భోపాల్: లోక్‌సభ ఎన్నికల రెండు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇదివరకు నమోదైన విధంగా తక్కువ ఓటింగ్ శాతాన్ని పరిష్కరించడానికి లేదా ఓటింగ్ శాతాన్ని పెంచుకోవడానికి భోపాల్‌లోని అధికారులు ఓ కొత్త వ్యూహాన్నిరూపొందించారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తించి.. ఓటర్లను ఆకర్శించడానికి (ఓటు హక్కును వినియోగించుకోవడానికి) లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు కంకణం కట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే 13 ఎంపీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన స్థానాలకు మూడు, నాలుగవ దశల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశల్లో ఓటర్లను ఎక్కువ సంఖ్యలో ఆకర్శించడానికి పోలింగ్ రోజు ప్రతి రెండు గంటలకు ఒక లక్కీ డ్రా నిర్వహించడానికి అధికారులు సంకల్పించారు.
లక్కీ డ్రాలో డైమండ్ రింగ్స్, రిఫ్రిజిరేటర్‌లు, టెలివిజన్ వంటి ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అంతటా 8.5 శాతం ఓటింగ్ తగ్గింది. 2019 ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం 65.7% మాత్రమే. ఈ సారి మాత్రం ఓటు హక్కును తప్పకుండా అందరూ ఉపయోగించుకోవాలని అనే నేపథ్యంలో ఈ లక్కీ డ్రా విధానం ప్రవేశపెట్టారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఈ లక్కీ డ్రా గురించి మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ప్రతి బూట్ వద్ద ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 6 గంటలకు లక్కీ డ్రాలో విజేతలను ప్రకటిస్తాము. ఎన్నికలు పూర్తయిన ఒకటి లేదా రెండు రోజుల్లో వారికి గిఫ్ట్స్ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓటరులో చైతన్యాన్ని తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కౌశలేంద్ర పేర్కొన్నారు.
భోపాల్ పార్లమెంటరీ నియోజకవర్గం 2,097 పోలింగ్ బూత్‌లను కలిగి ఉంది. పోలింగ్ రోజున ప్రతి పోలింగ్ బూత్ వద్ద ఒక వాలంటీర్‌ను నియమిస్తారు. ఓటు వేసిన తరువాత ఓటరు పేరు, మొబైల్ నెంబర్ రాసి వారి దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత జరిగే లక్కీ డ్రాలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.
#SVEEP के अंतर्गत 'राज्य स्तरीय स्लोगन प्रतियोगिता'
▶️प्रविष्टि भेजने की अंतिम तिथि आज
▶️“प्रत्येक वोट जरूरी है” विषय पर लिखें स्लोगन और जीतें आकर्षक पुरस्कार
➡️प्रविष्टि भेजने के लिए विजिट करें 👇https://t.co/ZX4TawpjyZ @rajivkumarec @ECISVEEP @SpokespersonECI pic.twitter.com/f4CSpBaKDK— Chief Electoral Officer, Madhya Pradesh (@CEOMPElections) April 30, 2024
Comments
Please login to add a commentAdd a comment