Skeletons
-
పిల్లలను హతమార్చిన దంపతుల ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా: నెల రోజుల క్రితం పిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపి పరారైన తల్లిదండ్రులు అడవిలో అస్తి పంజరాలయ్యారు. భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరి వేసుకున్నారు. భర్త మృతదేహం అస్తిపంజరమై చెట్టుకు వేలాడుతుండగా, భార్య మృతదేహాన్ని అడవి జంతువులు పీక్కుతిన్నాయి. దీంతో కేవలం ఆమె పుర్రె మాత్రమే మిగిలింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం నగరం గ్రామ సమీపంలో శుక్రవా రం ఈ అస్తిపంజరాలు వెలుగు చూశాయి. గార్ల బయ్యారం సీఐ బి.రవికుమార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్న గూడెంకు చెందిన పెండకట్ల అనిల్‌కుమార్, దేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఈ ఏడాది మార్చి 10న ఇద్దరు చిన్నపిల్లలకు పాలల్లో విషం ఇచ్చి చంపిన తలిదండ్రులు బైక్‌పై పరార య్యారు. నాటి నుంచి పోలీసులు భార్యాభ ర్తల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. నగరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని పొదల్లో బైక్ ఉండటాన్ని ఓ వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్యాభర్తలు ఇదే ప్రాంతంలో ఉంటారని భావించి బైక్ దొరికిన ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నగరం గ్రామ సమీ పం గుట్టమీద నుంచి దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూడగా చెట్టుకు ఓ మృతదే హం వేలాడుతూ కని పించింది. పోలీసులు వెంటనే అనిల్‌కుమార్ తండ్రి వెంకన్నను ఘటనా స్థలానికి తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించగా ఇది తన కొడుకుదేనని చెప్పాడు. దేవి మృతదేహం కోసం వెతుకగా పక్కనే పుర్రె, ఎముకలు, చీర లభించాయి. అడవి జంతువులు మృతదేహాన్ని తిని ఉంటాయని పోలీసులు భావించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు గుట్టపైకి డాక్టర్‌ను తీసుకొచ్చి అస్తిపంజరాలకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గుట్టపైనే కుటుంబసభ్యులు అంత్య క్రియలు నిర్వహించారు. కాగా, భార్యాభర్తలు ఎందుకు పిల్లలకు విషమిచ్చి చంపారు.. అసలు వాళ్లు ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డారనే కారణాలు ఇప్పటివరకు తెలియలేదు. పోలీసులు కూడా ఇదొక మిస్టరీలా ఉందని, ఇంకా కారణాలు తెలియలేదని చెబుతున్నారు. -
దేశ స్వాతంత్ర వేడుకల వేళ... బయటపడ్డ 38 ఏళ్ల నాటి సైనికుడు మృతదేహం
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాం. అజాది కా అమృత మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటూ.... నాటి త్యాగధనులను స్మరించుకుని ఆనంద పడుతున్న వేళ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ అనే వీర సైనికుడి మృతదేహం హిమనీనాదం నుంచి బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని హల్ద్వానీలో ఒక కుటుంబం నిరీక్షణకు ఫలితం దక్కి నాటి మేఘదూత ఆపరేషన్ పాల్గొన్న వీర సైనికుడి మృతదేహం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ 1984 సియోచిన గ్లేసియర్‌ని ఆక్రమించి పాకిస్తాన్ స్థానాలపై పట్టు సాధించేందుకు మేఘదూత ఆపరేషన్ని చేపట్టింది. అందులో భాగంగా భారత సైన్యం మే 29, 1984న19వ కుమావోన్ రెజిమెంట్ నుంచి ఒక బృందం ఈ ఆపరేషన్ కోసం బయలుదేరింది. అందులో లాన్స్ నాయక్ చంద్రశేఖర్ కూడా ఉన్నాడు. ఐతే ఆ బృందం ఆ రోజు రాత్రి హిమనీనాదంలో చిక్కుకుపోయింది. దీంతో ఒక అధికారి సెకండ్ లెఫ్టినెంట్ పిఎస్ పుండిర్‌తో సహా 18 మంది భారతీయ ఆర్మీ సైనికులు మరణించారు అని ఒక అధికారి తెలిపారు. మొత్తం 14 మంది మృతదేహాలు లభ్యం కాగా, ఐదుగురు గల్లంతయ్యారు. ఐతే భారత ఆర్మీ గస్తీకి వేసవినెలలో మంచు కరుగుతున్నప్పుడూ తప్పిపోయిన సైనికులను గుర్తించే బాధ్యతను అప్పగిస్తారు. అందులో భాగంగా గస్తీ వెతికే చర్యలు చేపట్టినప్పుడూ ఆగస్టు 13న సియాచిన్‌లో 16 వేల అడుగుల ఎత్తులో ఒక సైనికుడి అస్థిపంజర అవశేషాలు కనుగొన్నారు. ఆ అవశేషలపై ఉన్న ఆర్మీ నంబర్‌తో కూడిన డిస్క్ సాయంతో ఆ అవశేషం లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌దిగా గుర్తించారు. చంద్రశేఖర్‌కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు అతని హయాంలో ఉన్న ఆర్మీ సిబ్బందితో సహా ఇతర అధికారులు, బంధువులు స్నేహితులు హల్ద్వానీకి తరలివచ్చి ఆ వీరుడికి కన్నీటి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. 1984లో భారత ఆర్మీ చేపట్టిన ఈ మేఘదూత ఆపరేషన్ పాకిస్తాన్‌పై చేపట్టిన అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్‌గా మిగిలింది. భారతదేశ నియంత్రణలో ఉన్న అత్యంత కీలకమైన సియాచిన్ గ్లేసియర్ తూర్పు కారాకోరం శ్రేణిలో పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్ తోపాటు చైనా ఆధీనంలో ఉన్న ప్రాంతాలైన షక్స్‌గామ్ వ్యాలీకి సరిహద్దుగా ఉంటుంది. (చదవండి: ఐదు వేల మందితో.. ప్రపంచంలో అతిపెద్ద ‘జాతీయ జెండా మానవహారం’) -
బోన్ చర్చ్.. 70000 అస్థిపంజరాలతో అరుదైన కళాఖండం
భక్తి, భయం.. రెండూ మిళితమైన ఓ అద్భుత కళాఖండమిది. యూరప్ దేశాల్లో ఒకటైన చెక్ రిపబ్లిక్లో కుట్నా హోరాలోని సెడ్లెక్‌లో.. పర్యాటక కేంద్రంగా మారిన.. సెడ్లెక్ ఓస్యూరీ రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఇందులోకి అడుగుపెట్టగానే.. 40,000 నుంచి 70,000 అస్థిపంజరాలు అక్షరాలా ముక్తకంఠంతో స్వాగతం పలుకుతాయి. 1278లో సెడ్లెక్‌లోని సిస్టెర్సియన్ మఠానికి చెందిన మఠాధిపతి హెన్రీని.. బొహీమియా రాజు ఒటాకర్ 2.. గోల్గోతా (సువార్తతో ఏసు శిలువ వేయబడిన స్థలం)కు పంపాడు. అక్కడ నుంచి కొద్దిపాటి మట్టిని తీసుకొచ్చిన హెన్రీ.. సెడ్లెక్‌లోని అబ్బే శ్మశానవాటికపై చల్లాడు. నాటి నుంచి అది పవిత్రస్థలంగా మారింది. దీంతో స్థానికులు.. చనిపోయిన తమవారిని అక్కడే ఖననం చేయడం సంప్రదాయంగా మారింది. 14వ శతాబ్దం వరకు అది కొనసాగింది. ఆ సమయంలోనే యూరోప్ అంతా ప్లేగు ప్రబలింది. ఆ వ్యాధికి 30వేల మందిపైనే బలయ్యారు. ఆ తర్వాత మతయుద్ధాలతో మరో పదివేల మంది చనిపోయారు. 1870లో అక్కడ చర్చి నిర్మాణం కోసం.. పాతిపెట్టిన శవాలను తవ్వడంతో పాటు.. చనిపోయిన వారి ఎముకలు, పుర్రెలతో చర్చి లోపల అలంకరణ చెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి స్థానిక శిల్పులు.. ఈ అద్భుత కళాఖండాన్ని నిర్మించారు. ఆ చిన్న చర్చిలో.. అస్థిపంజరాలు ఎన్నో రూపాల్లో పర్యాటకులను ఆకట్టుకుంటాయి. దాంతో ఈ చర్చికి ‘బోన్ చర్చ్’ అనే పేరు కూడా వచ్చింది. -
1857 సిపాయిల తిరుగుబాటు: వీరుల అస్థిపంజరాలు లభ్యం
బ్రిటిష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లోని బయటపడ్డాయి. అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు బుధవారం వెల్లడించారు. కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు. Chandigarh| These skeletons belong to 282 Indian soldiers killed during India's 1st freedom struggle against the British in 1857. These were excavated from a well found underneath religious structure in Ajnala near Amritsar, Punjab: Dr JS Sehrawat Asst Prof Dept Anthropology PU pic.twitter.com/pfGdz4W5sC — ANI (@ANI) May 11, 2022 ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
160 ఏళ్ల తర్వాత ‘కపాల మోక్షం’
సాక్షి, హైదరాబాద్: 160 ఏళ్ల మిస్టరీ వీడిపోయింది. పంజాబ్‌లోని ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివో తేలిపోయింది. ఎనిమిదేళ్ల క్రితం అంటే 2014లో అజ్నాలా పట్టణంలోని ఓ పాడుబడ్డ బావిలో పెద్ద ఎత్తున బయటపడ్డ మానవ కపాలాలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ప్రకటించింది. ఇప్పటివరకూ ఈ కపాలాలు 1857 నాటి తిరుగుబాటులో బ్రిటిషర్ల చేతిలో హతమైన సిపాయిలవని, కొందరు చరిత్రకారులు చెబుతుండగా.. మరికొందరు 1947 నాటి దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో మరణించిన వారివి కావచ్చనని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు ఏదీ నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో పంజాబ్ యూనివర్సిటీకి చెందిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సెహ్రావత్.. సీసీఎంబీ, లక్నోలోని బీర్బల్ సాహ్నీ ఇన్స్టిట్యూట్, బెనారస్ హిందూ యూనివర్సిటీలతో కలిసి ఈ పుర్రెల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే సీసీఎంబీ పుర్రెల నుంచి డీఎన్ఏను వెలికితీసి పరిశీలించగా.. మరణించిన వారు గంగా నదీ ప్రాంతానికి చెందిన వారని స్పష్టమైంది. ఫ్రాంటియర్స్ ఆఫ్ జెనిటిక్స్ జర్నల్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ సైనికులవి! ‘ఈ పరిశోధన ఫలితాలు చారిత్రక ఆధారాలతోనూ సరిపోతున్నాయి. ఎందుకంటే.. 26వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌లో బెంగాల్ తూర్పు ప్రాంతపు ప్రజలతో పాటు ఒడిశా, బిహార్, ఉత్తర ప్రదేశ్‌లకు చెందిన వారూ ఉండేవారని చరిత్ర చెబుతోంది’ అని డాక్టర్ సెహ్రావత్ వివరించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఆ బెటాలియన్‌కు చెందిన సైనికులను ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతంలోని మియాన్ మీర్ ప్రాంతంలో నియమించారు. బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేసిన వీరు కొందరిని హతమార్చారు కూడా. అయితే ఆ తరువాతి కాలంలో బ్రిటిష్ అధికారులు వీరిని అజ్నాలా సమీపంలో బంధించి చంపివేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పరిశోధన ఫలితాలు భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని చేరుస్తాయని, ఇప్పటివరకూ ఎవరూ గుర్తించని తొలి స్వాతంత్య్ర సంగ్రామం ఇదే కావచ్చునని ఈ పరిశోధనలో ముఖ్యపాత్ర పోషించిన బెనారస్ హిందూ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు. పలు చారిత్రక మిస్టరీలను ఛేదించేందుకు తాము భవిష్యత్తులోనూ ఇలాంటి పరిశోధనలు చేపడతామని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. పంజాబ్, పాకిస్తాన్ ప్రజలవి కాదు అజ్నాలాలో బయటపడ్డ పుర్రెల నుంచి 50 శాంపిల్స్‌ను సేకరించి డీఎన్ఏ ఐసోటోపులను పరిశీలించామని..ఆ ప్రజల పూర్వీకులు, ఆహారపు అలవాట్లు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడ్డాయని సీసీఎంబీ ప్రధాన శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కె.తంగరాజ్ తెలిపారు. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం ఈ పుర్రెలు పంజాబ్, పాకిస్తాన్ ప్రాంతాల ప్రజలకు చెందినవి కానే కాదని, వీటి డీఎన్ఏ.. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్ ప్రజల డీఎన్ఏతో సరిపోలుతోందని వివరించారు. -
నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ?
పుణ్య క్షేత్రాలకు, పురాతన దేవాలయాలకు మన దేశం పెట్టిందిపేరు. ఐతే మన దేశ అగ్రభాగంలో ఉన్న ఓ నది మాత్రం పుణ్యక్షేత్రం కానప్పటికీ దానిని చూసేందుకు వేలల్లో జనాలు వెళ్తుంటారు. కాకపోతే ఆ నదిలో నీళ్లతోపాటు, పైన తేలే అస్థిపంజరాలు కూడా ఉంటాయి. దీని వెనుక దాగి ఉన్న మిస్టరీ ఎంటో తెలుసుకుందాం.. ఏడాదంతా మంచులోనే.. అదికరిగిందంటే మాత్రం.. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోనే ఉందీ నది. రూప్‌ఖండ్ నది అని దీనికి పేరు. ఇది సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏడాదిలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుందీ నది. కానీ మంచు కరిగిపోగానే అక్కడి వాతావరణం అంతా కూడా భయానకంగా మారిపోతుంది. వందలాది అస్థిపంజరాలతో చూసేందుకు అత్యంత భీభత్సంగా ఉంటుంది. ఈ అస్థిపంజరాలను మొదటిసారిగా 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ గుర్తించారు. ఐతే ఎన్నో యేళ్లుగా ఈ అస్థిపంజరాల వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు ప్రయత్నాలు సాగాయి. ఎవరెవరేం చేప్పారంటే.. జనరల్ జోరావర్ సింగ్ సైన్యమేనా.. ఈ అస్థిపంజరాలు కాశ్మీర్‌కు చెందిన జనరల్ జోరావర్ సింగ్ సైన్యానికి సంబంధించినవని అక్కడి స్థానికులు నమ్ముతారు. 1841లో టిబెట్ యుద్ధం నుండి తిరిగి వస్తుండగా, మంచు తుఫానులో చిక్కుకుని హిమాలయ ప్రాంతం మధ్యలో తప్పిపోయి మరణించారనే కథనం ప్రచారంలో ఉంది. చదవండి: Interesting Facts About Death: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. మంచు తుఫానే కారణమా.. కనౌజ్ రాజా జస్ధావల్, అతని భార్య బలంప, అతని సేవకులు, నృత్య బృందంతో కలిసి నందా దేవి దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్లినప్పుడు పెద్ద మంచు తుఫాను కారణంగా పూర్తి సమూహం మరణించి ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవం ఏమిటీ? ఐతే 2014 శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ఫ్రోజెన్ లేక్‌లో ఉన్న మొత్తం 200 అస్థిపంజరాలు 9వ శతాబ్ధానికి చెందినవ భారత తెగకు చెందినవని, భారీ వడగండ్లవానలో వీరంతా మరణించారని తేల్చింది. దీనితో దీనివెనుక దాగిన మిస్టరీ వీడింది. పాపం.. అంత పెద్ద వడగండ్లు తగిలి.. మృతుల తల వెనుక భాగంలో బలమైన దెబ్బ తగలడం మూలంగా వీరంతా మరణించారని, బహుశా క్రికెట్ బాల్ సైజు వడగళ్ళు కురిసి ఉండవచ్చని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఐతే వారి శరీర ఇతర భాగాలపై ఎటువంటి గాయాలు కనుబడలేదట. దీంతో ఎటువంటి యుద్ధం గానీ, ఆయుధాల ప్రమేయంగానీ లేకుండా జరిగిన ప్రమాదమని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ప్రతీయేట ఈ మిస్టీరియస్ రూప్‌ఖండ్ నదిని చూసేందుకు వేలాదిమంది పర్యాటకులు, సాహసికులు వస్తుంటారు. ఈ సరస్సు చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, చూపరులకు అందమైన అనుభూతిని కలిగించినప్పటికీ, నదిలో తేలుతున్న అస్థిపంజరాల భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు మాత్రం వారి వెన్నులో వణుకు ప్రారంభమౌతుంది..!! చదవండి: Coffee and Alzheimer's Disease: మతిమరుపుతో బాధపడుతున్నారా? కాఫీతో మీ బ్రెయిన్‌కు పదును పెట్టండి.. -
కెనడా స్కూళ్లల్లో వందలాది అస్థిపంజరాలు
-
మూసేసిన స్కూల్లో పిల్లల అస్థిపంజరాలు లభ్యం
ఒట్టోవా: కెనడాలో దారుణం చోటుచేసుకుంది. ప్రఖ్యాత కమ్లూప్స్ ఇండిజీనియస్ రెసిడెన్షియల్ స్కూల్లో సుమారు 215 మంది పిల్లల అస్థిపంజరాలు బయటపడడం కలకలం రేపింది. కాగా 1978లోనే ఈ పాఠశాలను మూసేశారు. తాజాగా బయటపడిన అవశేషాల్లో ఎక్కువ మంది మూడేళ్ల లోపు పిల్లలే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. భూమిలోకి చొచ్చుకుపోయే ఒక ప్రత్యేకమైన రాడార్ సాయంతో పిల్లల అస్థిపంజరాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విచారం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలోనే ఇది చాలా బాధకరమైన సంఘటన అని.. సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 2015లో ట్రూత్ అండ్ రీకాన్సిలేషన్ అనే ఒక కమిటీ ఈ స్కూల్‌పై అధ్యయనం చేపట్టింది. ఆ రిపోర్టులో విస్తుపోయే విషయాలు వెలుగుచూడడం అప్పట్లో సంచలనంగా మారింది. 1840 నుంచి 1978 మధ్యలో పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేసి క్రిస్టియన్ చర్చిలు ఆధ్వర్యంలో నడుసున్న కమ్లూప్స్ పాఠశాలలో చేర్పించేవారు. అలా దాదాపు 150,000 మంది పిల్లల్లో చాలామందిని శారీరక వేధింపులతో పాటు లైంగింకగా వేధించడం, సరిగ్గా ఆహారం ఇవ్వకపోవడం లాంటి దురాగతాలకు పాల్పడేవారని ఒక రిపోర్టులో బయటపడింది. స్కూల్ యాజమాన్యం ఆగడాలతో దాదాపు 3200 మంది చనిపోయారని.. అందులో 215 మంది పిల్లలను స్కూల్ గ్రౌండ్‌లోనే ఖననం చేసినట్లు తేలింది. చిన్నపిల్లల మృతికి సంతాపంగా నివాళి ప్రకటిస్తున్న కెనడా ప్రజలు అయితే 2008లో కెనడా ప్రభుత్వం అప్పట్లో ఈ ఘటనపై క్షమాపణలో కోరింది. ఇక ఈ విషయంపై 2015 నుంచి ఆరేళ్లుగా దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటీష్ కొలంబియా కార్యాలయంతో కలిసి విచారణ చేస్తున్నామని.. బయటపడ్డ పిల్లల అస్థిపంజరాలను భద్రపరుస్తామని వారు తెలిపారు. చదవండి: ప్రియురాలితో బోరిస్ రహస్య వివాహం! అమ్మ, నాన్న ఎక్కడ.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి -
తుపాను గాలికి బయటపడ్డ 5 అస్థి పంజరాలు
రామనాథపురం: యాస్ తుపాను గాలుల తీవ్రతకు తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో పాతిపెట్టిన రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. రోజుల తరబడి బలమైన గాలులు వీచడంతో తీరంలో ఉన్న ఇసుక రేణువులు కొట్టుకుపోయి .. అందులో నుంచి ఐదు అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇంతకీ ఈ అస్థి పంజరాలు ఎవరివి, ఎలా ఇక్కడకు వచ్చాయి. ఇవి సాధారణ మరణాలా లేక హత్యలా అనేది తేలాల్సి ఉంది. రామనాథపురం జిల్లాలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వలినొక్కం గ్రామం ఉంది. బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ గ్రామంలో ఐదు వందల మత్స్యకార జనాభా జీవిస్తున్నారు. అయితే తుపాను సందర్భంగా గ్రామ సమీపంలో ఐదు అస్థిపంజరాలను స్థానికులు కనుక్కొన్నారు. ఇటీవల వీచిన గాలుల తీవ్రతకు ఇసుక కొట్టుకుపోయి తొలుత ఒక అస్థి పంజరం కనిపించింది. ఆ తర్వాత వరుసగా ఒకదాని వెంట ఒకటిగా ఐదు అస్థిపంజరాలను గ్రామస్తులకు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణకు ఆదేశం సముద్ర తీరంలో వెలుగు చూసి ఐదు మృతదేహాలు స్థానికులవా లేక పొరుగు గ్రామాలకు చెందినవా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న స్థానికులు క్షేమంగా ఉన్నారా ? లేదా అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. ఆ తర్వాత సమీప పోలీస్ స్టేషన్లలో పాత మిస్సింగ్ కేసుల రికార్డులు పరిశీలిస్తున్నారు. అస్థిపంజరాల నమూనాలను ఫొరెన్సిక్, డీఎన్ఏ ల్యాబ్‌లకు పంపించాలని నిర్ణయించారు. మరోవైపు ఈ ప్రాంతంలో ఉన్న సైకో కిల్లర్ల్స్ కదలికలపైనా నిఘా పెట్టారు. అయితే ఇప్పటి వరకు పోలీసులకు బలమైన క్లూలు ఏవీ లభించలేదు. మరోవైపు ఈ అస్థిపంజరాల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. -
శవాల గుట్టలు.. 227 మంది చిన్నారుల ప్రాణత్యాగం..!
లిమా : పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో శవాల గుట్టలు బయటపడ్డాయి. రాజధాని లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్‌చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనగొన్నామని ఆర్కియాలజిస్టు ఫెరెన్ కాస్టిలో చెప్పారు. హువాన్‌చాకోలో కొనసాగుతున్న పురావస్తుశాఖ తవ్వకాలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేవుడికి తమను తాము అర్పించుకుని వారంతా సామూహికంగా ప్రాణాలు విడిచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందరూ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం బాధాకరమన్నారు. అవశేషాలన్నీ క్రీస్తు 1200-1400 కాలానికి చెందిన చిమూ సంస్కృతికి చెందిన మనుషులవేనని తెలిపారు. తొలుత గతేడాది రాజధానికి దగ్గరలో ఉన్న పంపాలా క్రజ్ వద్ద తవ్వకాల్లో 56 పుర్రెలు బయటపడ్డాయని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న హువాన్‌చాకోలో తవ్వకాలు జరపగా 190 చిన్నారుల శరీర అవశేషాలు, 200 ఒంటెల అస్థిపంజరాలు బయటపడ్డాయని అన్నారు. తవ్విన చోటల్లా చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన బొక్కల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడటం కలచి వేసిందని చెప్పారు. మొత్తంగా ఇప్పటివరకు 227 మానవ అస్థిపంజరాలు వెలికి తీశామని, తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. శవాలన్నీ సముద్రం వైపునకు ముఖం చేసి ఉన్నాయని తెలిపారు. ఇంత భారీ ఎత్తున ప్రాణత్యాగం చేసిన ఉదంతాలు బయటపడటం చరిత్రలో తొలిసారని అన్నారు. కొలంబియన్ సృంస్కృతికి ముందుదైన చిమూ సంస్కృతి పెరూవియన్ తీరం వెంబడి ఈక్వెడార్ వరకు విస్తరించింది. ఐంక రాజ్యస్థాపనతో 1475లో అంతరిచింది. -
మరో ఘోరం : అదే ఆసుపత్రిలో అస్థిపంజరాల కలకలం
సాక్షి, పట్నా: బీహార్‌లోని ముజఫర్‌పూర్ ఆసుపత్రిలోమరో దిగ్భ్రాంతికరమైన పరిణామం చోటు చేసుకుంది. మెదడువాపు వ్యాధి (అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్, ఏఈఎస్) ద్వారా పసిపిల్లల మరణాలతో (శనివారానికి 108 మంది) వార్తల్లో నిలిచిన శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (ఎస్‌కెఎంసిహెచ్)కి సంబంధించి మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రి సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు దర్శనమివ్వడం స్థానికులను భయ భ్రాంతులకు గురిచేసింది. మృతదేహాలలో కొన్నింటిని కాల్చివేసినట్టు, మరికొన్నింటిని సగం పూడ్చినట్టుగా, ఇంకొన్నింటిని బస్తాలలో కుక్కి అక్కడ పడి వున్నాయి. ఇలా పెద్ద ఎత్తున మానవ అవశేషాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఇది ఆసుపత్రికి చెందిన పోస్ట్‌మార్టం విభాగం నిర్వాకమని విమర్శలు వెల్లువెత్తాయి. పోస్టుమార్టం తరువాత మృతదేహాలను ఇలా బహిరంగం పారేసినట్టుగా తెలుస్తోందని ఆసుపత్రి కేర్ టేకర్ జనక్ పాస్వాన్ మీడియాకు చెప్పారు. ఇది నిజంగా అమానవీయమని వ్యాఖ్యానించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్కే షాహి సమగ్ర దర్యాప్తును కోరనున్నట్టు చెప్పారు. పోలీసులతో కలిసి ఎస్‌కెఎంసిహెచ్ ఆసుపత్రి దర్యాప్తు బృందం శనివారం సంఘటన స్థలాన్ని సందర్శించింది. ఆసుపత్రికి చెందిన డాక్టర్ విపిన్ కుమార్ మాట్లాడుతూ, అస్థిపంజర అవశేషాలు కనుగొన్నమాట వాస్తవమేనని సవివరమైన సమాచారం ప్రిన్సిపాల్ నుంచి రాబట్టనున్నామని చెప్పారు. మరోవైపు ఏదైనా మృతదేహం ఒక ఆసుపత్రికి వచ్చినప్పుడు, వెంటనే సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించి, దీనికి సంబంధించి ఒక నివేదికను దాఖలు చేయాలి. అనంతరం శవాన్ని 72 గంటలు పోస్టుమార్టం గదిలో ఉంచాలి. 72 గంటల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కుటుంబ సభ్యులెవరూ రాకపోతే, నిర్దేశించిన విధానాన్ని అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయడం లేదా దహనం చేయడమో చేయాలని పోస్ట్‌మార్టం విభాగం డ్యూటీ అని షాహి చెప్పారు. Bihar: Human skeletal remains found behind Sri Krishna Medical College & Hospital, Muzaffarpur. 108 people have died at SKMCH due to Acute Encephalitis Syndrome (AES). pic.twitter.com/ICRcg3Be1e — ANI (@ANI) June 22, 2019 -
29 ఏళ్ల క్రితం అదృశ్యమైన లారీ ఆచూకీ లభ్యం
-
గ్రానైట్ క్వారీలో నరబలులపై విచారణ
మధురై: తమిళనాడులోని మధురై జిల్లాలో జరిగిన గ్రానైట్ అవినీతిపై మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఐఏఎస్ అధికారి సహాయం విచారణ జరిపి నివేదిక దాఖలు చేశారు. గతంలో గ్రానైట్ అవినీతిపై సహాయం విచారణ జరిపినప్పుడు కీళవలవు సమీపంలోని కంబర్ మలై పట్టికి చెందిన సేవర్కుడియోన్ అనే వ్యక్తి పీఆర్పీ సంస్థాపకుడు కొంతమంది సిబ్బందిని నరబలి ఇచ్చినట్లు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ అధికారి అయిన సహాయం, పోలీసులు, ఆదాయశాఖ సమక్షంలో గత 2015 సెప్టెంబర్ నెల మణిముత్తారు శ్మశానంలో ఎముకలు వెలికి తీశారు. ఎముకలను వేలిముద్ర నిపుణులు ద్వారా మృతి చెందినవి స్త్రీల, పురుషులా? మృతి చెందిన వారి వయసు, వారిని ఖననం చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయి? వంటి విషయాలపై ఇప్పటికే నివేదిక దాఖలు చేశారు. ఈ క్రమంలో మృతి చెందిన వారి బంధువులు 11 మందిని గుర్తించి వారివద్ద డీఎన్ఏ పరీక్షలు చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వారందరినీ పోలీసులు పిలుచుకుని వెళ్లి పరీక్షలు జరిపారు. వైద్య ఫలితాల నివేదిక వచ్చిన అనంతరం నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
50 ఏళ్ల కిందటి విమానం జాడ దొరికింది!
