శంషాబాద్, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో శుక్రవారం అస్థిపంజరాల కలకలం రేగింది. ఓ తోట లోని నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరు మహిళల అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. వాటి సమీపంలో రెండు మద్యం బాటిళ్లు, నీళ్ల సీసాలు పడి ఉన్నాయి. రెండునెలల క్రితం మహిళలు మృతిచెంది ఉండొచ్చని, దుండగులు మద్యం తాగి మహిళలపై అత్యాచారం చేసి హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. కాగా, శంషాబాద్‌లోని రాళ్లగూడ ఇంద్రానగర్ దొడ్డి ప్రాంతానికి చెందిన చంద్రకళ(42) గత ఫిబ్రవరి 28న అదృశ్యమైంది. శుక్రవారం అస్థిపంజరాల విషయుం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వచ్చారు.
అస్థిపంజరానికి ఉన్న దుస్తులు ఇతర ఆధారాలతో చంద్రకళగా గుర్తించారు. మరో మహిళ మృతదేహం గురించిన వివరాలు తెలియరాలేదు. అస్థిపంజరాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగానికి తరలించారు. పోలీసులు అనువూనాస్పద వుృతిగా కేసు నమోదు చేశారు.