Bhopal ISSF World Cup: మనూ భాకర్‌కు కాంస్యం | Bhopal ISSF World Cup: Manu Bhaker wins bronze in 25m pistol | Sakshi
Sakshi News home page

Bhopal ISSF World Cup: మనూ భాకర్‌కు కాంస్యం

Published Sun, Mar 26 2023 5:58 AM | Last Updated on Sun, Mar 26 2023 5:58 AM

Bhopal ISSF World Cup: Manu Bhaker wins bronze in 25m pistol - Sakshi

భోపాల్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత్‌ ఖాతాలో ఆరో పతకం చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో మనూ భాకర్‌ (20 పాయింట్లు) కాంస్య పతకం గెలుచుకుంది. టోర్నీలో భాకర్‌కు ఇదే మొదటి పతకం. ఈ పోరులో డొరీనా (30 పాయింట్లు), జియూ డు (29 పాయింట్లు) స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు.

ఇదే విభాగంలో మరో భారత షూటర్, తెలంగాణకు చెందిన ఇషా సింగ్‌ పతకం సాధించడంలో విఫలమైంది. శనివారం ఈవెంట్లు ముగిసే సరికి భారత్‌ 1 స్వర్ణం, 1 రజతాలు, 4 కాంస్యాలతో రెండో స్థానంలో కొనసాగుతుండగా...6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు (మొత్తం 10 పతకాలు) చైనా అగ్ర స్థానంలో నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement