‘తణుకు నగరానికి ఓ ప్రత్యేకత ఉంది. బ్రిటీష్ వారికే వణుకు పుట్టించిన నగరం తణుకు. ఇంత గొప్ప చరిత్ర ఉన్న నగరంలో జరగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిందా లేదా అని సందేహం కలుగుతోంది’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 181వ రోజు పాదయాత్రలో భాగంగా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ ఏపీలో పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు.