ఐఎఎఫ్‌ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ | Helicopter Made a Precautionary Landing near Bhopal | Sakshi
Sakshi News home page

ఐఎఎఫ్‌ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

Published Sun, Oct 1 2023 12:26 PM | Last Updated on Sun, Oct 1 2023 12:37 PM

Helicopter Made a Precautionary Landing near Bhopal - Sakshi

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఐఎఎఫ్‌హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధ్రువ్ హెలికాప్టర్ భోపాల్ సమీపంలో ముందుజాగ్రత్తగా ల్యాండ్‌ అయ్యింది. 

ప్రాథమికంగా అందిన వార్తల ప్రకారం హెలికాప్టర్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అందులో ఆరుగురు సైనికులు ఉన్నారని ఐఏఎఫ్ వర్గాలు తెలిపాయి. సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ భోపాల్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని పొలంలో దిగాల్సి వచ్చింది. 

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆ హెలికాప్టర్ ఆనకట్టపై చాలా సేపు చెక్కర్లు కొట్టింది. అనంతరం కిందకు ల్యాండ్‌ అయ్యింది. బెరాసియాలోని డూమారియా గ్రామంలోని ఆనకట్ట సమీపంలో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండింగ్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హెలికాప్టర్ ల్యాండ్‌ అయిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. వీడియోలో హెలికాప్టర్ చుట్టూ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా కనిపిస్తున్నారు. కాగా ఈ హెలికాప్టర్‌ను చూసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ జవానులు సాంకేతిక నిపుణుల రాక కోసం ఎదురు చూస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత సంతతి జడ్జి చేతిలో గూగుల్‌ భవితవ్యం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement