‘నవనిర్మాణ దీక్ష కాదు.. నయవంచన దీక్ష’ | tanuku constituency ysrcp plenary meeting | Sakshi
Sakshi News home page

‘నవనిర్మాణ దీక్ష కాదు.. నయవంచన దీక్ష’

Published Sun, Jun 4 2017 6:15 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

tanuku constituency ysrcp plenary meeting

తణుకు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేది నవ నిర్మాణ దీక్ష కాదని, అది నయవంచన దీక్ష అని పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు విమర్శించారు. ఆదివారం తణుకు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, కారుమురు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని అన్నారు.

రెండేళ్ల తర్వాత ఓడిపోతామని తెలిసి దోపిడి రాజ్యంగా మార్చారని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్లీనరీ సమావేశంలో కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, పాతపాటి సర్రాజు, మేకా శేషుబాబు, పీ. వాసుబాబు, కే. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement