భోపాల్: ఓ కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచార దాడి మరువకముందే మధ్యప్రదేశ్‌లో మరో పోలీస్ అధికారిణికి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె డ్రైవర్ ఏకంగా ఆమె ఇంట్లోనే బాత్రూమ్‌లో కెమెరా పెట్టి ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రస్తుతం అతడిని గాలిస్తున్నారు.
చదవండి: అంగన్‌వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
ఓ పోలీస్ అధికారిణికి డ్రైవర్‌గా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22వ తేదీన కానిస్టేబుల్ ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపుపై వీడియో రికార్డింగ్ ఆన్ చేసి సెల్‌ఫోన్ ఉంచాడు. స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్‌ఫోన్ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
చదవండి: మగువ, మందుతో ఖాకీలకు వల.. సవాల్‌గా కార్పొరేటర్ భర్త కేసు
దీంతో ఆమె పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రామ్జీ శ్రీవాస్తవ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment