15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం | 15 year old girl molestation in Bhopal | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

Published Thu, Sep 16 2021 6:43 AM | Last Updated on Thu, Sep 16 2021 6:43 AM

15 year old girl molestation in Bhopal - Sakshi

రైజెన్‌: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు కలసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా నిందితులు వీడియో రికార్డు చేశారని పోలీసులు బుధవారం వెల్లడించారు. తన సోదరికి సాయం చేసేందుకు 10వ తరగతి చదువుతున్న బాధితురాలు గుంగాకు వెళ్లింది. ఆమె సోదరి ఆస్పత్రిలో ఉండగా, బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే సమయంలో తమ బంధువు ఉన్నాడా అంటూ ఓ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న నిందితుడు మరో ఇద్దరితో కలసి బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటననంతా నిందితులు కలసి వీడియో కూడా తీశారు. బాలిక తిరిగి తన ఇంటికి వచ్చాక తండ్రికి ఈ విషయం చెప్పింది. వెంటనే వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement