![Nusring student committs suicide in Tanuku - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/23/Nursing-student.jpg.webp?itok=4rwmoLpa)
తణుకు:
పట్టణంలోని ఒక ప్రైవేటు నర్సింగ్ స్కూలుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇరగవరం మండలం అర్జునుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిపూడి హెప్సిబారాణి (18) తణుకులోని నర్సింగ్ స్కూల్లో చదువుతోంది. ఈమె కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన హెప్సిబారాణి ఆదివారం తన హాస్టల్ గదిలోని నరానికి మత్తు ఇంజక్షన్ చేసుకుంది. కొద్దిసేపటికి కుప్పకూలిపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది.
హెప్సిబారాణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన పాస్టర్ సంరక్షిస్తున్నారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై డి.ఆదినారాయణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment