bark
-
అర్జున బెరడు గురించి విన్నారా? దీని ఔషధ గుణాలు తెలిస్తే..!
అర్జున చెట్టు లేదా తెల్ల మద్ది గురించి ఎపుడైనా విన్నారా? ఈ చెట్టు నుంచి తీసిన బెరడులో బోలెడన్ని ఔషధ గుణాలున్నాయి. అర్జున బెరడు తెలుపు, ఎరుపు రంగులను కలగలసి ఉంటుంది. పలు రకాల ఔషధాల తయారీలో దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. దీని అద్భుత ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.దీని బొటానికల్ పేరు: టెర్మినలియా అర్జున. దీని బెరడు గుండెకు టానిక్‌గా పనిచేస్తుందట. ఈ చెట్టు గురించిన ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. గుండె జబ్బులు, శ్వాసకోసం వ్యాధులు మొదలు సంతాన లేమి సమస్యలతో బాధపడే పురుషులకు కూడా ఇది దివ్యౌషధంలా పని చేస్తుంది.ఎముకల బలహీనతతో బాధ పడే వారికి అర్జున బెరడుచాలా ఉపయోడపడుతుంది. అర్జున బెరడును మెత్తగా పొడి చేసి, తేనె కలిపి రోజుకు పావు స్పూన్ చొప్పున తీసుకుంటే బలహీనమైన ఎముకలు దృఢంగా మారతాయి. ఫ్యాటీ లివర్ వ్యాధికి చక్కటి పరిష్కారం అర్జున బెరడు.అలాగే వాతావరణం చల్లగా ఉన్నపుడు గోరు వెచ్చటి పాలల్లో అర్జున బెరడు పొడిని అర స్పూన్ చప్పున కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి. ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులకు కూడా మంచి పరిష్కారం ఇది.సంతాన సమస్యలతో బాధ పడే పురుషులు రోజూ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకోవాలి. దీంతో వీర్య కణాల వృద్ధిచెంది సంతాన భాగ్యం కలిగే అవకాశాలు పెరుగుతాయి.అర్జున బెరడుతో కషాయాన్ని తయారు చేసుకుని తరచూ తీసుకుంటే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ధమనులు, సిరల్లో రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేస్తుంది. లిపో ప్రోటీన్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌కు చెక్ పెడుతుంది. కడుపు అల్సర్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తిని వృద్ది చేస్తుంది. రక్త పోటు స్థాయిలను నియంత్రిస్తుంది. శారీరక ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా అర్జున బెరడు పొగాకు, ధూమపానం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో తోడ్పడుతుంది.కణుతుల పెరుగుదలను నియంత్రించడంలోఉపయోగపడుతుంది. అర్జున బెరడులోని విటమిన్ ఈ కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల అర్జున బెరడు తోడ్పడుతుంది. -
ఆ వెయ్యిమంది రైల్వే స్టేషన్లో కుక్కల్లా ఎందుకు మొరిగారు?
మీరు ఎక్కడికైనా వెళ్లినప్పుడు వందలాది మంది ఒకే చోట గుమిగూడి మిమ్మల్ని చూసి కుక్కలా మొరిగితే మీకు ఏమనిపిస్తుంది? ఎవరైనా సరే ఇటువంటి అనుభవం ఎదురైతే ఆశ్చర్యపోతారు. అవహేళన చేస్తున్నారేమోనని అనుకుంటారు. ఇటువంటి ఉదంతం బెర్లిన్‌లోని పోట్స్‌డామర్ ప్లాట్జ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే స్టేషన్ వెలుపల సుమారు వెయ్యి మంది జనం ఒకచోట గుమిగూడారు. అయితే ఉన్నట్టుండి కుక్కలా మొరగడం మొదలుపెట్టారు. రైల్వేస్టేషన్లో ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వారు సామూహికంగా మొరుగుతూ అటువైపు వచ్చిపోయే వారితో మాట్లాడుతున్నారు. ‘డైలీ మెయిల్’ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే స్టేషన్ వెలుపల సామూహికంగా కుక్కల్లా మొగిన వ్యక్తులను ట్రాన్స్-స్పెసీస్ అని అంటారు. వీరు తమను తాము కుక్కలుగా భావిస్తుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంటిపై పాక్ జెండా ఎగురవేసిన తండ్రీకుమారులు అరెస్ట్ Hundreds of people who identify as dogs gathered at the Potsamer Platz railroad station, in central Berlin, on Tuesday for a meeting organized by a group called 'Canine Beings' which advocates for the rights of people who identify as #dogs. Germany. pic.twitter.com/n3Wj13SeIC — Funny News Hub (@Funnynewshub) September 20, 2023 -
కుక్కలా అరవమని వేధిస్తూ..యువకుల పిచ్చి చేష్టలు..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని కుక్కలా అరవమని ఆదేశిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ గుంపు బాధితుని చుట్టూ చేరి క్షమాపణలు కోరమని చెబుతూ కుక్కలా అరవమని డిమాండ్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తు చేసి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా పోలీసులను ఆదేశించారు. 50 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో కొంత మంది యువకులు ఓ వ్యక్తిని వేధిస్తున్నారు. 'కుక్కలా నటించు..క్షమాపణలు చెప్పు' అంటూ అతని చుట్టూ చేరి అరుస్తున్నారు. గుంపులో ఓ వ్యక్తి బాధితున్ని బిగ్గరగా పట్టుకుని ఉన్నాడు. 'సాహిల్ నా తండ్రి, సాహిల్ నా అన్నయ్య లాంటివాడు' అంటూ బాధితుడు అరుస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన రాష్ట్ర హోం మంత్రి..' ఆ వీడియోను చూశాను. ఇలాంటి స్వభావాన్ని ఖండిస్తున్నాం. దర్యాప్తు చేయాలని కమిషనర్‌ను ఆదేశించాం. దోషులకు కఠిన శిక్షలు విధిస్తాం' అని అన్నారు. సాహిల్, అతని గ్యాంగ్ తమ వ్యక్తికి డ్రగ్స్, మాంసం అలవాటు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మతం మారాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. బాధితుడు తన సొంత ఇంట్లోనే దొంగతనం చేసేలా సాహిల్ గ్యాంగ్ ఒత్తిడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, వీడియో వైరల్ అయ్యాక కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ అంశంపై పోలీసు స్టేషన్ ముందు బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనలు చేపట్టారు. జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఇదీ చదవండి:పరువుహత్య చేసి.. బండరాళ్లు కట్టి మొసళ్లకు మేతగా పడేశారు -
విశాఖ సిగలో మరో మణిహారం
సాక్షి, విశాఖపట్నం: భారతదేశ కీలక రక్షణ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్న విశాఖపట్నం సిగలో మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. యుద్ధ విమానాలు, ఆయుధాల్లో వినియోగించే అరుదైన అయస్కాంతాల తయారీ కేంద్రమైన రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్ ప్లాంట్ (ఆర్ఈపీఎం) సేవలకు శ్రీకారం చుట్టారు. రూ.197 కోట్లతో ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ (ఐఆర్ఈఎల్) ఈ ప్లాంట్‌ని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ప్రాంగణంలో పూర్తిచేసింది. ఏడాదికి 3 వేల కిలోల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మితమైన ఈ ప్లాంట్‌ను నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతికి అంకితం చేశారు. అచ్యుతాపురంలోని ‘బార్క్’ కేంద్రం సమీపంలో 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఆర్ఈపీఎం నిర్మాణ పనులు 2021లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది మార్చిలో పూర్తయ్యాయి. ఈ ప్లాంట్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈఎల్ దీనిని ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నిర్మించింది. ఏడాదికి 3 వేల కిలోల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్ సేవలు మొదలయ్యాయి. యుద్ధ విమానాల్లో వినియోగించేలా.. ఈ ప్లాంట్‌లో సమారియం, కోబాల్ట్, నియోడైమియం, ఐరన్, బోరాన్ వంటి అరుదైన అయస్కాంతాలను ఉత్పత్తి చేయనున్నారు. వీటిని టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, మైక్రో ఎలక్ట్రానిక్స్, విండ్ టర్బైన్ల నిర్మాణంలో వినియోగిస్తారు. ముఖ్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్ వంటి అత్యాధునిక ఆయుధాల తయారీలోనూ ఈ తరహా అరుదైన మాగ్నెట్స్‌ని ఉపయోగిస్తుంటారు. అంతేకాక.. ఇటీవల తయారవుతున్న హైటెక్నాలజీ ఉత్పత్తుల్లో రేర్ మాగ్నెట్స్ కీలకంగా మారనున్నాయి. ఇన్నాళ్లూ వీటిని వివిధ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్లు. దీనివల్ల అణుశక్తి, క్షిపణులు, రక్షణ విభాగంలో పరికరాల తయారీ.. అంతరిక్షం, ఇతర వ్యూహాత్మక రక్షణ వ్యవస్థల్లో అభివృద్ధికి కొంచెం అవరోధంగా ఉండేది. దీంతో ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటి తయారీకి శ్రీకారం చుట్టారు. ఇక ఈ రేర్ మాగ్నెట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండటంతో ఎగుమతుల విషయంలోనూ భారత్ తనదైన ముద్ర వేసుకోనుంది. -
గడువులోగా హామీని నెరవేర్చండి
వేముల : టెయిలింగ్ పాండ్ పరిధిలోని రైతులకు ఇచ్చిన హామీని గడువులోగా నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలని, వారిలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి యూసీఐఎల్ సీఎండీ హస్నానిని కోరారు. ఈ మేరకు ఆయన యూసీఐఎల్ సీఎండీ హస్నానితో ఫోన్లో మంగళవారం మాట్లాడారు. రైతులకు ఈనెల 9వ తేదీలోగా పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. రైతులకు టెయిలింగ్ పాండ్ వ్యర్థాలతో నష్టాలు జరిగితే ఊరుకునేది లేదని, రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుందన్నారు. నెలరోజులుగా పరిస్థితి అలాగే ఉందని, ఆ పంట పొలాల్లో తెల్ల ని పదార్థం మేట వేస్తోందని, ఎలాంటి మార్పు లేదని ఆయనకు వివరించారు. మీ పర్యటన ఖరారైతే ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు, శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి యురేనియం ప్రాజెక్టులో కానీ , గ్రామాల్లో కానీ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వారి వారి అనుమానాలను నివృత్తి చేయడమేకాక పరిష్కా రం చూపాలన్నారు. స్పందించిన సీఎండీ హస్నాని, బాబా అటానమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) శాస్త్రవేత్తలు కలుషిత సాగునీటితో దెబ్బతిన్న పంట పొలాల్లో మట్టి నమూనాలను, బోర్లలోని నీటిని శాంపిల్స్ తీసుకుని వెళ్లారని, వారి నివేదిక అందిన తర్వాతనే పరిష్కార చర్యలు వివరిస్తామన్నారు. ఇందుకు ఈనెల 10, 11వ తేదీలలో యురేనియం ప్రాజెక్టుకు రానున్నట్లు సీఎండీ హస్నాని ఎంపీకి తెలియజేశారు. అలాగే మండలంలోని కె.కె.కొట్టాల, తుమ్మలపల్లె, పులివెందుల మండలం కనంపల్లె గ్రామాలకు పార్నపల్లె నీటిని ట్యాంకులకు నింపుతామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
కుక్కముందు తోకముడిచిన చిరుత
ముంబయి: సరిగ్గా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతం. ఆ బంగ్లాలో ఉన్నవారంతా నిద్రపోతున్నారు. ఇంటికి కాపలా కాసే కుక్క కూడా గుర్రు పెట్టి నిద్రతీస్తుంది. ఈలోపు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఆ ఇంటి ప్రాంగణంలోకి చిరుత పులి ప్రవేశించింది. బాగా ఆకలితో ఉన్నదనుకుంటా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కసిగా కుక్కపై దాడి చేయాలనుకుంది. కాని, ఆ కుక్క ఇంటిలోపలికి వెళ్లే ప్రవేశ ద్వారానికి ముందున్న గదిలో ఉంది. లోపలికి దూరిపోదామంటే మొత్తం ఇనుపచువ్వలు పెట్టి కట్టారు. దీంతో ఆ గది చుట్టే అటూ ఇటూ తిరుగుతూ చివరికి తన పంజాను ఇనుపచువ్వల నుంచే దూర్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే గాండ్రుమంటూ శబ్దం చేసింది. ఇంతలో కుక్కకు మెలకువ వచ్చి విశ్వాస విశ్వరూపాన్ని చిరుతకు చూపించింది. ఏమాత్రం జంకూబొంకూ లేకుండా చెవులు చిల్లులుపడేలా దానికి ఎదురపడి అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు చిరుత జంకి అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. ఇదంతా ముంబయి శివారు ప్రాంతంలోని ఓ బంగ్లాలో చోటు చేసుకుంది. ఆ బంగ్లాకు వెలుపల బిగించిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం నమోదైంది. రోజువారి తనిఖీలో భాగంగా చూసిన ఇంటి యజమానులు ఆ సీన్ చూసి అదిరిపడ్డారు. ఒక వేళ నిజంగా చిరుత ఇంట్లోకి వచ్చినట్లయితే అనుకుని భయపడిపోయారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టగా అది నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.