తాడేపల్లిగూడెం: ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్న ఓ ప్రైవేటు అంబులెన్స్ ఒక్కసారిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా పెద్దతాడేపల్లి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దాంతో అప్రమత్తమైన సిబ్బంది అంబులెన్స్‌లోని వారిని సురక్షితంగా కిందికి దించి మరో వాహనంలో వైద్య చికిత్స నిమిత్తం తణుకు తరలించారు. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని పోలీసులు తెలిపారు. కానీ ఈ ఘటనలో అంబులెన్స్ మాత్రం పూర్తిగా కాలిపోయింది.