విశాఖ సిగలో మరో మణిహారం  | Commencement of rare earth permanent magnet plant with Rs197 crores | Sakshi
Sakshi News home page

విశాఖ సిగలో మరో మణిహారం 

Published Sat, May 13 2023 5:17 AM | Last Updated on Sat, May 13 2023 5:26 AM

Commencement of rare earth permanent magnet plant with Rs197 crores - Sakshi

సాక్షి, విశాఖపట్నం: భారతదేశ కీలక రక్షణ కేంద్రంగా ఇప్పటికే వెలుగొందుతున్న విశాఖపట్నం సిగలో మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. యుద్ధ విమా­నాలు, ఆయుధాల్లో వినియోగించే అరుదైన అయస్కాంతాల తయారీ కేంద్రమైన రేర్‌ ఎర్త్‌ పర్మినెంట్‌ మాగ్నెట్‌ ప్లాంట్‌ (ఆర్‌ఈపీఎం) సేవలకు శ్రీకారం చుట్టారు. రూ.197 కోట్లతో ఇండియన్‌ రేర్‌ ఎర్త్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌ఈఎల్‌) ఈ ప్లాంట్‌ని బాబా ఆటమిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ప్రాంగణంలో పూర్తిచేసింది.

ఏడాదికి 3 వేల కిలోల ఉత్పత్తి సా­మ­ర్థ్యంతో నిర్మితమైన ఈ ప్లాంట్‌ను నేషనల్‌ టెక్నాలజీ డే సందర్భంగా ప్రధాని మోదీ గురువారం జాతికి అంకితం చేశారు. అచ్యుతాపురంలోని ‘బార్క్‌’ కేంద్రం సమీపంలో 2.92 ఎకరాల విస్తీర్ణంలో ఆర్‌ఈపీఎం నిర్మాణ పనులు 2021లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది మార్చిలో పూర్తయ్యాయి.

ఈ ప్లాంట్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించా­రు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్‌ఈఎల్‌ దీనిని ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నిర్మించింది. ఏడాదికి 3 వేల కిలోల అరుదైన అయస్కాంతాల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్‌ సేవలు మొదలయ్యాయి. 

యుద్ధ విమానాల్లో వినియోగించేలా.. 
ఈ ప్లాంట్‌లో సమారియం, కోబాల్ట్, నియోడైమియం, ఐరన్, బోరాన్‌ వంటి అరుదైన అయస్కాంతా­లను ఉత్పత్తి చేయనున్నారు. వీటిని టెలీకమ్యూ­­­­నికేషన్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలు, మైక్రో ఎల­క్ట్రానిక్స్, విండ్‌ టర్బైన్ల నిర్మాణంలో వినియోగిస్తారు. ముఖ్యంగా యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌ వంటి అత్యాధునిక ఆయుధాల తయారీలోనూ ఈ తరహా అరుదైన మాగ్నెట్స్‌ని ఉపయోగిస్తుంటా­రు.

అంతేకాక.. ఇటీవల తయారవుతున్న హై­టెక్నాలజీ ఉత్పత్తుల్లో రేర్‌ మాగ్నెట్స్‌ కీలకంగా మా­రనున్నాయి. ఇన్నాళ్లూ వీటిని వివిధ దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునేవాళ్లు. దీనివల్ల అణుశక్తి, క్షిపణులు, రక్షణ విభాగంలో పరికరాల తయారీ.. అంతరిక్షం, ఇతర వ్యూహాత్మక ర­క్ష­­ణ వ్యవస్థల్లో అభివృద్ధికి కొంచెం అవరోధంగా ఉండేది. దీంతో ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వీటి తయారీకి శ్రీకా­రం చుట్టారు. ఇక ఈ రేర్‌ మాగ్నెట్స్‌కు ప్రపంచవ్యా­ప్తంగా డిమాండ్‌ ఉండటంతో ఎగుమతుల విషయంలోనూ భారత్‌ తనదైన ముద్ర వేసుకోనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement