని రోడ్‌ షో నిర్వహించారు. తాజా ఫలితాల్లో రాణి అగర్వాల్‌ విజయం సాధించటంతో సింగ్రౌలీ మేయగా గెలిచారు.

సింగ్రౌలీ మేయర్‌గా ఎన్నికైన రాణి అగర్వాల్‌తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ఆప్‌ నేతలకు ఆ పార్టీ కన్వినర్‌ అరవిందక్‌ కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆప్ నిజాయతీ రాజకీయలాను దేశవ్యాప్తంగా ప్రజలందరూ విశ్వసిస్తున్నారని అన్నారు.

ఇదీ చూడండి: Margaret Alva: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement