నెలక్రితం పిల్లలకు విషమిచ్చి చంపి పరారైన భార్యాభర్తలు
అటవీ ప్రాంతంలో గుట్టపై చెట్టుకు ఉరివేసుకొని మృతి
మృతదేహాలను జంతువులు తినడంతో మిగిలిన అస్తిపంజరాలు
మరణాలకు కారణం ఇంకా మిస్టరీగానే
మహబూబాబాద్ జిల్లా: నెల రోజుల క్రితం పిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అడవిలో అస్తి పంజరాలయ్యారు. భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరి వేసుకున్నారు. భర్త మృతదేహం అస్తిపంజరమై చెట్టుకు వేలాడుతుండగా, భార్య మృతదేహాన్ని అడవి జంతువులు పీక్కుతిన్నాయి. దీంతో కేవలం ఆమె పుర్రె మాత్రమే మిగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నగరం గ్రామ సమీపంలో శుక్రవా రం ఈ అస్తిపంజరాలు వెలుగు చూశాయి. గార్ల బయ్యారం సీఐ బి.రవికుమార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంకు చెందిన పెండకట్ల అనిల్‌కుమార్, దేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం.
ఈ ఏడాది మార్చి 10న ఇద్దరు చిన్నపిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపిన తలిదండ్రులు బైక్‌పై పరార య్యారు. నాటి నుంచి పోలీసులు భార్యాభ ర్తల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. నగరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని పొదల్లో బైక్ ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలు ఇదే ప్రాంతంలో ఉంటారని భావించి బైక్ దొరికిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నగరం గ్రామ సమీ పం గుట్టమీద నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుకు ఓ మృతదే హం వేలాడుతూ కని పించింది. పోలీసులు వెంటనే అనిల్‌కుమార్ తండ్రి వెంకన్నను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించగా ఇది తన కొడుకుదేనని చెప్పాడు.
దేవి మృతదేహం కోసం వెతుకగా పక్కనే పుర్రె, ఎముకలు, చీర లభించాయి. అడవి జంతువులు మృతదేహాన్ని తిని ఉంటాయని పోలీసులు భావించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు గుట్టపైకి డాక్టర్‌ను తీసుకొచ్చి అస్తిపంజరాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గుట్టపైనే కుటుంబసభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. కాగా, భార్యాభర్తలు ఎందుకు పిల్లలకు విషమిచ్చి చంపారు.. అసలు వాళ్లు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. పోలీసులు కూడా ఇదొక మిస్టరీలా ఉందని, ఇంకా కారణాలు తెలియలేదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment