Bhopal-Delhi Vande Bharat Express catches fire, passengers safe - Sakshi
Sakshi News home page

వీడియో: వందే భారత్‌ రైలులో మంటలు.. భయంతో పరుగు తీసిన ప్రయాణీకులు

Published Mon, Jul 17 2023 8:42 AM | Last Updated on Mon, Jul 17 2023 9:24 AM

Bhopal-Delhi Vande Bharat Express Train Coach Catches Fire - Sakshi

భోపాల్‌: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు చెలరేగాయి. భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌‍ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైలులోని సీ-14 కోచ్‌ వద్ద మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో భయంతో ప్రయాణీకులు పరుగు తీశారు. 

వివరాల ‍ప్రకారం.. సోమవారం ఉదయం వందే భారత్‌ రైలు భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలు దేరింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో రైల్వే సిబ్బంది మంటలను గుర్తించిన వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. దీంతో, రైలును అక్కడే నిలిపివేశారు. ఈ క్రమంలో అగ్నిమాపక దళం అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పివేశారు. రైలులో ‍మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. 

ఇది కూడా చదవండి: వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లపై రాళ్ల దాడులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement