
ప గో జిల్లా, తణుకు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని నిర్మించాల్సిన పనిని వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాజధానిలో భూ దోపిడీ మాత్రం చేశారని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. శుక్రవారం తణుకు పట్టణ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాట్లాడిన సుబ్బారెడ్డి.. మళ్లీ మీరే రావాలని కోరటానికి అసలు బాబు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు.
‘ఎంతో ప్రాముఖ్యత ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తామంటే దాన్ని నువ్ టేకప్ చేసి ప్రజలకు ప్రాజెక్ట్ కూడా లేకుండా చేసావ్. నీ పాలనలో మంత్రులు నుండి గ్రామస్థాయి నాయకులవరకూ అంతా దోపిడీకే పాల‍్పడ్డారు. నీ పాలనలో అర్హులైన వారికి పెన్షన్ లు అందాలన్నా కమీషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నీవు నీ స్వార్ధ ప్రయోజనాలకోసం రోజుకొకరితో కలుస్తావ్ ఎంతకైనా దిగజారతావు. మా పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. మేము ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోం. ఒంటరిగానే పోటికి దిగుతాం’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment