భోపాల్: మధ్యప్రదేశ్‌లో దసరా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహాల నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో ఓ కారు జనాలపైకి దూసుకేళ్లింది. ఈ ఘటన శనివారం భోపాల్‌లోని బజారియా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారకుడైన కారు డ్రైవర్‌ను పట్టుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
కారును రివర్స్ తీసే క్రమంలో వేగం అదుపు తప్పి జనంపైకి దూసికేళ్లింది. ఈ ఘటనలో గాయపడిన ఓ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భోపాల్ డీఐజీ ఇర్షాద్ వలీ మాట్లాడుతూ.. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశామని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Two people were injured after a car rammed into people during Durga idol immersion procession in Bhopal's Bajaria police station area yesterday. Police said the car driver will be nabbed.#MadhyaPradesh pic.twitter.com/rEOBSbrkGW
— ANI (@ANI) October 17, 2021
Comments
Please login to add a commentAdd a comment