జోహర్‌ కప్‌లో యువ భారత్‌కు కాంస్య పతకం | Bronze medal for India in Johar Cup | Sakshi
Sakshi News home page

జోహర్‌ కప్‌లో యువ భారత్‌కు కాంస్య పతకం

Oct 27 2024 4:00 AM | Updated on Oct 27 2024 9:08 AM

Bronze medal for India in Johar Cup

సుల్తాన్‌ జొహర్‌ కప్‌ అండర్‌–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది. మలేసియా వేదికగా శనివారం జరిగిన కాంస్య పతక పోరులో భారత జట్టు షూటౌట్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి కాంస్యం ఖాతాలో వేసుకుంది. 

గోల్‌కీపర్‌ బిక్రమ్‌జిత్‌ సింగ్‌ ప్రత్యర్థి మూడు గోల్స్‌ ప్రయత్నాలను అడ్డుకోవడంతో భారత జట్టు విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్‌ చేయగా... ఫలితం తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్‌లో భారత్‌ 3–2తో గెలుపొందింది. షూటౌట్‌లో భారత్‌ తరఫున గుర్‌జోత్‌ సింగ్, మన్‌మీత్‌ సింగ్, సౌరభ్‌ ఆనంద్‌ గోల్‌ కొట్టారు.

అంతకుముందు భారత్‌ తరఫున దిల్‌రాజ్‌ సింగ్‌ (11వ నిమిషంలో), మన్‌మీత్‌ సింగ్‌ (20వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... న్యూజిలాండ్‌ తరఫున బ్రౌన్‌ (51వ ని.లో), జాంటీ ఎల్మ్స్‌ (57వ ని.లో) చెరో గోల్‌ చేశారు. ఆరంభం నుంచి మ్యాచ్‌పై పట్టు కొనసాగించిన భారత జట్టు... చివరి క్వార్టర్‌లో ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇచ్చింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement