Bhopal Man Made To Bark Like A Dog Case File - Sakshi
Sakshi News home page

కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..

Published Mon, Jun 19 2023 3:52 PM | Last Updated on Mon, Jun 19 2023 5:47 PM

Bhopal Man Made to Bark Like a Dog Case File - Sakshi

మధ్యప్రదేశ్‌:మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని కుక్కలా అరవమని ఆదేశిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ గుంపు బాధితుని చుట్టూ చేరి క్షమాపణలు కోరమని చెబుతూ కుక్కలా అరవమని డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తు చేసి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. 

50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంత మంది యువకులు ఓ వ్యక్తిని వేధిస్తున్నారు. 'కుక్కలా నటించు..క్షమాపణలు చెప్పు' అంటూ అతని చుట్టూ చేరి అరుస్తున్నారు. గుంపులో ఓ వ్యక్తి బాధితున్ని బిగ్గరగా పట్టుకుని ఉన్నాడు. 'సాహిల్ నా తండ్రి, సాహిల్ నా అన్నయ్య లాంటివాడు' అంటూ బాధితుడు అరుస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి..' ఆ వీడియోను చూశాను. ఇలాంటి స్వభావాన్ని ఖండిస్తున్నాం. దర్యాప్తు చేయాలని కమిషనర్‌ను ఆదేశించాం. దోషులకు కఠిన శిక్షలు విధిస్తాం' అని అన్నారు. 

సాహిల్, అతని గ్యాంగ్ తమ వ్యక్తికి డ్రగ్స్, మాంసం అలవాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మతం మారాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. బాధితుడు తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసేలా సాహిల్ గ్యాంగ్ ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని, వీడియో వైరల్ అయ్యాక కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై పోలీసు స్టేషన్ ముందు బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు

   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement