బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్‌: మంచు | YSRCP Leader Manchu Mohan Babu Fire On Chandra Babu In Tanuku | Sakshi
Sakshi News home page

బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయ్‌: మంచు

Published Wed, Apr 3 2019 10:03 PM | Last Updated on Wed, Apr 3 2019 10:10 PM

YSRCP Leader Manchu Mohan Babu Fire On Chandra Babu In Tanuku - Sakshi

తణుకు: కాళ్లు కడిగి కన్యాదానం చేసిన ఎన్టీఆర్‌ రామారావు చావుకు కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని నటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్‌ బాబు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కారుమూరితో కలిసి మోహన్‌ బాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌ బాబు మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు.తెలుగు దేశం పార్టీ చంద్రబాబుది కాదని మహానటుడు అన్న ఎన్టీఆర్‌దని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయన్నారు.

టీడీపీ భూస్థాపితం ఖాయం
‘రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవటం ఖాయం. అన్న ఎన్టీఆర్ శాపం ఫలిస్తుంది. ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకి డ్వాక్రా మహిళలు గుర్తొస్తారు. ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో వాళ్ల డబ్బులు వాళ్లకే ఇస్తున్నాడు. ఇన్నాళ్లు చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు  కలసి ఇసుక, మట్టి దోచుకొని లక్షల కోట్ల రూపాయలు ఆర్జించారు. మరొక్కసారి  బాబును కనుక  నమ్మితే ఈసారి ప్రజల  రక్తాన్నే పీల్చేస్తాడు. సరిగ్గా మాట్లాడటం రాని తన కొడుక్కి మూడు మంత్రి పదవులు కట్టబెట్టటం సమంజసమా’ అని మోహన్‌ బాబు ప్రశ్నించారు.

130 స్థానాల్లో విజయఢంకా మోగించటం ఖాయం
‘రాష్ట్రం మొత్తం వైఎస్‌ జగన్ వెంటే  ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 130  స్థానాల్లో  విజయఢంకా మోగించటం ఖాయం. వైఎస్‌ జగన్‌పై కేసులు గురించి మాట్లాడే బాబుపైనా  పదకొండు  కేసులున్నాయి. ఓటుకు  నోటు  కేసులో  అడ్డంగా  దొరికిపోయి  హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే  పారిపోయి  వచ్చింది నువ్వు కాదా.. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎన్ని నాలుకలతో  మాట్లాడుతున్నాడో  ప్రజలు గమనిస్తున్నారు. పోలవరం నిధుల గురించి కేంద్రం లెక్కలు  అడిగితే చెప్పటం లేదు.. అదేమైనా బాబు తన అబ్బ మొగుడి  సొమ్ము అనుకొంటున్నాడా. చంద్రబాబు లాంటి వ్యక్తిని  వేరే దేశంలో అయితే ఉరి  తీసేవారు. ఫీజు  రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలతో  వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయార’ ని మోహన్‌ బాబు కొనియాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement