సాక్షి, పశ్చిమ గోదావరి: లంచం తీసుకుంటున్న సెంట్రల్ ఎక్సైజ్ అధికారి బుధవారం సీబీఐకి చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరిలోని తణుకులో కొమ్మోజు హరికృష్ణ ఆదిత్య కమ్యూనికేషన్ పేరుతో ఐడియా సంస్థ సిమ్‌కార్డులు అమ్మటానికి కేంద్ర ప్రభుత్వ జిఎస్‌టి లైసెన్స్ తీసుకున్నారు. అయితే గత ఆరునెలలుగా వ్యాపారంలో వృద్ధి లేకపోవటంతో జిఎస్‌టి లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించిన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ కళ్యాణ చక్రవర్తి రూ.2 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు హరికృష్ణ సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. హరికృష్ణ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కళ్యాణ చక్రవర్తి కి రెండు వేల రూపాయలు లంచం ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కళ్యాణ చక్రవర్తిని సీబీఐ కోర్టుకు తరలించారు. కాగా అధికారి వేధింపులు భరించలేకే సీబీఐని ఆశ్రయించానని హరికృష్ణ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment