
సాక్షి, తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వైటీ రాజా ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. కరోనా వైరస్ సోకడంతో అనారోగ్యం పాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ స్టార్ హాస్పటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వైటీ రాజా1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున తణుకు నుంచి గెలుపొంది ఐదేళ్ల పాటు సేవలందించారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు సంతాపం తెలిపారు. కాగా వైటీ రాజా సోదరిని ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment