ఆంధ్రా బిర్లా ముళ్లపూడి విగ్రహావిష్కరణ
తణుకు : పశ్చిమగోదావరి జిల్లా తణుకు మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దివంగత పారిశ్రామికవేత్త, ఆంధ్రాబిర్లా డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు. మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ ఎంతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపిన ముళ్లపూడి ఎందరికో మార్గదర్శి అని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, వి.శివరామరాజు, పితాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.