భోపాల్: కాంగ్రెస్ హయాంలో గిరిజనుల సంక్షేమం మరుగునపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. గత పాలకుల వల్ల ఇప్పటికీ వెనుకబాటుకు గురైన ప్రాంతాల అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని అన్నారు. సోమవారం ఆయన భోపాల్‌లో జన్‌జాతీయ గౌరవ్ దివస్ మహాసమ్మేళన్‌లో మాట్లాడారు. అనంతరం ప్రధాని ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు. ‘గత ప్రభుత్వాల్లో గిరిజనులకు సముచిత స్థానం దక్కలేదు. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేదు. అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్‌సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం’అని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈపీఐ దిశగా పరివర్తన: గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోందని ప్రధాని చెప్పారు.‘వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి ఒకరూ ముఖ్యులే) అన్న ఆదర్శం దిశగా దేశం పరివర్తన చెందుతోందనడానికి ఇదే ఉదాహరణ. దేశవ్యాప్తంగా 175 రైల్వే స్టేషన్లలో ఇటువంటి అత్యాధునిక వసతులను సమకూరుస్తాం’అని చెప్పారు గత ప్రభుత్వాల హయాంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 40–50 ఏళ్లు పట్టేంది. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,100 కిలోమీటర్ల ఈస్టర్న్, వెస్టర్న్ ఫ్రెయిట్ కారిడార్ల పనులు ఏడేళ్లలోపే పూర్తయిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment