బ్యాంకుల్లో కొనసాగుతున్న సోదాలు
పాతనోట్ల మార్పిడి వ్యవహారం నేపథ్యంలో ఆర్‌బీఐ అధికారులు బ్యాంకుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమార్కుల వివరాలు బయటపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తణుకు ఎస్‌బీఐ ఏజీఎం కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేసిన ఆర్‌బీఐ అధికారులు తాజాగా తణుకులోనే మరో రెండు జాతీయస్థాయి బ్యాంకుల్లోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. వీటిల్లోనూ వారంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబం
అక్రమ లావాదేవీలపై కూ
ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై ఆరా
తణుకు : పాతనోట్ల మార్పిడి వ్యవహారం నేపథ్యంలో ఆర్‌బీఐ అధికారులు బ్యాంకుల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమార్కుల వివరాలు బయటపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో తణుకు ఎస్‌బీఐ ఏజీఎం కృష్ణారావుపై సస్పెన్షన్ వేటు వేసిన ఆర్‌బీఐ అధికారులు తాజాగా తణుకులోనే మరో రెండు జాతీయస్థాయి బ్యాంకుల్లోనూ అవకతవకలు జరిగినట్టు గుర్తించినట్టు సమాచారం. వీటిల్లోనూ వారంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఇద్దరు ఎమ్మెల్యేల పాత్రపై ఆరా
ఎస్‌బీఐ ఏజీఎం సస్పెన్షన్ వ్యవహారం వెనుక పెద్దమొత్తంలో నల్లధనం తెల్లగా మారినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రాగా, వీరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆర్‌బీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. డెల్టా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బినామీ పేర్లుతో ఖాతాలు తెరిచి వారి ద్వారా పెద్ద మొత్తంలో రూ. 500, రూ. 1000 నోట్లు మార్చినట్టు సమాచారం. ఈ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు బ్యాంకు మేనేజర్లపైనా ఆర్‌బీఐ అధికారులు నిఘా ఉంచినట్టు తెలుస్తోంది. వీరు సెలవుపై వెళ్లేందుకు యత్నించినా.. ఉన్నతాధికారులు మాత్రం ససేమిరా అన్నట్టు విశ్వసనీయ సమాచారం.