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు అర్ధశతాబ్దం కింద కూలిపోయిన విమానం జాడ తాజాగా బయటపడింది. 1964లో అర్జెంటినాలో ఈ విమానం కూలిపోయినట్లుగా గుర్తించినా దాని జాడ మాత్రం ఇప్పటిదాకా తెలియలేదు. కోల్హూ హువపి అనే సరస్సు ఎండిపోవడంతో ఈ విమాన శకలాలతోపాటు అందులో ప్రయాణించిన నలుగురి అస్థిపంజరాలు బయటపడ్డాయి. 1964, అక్టోబర్ 9న పైపర్ అపాచే విమానం కూలినట్లుగా ప్రకటించిన అర్జెంటినా ప్రభుత్వం దాని జాడ తెలుసుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. కాగా స్థానికుడొకరు విమాన శకలాలకు సంబంధించిన సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి పరీక్షించిన అధికారులు.. 50 ఏళ్ల క్రితం కూలిపోయిన పైపర్ అపాచే విమాన శకలాలుగా గుర్తించినట్టు అర్జెంటినా జాతీయ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. -
దూరపుచుట్టం
టూకీగా ప్రపంచ చరిత్ర 22 ఆ తరువాతి చరిత్రకు విశాలమైన గండి ఏర్పడింది. రెండవ హిమానీ శకం నాటి ‘హోమో ఎరెక్టస్’ దగ్గరి నుండి మన నడక నాలుగవ హిమానీశకం నాటి ‘నియాండర్తల్’ మానవుని దగ్గరికి ఒక్క దూకులో గెంతేసింది. నియాండర్తల్ అనేది జర్మనీలో ఒక లోయ. అక్కడ దొరికిన పుర్రె ఆధునిక మానవునికి అత్యంత చేరువగా ఉండేది. అందువల్ల ఆ పుర్రె యజమానినీ, అతని జాతినీ ‘హోమో నియాండర్తలెన్సిస్’ అనే పేరుతో పిలిచారు. ఆ తరువాత ఇలాంటి అవశేషాలు బెల్జియం తదితర పశ్చిమ యూరోపియన్ ప్రాంతాల్లో కొల్లలుగా దొరికాయి. విడివిడి అవశేషాలు కాకుండా పూర్తి అస్థిపంజరాలే దొరకడంతో ఆనాటి స్థితిగతులు మరింత వివరంగా తెలుసుకునే వీలు కలిగింది. నియాండర్తల్ మానవుని ఎత్తు సగటున ఐదడుగులా మూడు అంగుళాలు. పుర్రె సైజు పెద్దది, దాని ఎముకలు దళసరి. మెదడు భరిణ ఆధునిక మానవునికి ఉండేకంటే మరికాస్త పెద్దదే. పుర్రె ఎత్తు తక్కువైనందున తల చప్పిడిగా కనిపిస్తుంది. నుదురు ఏటవాలు, కనుబొమలు ఉబ్బెత్తు. ముక్కు వెడల్పాటిది. బలమైన దవడలూ, బలమైన మెడ. మెడభాగం చాలా కురచగా ఉండడంతో తల నేరుగా భుజాల మీద మోసినట్టుంటుంది. మెదడులో కుడిసగం కంటే ఎడమసగం ప్రస్ఫుటంగా కనిపించడాన్ని బట్టి అతనిది మనలాగే కుడిచేతివాటమని చెప్పొచ్చు. చూపు, స్పర్శలను గ్రహించే పుచ్చెభాగం ఎంత బలకొందో మాటకూ ఆలోచనకూ పీఠమైన ముందుభాగం అంత బలహీనంగా కనిపిస్తుంది. పెపైచ్చు అతని గొంతు కూడా ఇరుకుగా, మాటలు తిరిగేందుకు అసౌకర్యంగా ఉండడంతో, నియాండర్తల్ మనిషికి భాష లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మహా ఉంటే చిలుకకు మల్లే కొన్ని మాటల వరకు పలికుండొచ్చు. వేట నియాండత లెన్సిస్ జీవన విధానం. అయితే కేవలం అతడు మాంసాహారి మాత్రం కాదు; కాయలూ, పండ్లూ, రుచించే ఆకులూ, పుట్టగొడుగులూ వంటివి అతని శాకాహారం, చేపలు కూడా ఆహారంలో భాగమే. అయితే, వాటిని పట్టేందుకు ‘గాలం’ వంటి సాధనం అతనికి అందుబాటులో లేదు. అందువల్ల, నీటిలో చేపను ఎలుగుబంటి ఎంత వడుపుగా నోటితో పట్టేస్తుందో అలా నియాండర్తల్ నరుడు చేతులతో చేపలు పట్టుకునేవాడై వుండాలి. లేదా బద్దలాగా చివిరిన కొయ్య టేగ (18-20 అంగుళాల పొడవుండే మొద్దుకత్తి)తో తలమీద కొట్టి, చచ్చిన చేప నీటి మీద తేలగానే సేకరించుకోనుండొచ్చు. టేగతో ఈవిధంగా చేపలను వేటాడే పద్ధతి ఇప్పటికీ మనప్రాంతాల్లో కనిపిస్తుంది. నియాండర్తల్ గుహల్లో బొచ్చు ఏనుగూ, దుప్పి, కణితి వంటి పెద్ద జంతువుల ఎముకలు దొరికిన దాన్నిబట్టి ఆ నరుడు వాటిని వేటాడినట్టు ఊహించారుగానీ, అతనికున్న కొయ్యబరిసె, బడితెల వంటి ఆయుధాలతో అంత పెద్ద జంతువులను వేటాడటం సాధ్యమని నమ్మలేం. పైగా ఆ దశలో మానవుడు పెద్ద జంతువులకు ఇంకా ‘వేట’గా ఉన్నాడే తప్ప, వేటగాడు కాలేదు. అతని శక్తికి అవి లోబడేది ఏ పోట్లాటలోనో గాయపడినప్పుడో, ఆరోగ్యంగా లేనప్పుడో, లేదా బురద గుంటల్లో ఇరుక్కున్నప్పుడో మాత్రమే. వేట వాళ్ళకొక సామూహిక యజ్ఞం. జంతువును చంపినచోటనే విందు చేసుకోవడం నియాండర్తల్ అలవాటులా కనిపిస్తుంది. తినగా మిగిలిన మాంసాన్నీ, మూలుగులుండే ఎముకలనూ గుహకు చేర్చుకుంటారు. అందుకే వాళ్ళ గుహల్లో తొడ ఎముకలూ, కాలి ఎముకలు మాత్రమే ఉంటాయిగానీ పక్కటెముకలవంటివి కనిపించవు. రాతి పనిముట్లు చెక్కుకోవడంలో నైపుణ్యం పెరిగింది. పనిముట్ల వైవిధ్యం పెరిగింది. పలురకాల అవసరాలకు వేరువేరు పనిముట్లు వాడకానికొచ్చాయి. గొడ్డళ్ళూ, గునపాలూ, కత్తులూ, రాతితోనే తయారవుతున్నాయి. వాటితోపాటు కొయ్య సామగ్రిని కూడా వాడినట్టు తెలుస్తుందిగానీ, అవి శిధిలమయ్యేవి కావడంతో మనకు దొరికే అవకాశం లేదు. వస్తువుల ఆకారాలను గురించిన విజ్ఞానం పెరగడంతో, ఏ అవసరానికి ఏ ఆకారం అనువుగా ఉంటుందో అదే ఆకారంలో పనిముట్టును తయారుజేసుకున్న లాఘవం కనిపిస్తుంది. రాతి పనిముట్టును చెక్కేముందు కొయ్యనమూనాను ఆధారం చేసుకున్నట్టు గూడా తెలుస్తూంది. ఇనుపరాయిని చెకుముకిరాయితో కొట్టి నిప్పు రాజేసే విధానం అమలులోకి వచ్చింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
అస్థిపంజరాల కలకలం
శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శుక్రవారం అస్థిపంజరాల కలకలం రేగింది. ఓ తోట లోని నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు మహిళల అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వాటి సమీపంలో రెండు మద్యం బాటిళ్లు, నీళ్ల సీసాలు పడి ఉన్నాయి. రెండునెలల క్రితం మహిళలు మృతిచెంది ఉండొచ్చని, దుండగులు మద్యం తాగి మహిళలపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. కాగా, శంషాబాద్‌లోని రాళ్లగూడ ఇంద్రానగర్ దొడ్డి ప్రాంతానికి చెందిన చంద్రకళ(42) గత ఫిబ్రవరి 28న అదృశ్యమైంది. శుక్రవారం అస్థిపంజరాల విషయుం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చారు. అస్థిపంజరానికి ఉన్న దుస్తులు ఇతర ఆధారాలతో చంద్రకళగా గుర్తించారు. మరో మహిళ మృతదేహం గురించిన వివరాలు తెలియరాలేదు. అస్థిపంజరాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. పోలీసులు అనువూనాస్పద వుృతిగా కేసు నమోదు చేశారు.