kalyan chakravarti
-
మైండ్‌ను గ్రీన్జోన్లో ఉంచండి
కరోనాను అర్థం చేసుకున్నాం దాదాపు. ఇక జీవితం అర్థం కావాలి. ఇంతకు ముందు ఉండే జీవితాన్ని మార్చుకొని కొత్తది నేర్చుకోవాలి. సమస్యలు, సవాళ్లు, ఆశాభంగాలు, ఆత్మీయులతో దూరాలు నిద్రలేమిని ఇస్తాయి.జీవితం రెడ్‌జోన్‌లో ఉందని తెలిసినప్పుడు మైండ్ ఉద్వేగంలోకి వెళుతుంది.కళ్లెం లేనిదై పరిగెడుతుంది. దానిని శాంతపరిచి వశపరుచుకున్నవాడే ఇప్పుడు విజేత. దారిన వెళుతున్నప్పుడు పాము ఎదురు పడితే ఎగిరి పక్కకు దూకి కాపాడుకోవచ్చు. కాని కనిపించని క్రిమి ఎదురు పడితే? అశోక్ రామ్ తన బెడ్రూమ్లోని కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. రోడ్డు మీద మనిషి ఆనవాలు లేదు. వాహనాల కదలికా లేదు. టైమ్ చూశాడు. పన్నెండున్నర. మామూలుగా అయితే ఆ టైమ్‌లో కూడా ఏదో ఒక సందడి ఉండే రోడ్డు అది. ఇప్పుడు మాత్రం చడీచప్పుడు లేదు. అశోక్ రామ్‌కు రాత్రయ్యి చాలాసేపయినట్టుగా ఉంది. ఏడింటికే అంతా సద్దుమణిగిపోవడంతో పన్నెండున్నర అంటే సగం రాత్రి అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. మామూలు రోజుల్లో అయితే అతడు ఆఫీసు నుంచి వచ్చి, స్నానం చేసి, భోజనం చేసి, కాసేపు టీవీ చూసే సరికి పదకొండు అవుతుంది. అప్పడే అతనికి రాత్రి అయినట్టు. ఇప్పుడు? సాయంత్రం నుంచే రాత్రయిన ఫీలింగ్ వస్తోంది. అతనికి రాత్రయితే భయం వేస్తోంది. గత పదిహేను రోజులుగా నిద్ర రావడం లేదు. ఏం చేసినా రావడం లేదు. అతడికి తాగుడు అలవాటు లేదు. దుర్వ్యసనాలు ఏమీ లేవు. మంచి ఆరోగ్యమే. కాని నిద్ర పట్టడం లేదు. పడుకుంటే పీడకలలు. గుండె దడ. ఏదో తెలియని భయం. పక్కన చూశాడు. భార్య బెడ్ మీద పడుకుని ఉంది. హాల్లో పిల్లలు పడుకుని ఉన్నారు. మొత్తం మూడు ప్రాణాలు తన పైన ఆధారపడి ఉన్నాయి. మేడ్చల్‌లోని ఒక ఫ్యాక్టరీలో సీనియర్ స్టోర్ కీపర్‌గా పని చేస్తున్నాడు. ముప్పై వేల వరకూ వస్తాయి. కుటుంబాన్ని మర్యాదగా లాక్కుంటూ వస్తున్నాడు. ఉత్తరాది నుంచి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చి ఆ మాత్రం ఎదగడం అతని సొంతప్రాంతంలో, హైదరాబాద్‌లో ఉన్న బంధువర్గంలో గొప్పగానే చెప్పుకుంటారు. అంతా బాగున్నట్టే. ఒక సగటు జీవి తన జీవితం నుంచి ఇంకేం ఆశిస్తాడు? మొదటి షాక్ మార్చి నెల జీతం తీసుకున్నప్పుడు తగిలింది. పది శాతం కోత విధించారు. కరోనా లాక్డౌన్ వల్ల ఏప్రిల్‌లో ఉద్యోగానికి రానక్కర్లేదని, జీతం అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది ఎంత వేస్తారో ఈసారి ఎంత కోత ఉంటుందో తెలియదు. ఏప్రిల్ రెండో వారం నుంచి ఉద్యోగుల్లో పుకార్లు బయలుదేరాయి. ఇళ్లల్లో ఉన్న ఉద్యోగులు చాలామంది ఆందోళనగా ఒకరికొకరు ఫోన్లు చేసుకున్నారు. ఉద్యోగాలు తగ్గిస్తారని, కొందరిని తీసేస్తారని, కొందరిని ఉంచుకున్నా సగం జీతమే ఇస్తారనీ... అశోక్రామ్లో మెల్లగా భయం ప్రవేశించింది. జీతం ఫుల్లుగా వస్తేనే నెల తిరిగేసరికి కటాకటిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కోతలు వాతలు అంటే? అది పోనీ. అసలు ఉద్యోగమే పోతే. భయం స్థానంలో వొణుకు వచ్చింది. టీ బాగలేదు. అందుకని అరగంట నుంచి భార్యను తిడుతున్నాడు అశోక్‌రామ్. భార్య అంతకు అంత సమాధానం ఇస్తోంది. పిల్లలు ఇదేం పట్టనట్టు ఫోన్లో ఆడుకుంటున్నారు. ఒక కొడుకు టెన్త్. ఒక కొడుకు ఎయిత్. టెన్త్ పరీక్షలు ఆగిపోయాయి. ఎయిత్ పరీక్షలు అసలు జరగలేదు. వీళ్ల చదువు ఎలా ఉంటుందో తెలియదు. తన భవిష్యత్తులాగే పిల్లల భవిష్యత్తు ఆందోళన కలిగిస్తోంది. ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయి. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆ రెండు ఫోన్ల కోసం నలుగురూ కీచులాడుకోవాల్సి వస్తోంది. నలుగురూ ఫోన్‌కి బాగా అడిక్ట్ అయ్యారు. నలుగురూ ఇంట్లో కలిసి ఉంటే ఆప్యాయత పెరగాలి. కాని నలుగురూ నాలుగు విధాలుగా ఐసొలేట్ అయ్యారు. ఇంతకుముందు ఇరుగింటికి వెళ్లి పొరుగింటికి వెళ్లి రిలాక్స్ అయ్యేది అతని భార్య. ఇప్పుడు ఏ ఇంటికీ వెళ్లే పరిస్థితి లేక అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుండడంతో ప్రతి చిన్న విషయానికీ కస్సుమంటోంది. ఇవన్నీ అశోక్ రామ్‌ను మెల్లగా డిప్రెషన్లోకి నెట్టాయి. జీవితం మీద వ్యామోహం మెల్లగా తగ్గిపోతూ వచ్చింది. దాంతో రాత్రిళ్లు నిద్రలేక పగలు ప్రశాంతత లేక మనిషి దారుణంగా దెబ్బ తిన్నాడు. ‘కరోనా వచ్చిన వాళ్లు ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వస్తుంటే అసలు ఏ రోగం రాని ఈ మనిషి ఇలా తయారవ్వడం ఏంటి’ అని భార్య ఏడుపు మొదలెట్టింది. అంతా విన్న బంధువొకరు అశోక్‌ను ఫోన్ ద్వారా సైకియాట్రి కౌన్సిలింగ్‌కి ఒప్పించాడు. ‘ఆశోక్రామ్ గారూ ఒకటి చెప్పండి. ఇది మీకు మాత్రమే వచ్చిన కష్టమా? అందరికీ వచ్చిన కష్టమా?’ అడిగాడు సైకియాట్రిస్ట్. ‘అందరికీ’ ‘మరి. దేనికి భయపడుతున్నారు. ఈ కష్టం మీదొక్కరిదే కాదు. ప్రపంచం మొత్తం పోరాడుతోంది. మీతోపాటు ఆకలితో ఉండేవాళ్లు ఉంటారు. మీతోపాటు ఆశతో పోరాడేవాళ్లు ఉంటారు. రెడ్‌జోన్ ఆరంజ్ జోన్ కావడం ఆరంజ్ జోన్ గ్రీన్ జోన్‌గా మారడం మీరు చూడటం లేదా? మరెందుకు భయం. జీవితం ఎప్పుడూ రెడ్‌జోన్‌లోనే ఉంటుంది. ఒకటి రెండేళ్లు బ్యాడ్‌టైమ్ వస్తే ఆ తర్వాత మంచి టైమ్ వస్తుందని అనుకోండి. ముందు మీరు ఒక్కరిగా మీలో మీరు మధనపడటం మానేయండి. మీ నుంచి మీరు పారిపోవడానికి ఫోన్లోకి దూరడం కూడా మానేయండి. మీలాంటి సహోద్యోగులతో కాకుండా వేరే వాళ్లతో మాట్లాడండి. లోకంలో ఏం జరుగుతోందో తెలుసుకోండి. ఇంత కష్టకాలంలో కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నవారిని గమనించండి. వందలాది కిలోమీటర్లు మూటలు మోస్తూ నడిచి వెళ్లేవారి కంటే మీరు ఎంతో బెటర్‌గా ఉన్నారు కదా. వారు జీవితాన్ని ధైర్యంగా తీసుకుంటున్నప్పుడు మీరెందుకు తీసుకోరు? ఇలాంటి మహమ్మారులు ఎన్నో వచ్చాయి అశోక్‌రామ్ గారూ. మన తాత ముత్తాతలు వాటితో పోరాడారు. ఆ రక్తం మనలో ఉంది. కనుక భయపడకండి. అందరితో పాటు నేను అనుకుని భవిష్యత్తు గురించి ఎక్కువ బెంగపడకుండా షార్ట్‌టర్మ్ ప్లాన్లతో ఈ రెండు నెలలకు ఈ మూడు నెలలకు అనుకుంటూ మీ బడ్జెట్‌ని, జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. వొత్తిడి తగ్గుతుంది. నిద్ర కూడా వస్తుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్. తనకే కాదు తనలాంటి ఆలోచన ఉన్న చాలామందికి ఈ అవగాహన అవసరం అని అనిపించింది అశోక్రామ్కు. - డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
రక్షిత్ టెన్త్ అట కదా.. ఇప్పుడేం చేయాలి!
‘మీ అబ్బాయి టెన్త్ అట కదా’... ‘బాగా చదువుతున్నాడా?’... ‘పరీక్షలు బాగా రాసి మీ అమ్మా నాన్నలకు పేరు తేవాలోయ్’... ‘ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి బాబు’... ‘మీ అమ్మా నాన్నల ఆశలన్నీ నీ మీదే’...ఫైనల్ పరీక్షలనే సరికి పలకరింపులతోనే పిల్లలకు సగం స్ట్రెస్ పెంచుతారు చుట్టుపక్కలవాళ్లు. తల్లిదండ్రుల ఆరాటం సరేసరి. పిల్లాడు పరీక్షకే వెళుతున్నది... యుద్ధానికి కాదు. తమ శక్తి మేరకు, సామర్థ్యం మేరకు, సౌకర్యం మేరకు పిల్లలు పరీక్షలు రాసేలా ఉత్సాహపరచాలి తప్ప బెంబేలెత్తించి కాదు. పాల్గొనడానికి నిరాకరించే స్థాయిలో వత్తిడి తేకుండా జాగ్రత్త పడమని చెప్పేదే నేటి కథనం. రక్షిత్ సరిగ్గా చదవడం లేదు. పరీక్షలు గట్టిగా నెల రోజులు ఉన్నాయి. ముందు బాగానే ఉండేవాడు. రోజూ పుస్తకాలు తెరిచేవాడు. ఇప్పుడు చిత్రంగా మారిపోయాడు. స్కూల్లో సిలబస్ అయిపోయిందని ఒకరోజు వెళుతున్నాడు ఒకరోజు వెళ్లడం లేదు. లేట్‌గా నిద్ర లేస్తున్నాడు. పుస్తకం పట్టుకున్నా టీవీ చూస్తున్నాడు. ‘చదువుకో నాన్నా.. అసలే టెన్త్ క్లాస్’ అని తల్లి అంటే ‘నాకు తెలుసులే’ అని కసురుతున్నాడు. ఒక్కగానొక్క కొడుకు. టెన్త్ మంచి మార్కులతో పాస్ అయితే మంచి కాలేజీలో చేర్పించడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. కాని రక్షిత్ వాలకం మాత్రం వేరేగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి?. ........................ రక్షిత్ చిన్నప్పటి నుంచి యావరేజ్ స్టూడెంట్. తల్లిదండ్రులకు ఒకే పిల్లాడు కాబట్టి సహజంగానే ఇష్టం, ప్రేమ ఎక్కువ. వాడు బాగా చదవాలని కోరిక కూడా ఉంది. మంచి స్కూల్లో చేర్పించారు. అడిగినవన్నీ ఇప్పించారు. బాగా చదవాలని పదే పదే చెప్పారు. కాని పరీక్షలు వచ్చేసరికి వాడు బాగా కంగారు పడుతుంటాడు. ‘ఇప్పుడు తక్కువ మార్కులు వస్తే ఏం చేస్తారు?’ అడుగుతాడు. ‘ఏం చేస్తామురా. ఈసారి బాగా రాయి అంటాము’ అంటుంది తల్లి. ‘మళ్లీ తక్కువొస్తే?’ ‘ఎందుకొస్తాయి?’ ‘వస్తే..?’ ‘రాకూడదు. మంచి మార్కులు రావాలి’‘అదిగో... నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని’. మంచి మార్కుల కోసం ఎక్కువ చదువుతాడు నిజమే కాని మంచి మార్కుల ఆరాటంలో పాఠాలు అర్థం చేసుకోడు. అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోడు. రుబ్బి రుబ్బి చదివి మర్చిపోతాడు. లేదా వొత్తిడి వల్ల అసలు సమయానికి రాయలేకపోతాడు. చివరకు అత్తెసరు మార్కులు వస్తాయి. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది... ఈ క్లాసులన్నీ ఇలాగే జరిగాయి. కాని ఇప్పుడు పది వచ్చింది. ∙∙ పదికి వచ్చినప్పటి నుంచి ఇరుగు పొరుగువారు, బంధువుల హెచ్చరిక జెండాలు ఎగరడం ఎక్కువైంది. ‘ఏమ్మా... మీ రక్షిత్ గాడిలో పడ్డాడా. ఏరా.. రక్షిత్ బాగా చదువుతున్నావా’ అని ఒకరు... ‘మా పిల్లవాడు చూడు ఎంతమంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో... నువ్వూ వాడి తమ్ముడి వరసే కదరా.. నీకెందుకు రావు’ అని ఒకరు ‘ఈ సంవత్సరం మీరు ఎలా చేస్తారో ఏమిటో’ అని వేరొకరు ఒకటే దాడి. తల్లిదండ్రులు ఆ మాటలు విని తమ మాటలు పెంచారు. ‘ఒరే.. ఇంకొకణ్ణి కంటే నిన్ను సరిగ్గా చూసుకోలేమని కనలేదు. నువ్వే మా ఆశవు. మన బంధువుల్లో అందరూ బాగా చదువుతున్నారు. నువ్వు తప్ప. టెన్త్ బాగా చదవాలి’ అని. ఇవన్నీ విని రక్షిత్ చదువుతున్నట్టే కనిపించాడు. కాని సడన్‌గా మారిపోయాడు. స్కూల్‌కు వెళ్లకపోవడం, చదవకపోవడం, టీవీ చూడటం... తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సిలింగ్ కోసం తీసుకెళ్లారు ..................... ‘డాక్టర్.. ఇదీ పరిస్థితి. అసలు ఎగ్జామ్స్ రాయడానికి వెళతాడో లేడో అన్నంత భయంగా ఉంది’ అంది తల్లి రక్షిత్‌ని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొచ్చి. సైకియాట్రిస్ట్ ఆమెను బయటకు పంపించి రక్షిత్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కాని రక్షిత్ సహకరించలేదు. ‘రక్షిత్.. చూడు.. నేను ఇక్కడ ఉన్నది నీ మనిషిగా. నీకు హెల్ప్ చేయడానికి ఉన్నాడు. మీ అమ్మా నాన్నల మాటలు విని నిన్ను తప్పు పట్టను. నీ మాటలు విని నీ బాధ అర్థం చేసుకుంటాను’ అని ఊరడింపుగా అడిగేసరికి రక్షిత్ చాలా సేపు ఏడ్చాడు. తర్వాత చెప్పాడు... ‘అంకుల్.. నాకు పరీక్షలంటే భయం లేదు కానీ మంచి మార్కులు రాకపోతే అమ్మా నాన్నలు బాధ పడతారని టెన్షన్ పడతాను. ఎంత చదివినా చదివింది మర్చిపోతానేమోనన్న టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అమ్మానాన్నలతో పాటు మా బంధువులకు, ఫ్రెండ్స్‌కు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. నేను బాగా చదివినా సరిగ్గా రాయలేక ఫెయిల్ అయితే అందరూ మా అమ్మానాన్నలనే అంటారు... వాళ్లు నన్ను సరిగ్గా పెంచలేదని. అందుకని నేను అందరి ముందు సరిగ్గా చదవకుండా నా తప్పు వల్లే ఫెయిల్ అయ్యాను అనిపించుకుంటే నన్ను తిడతారు తప్ప వారిని ఏం అనరు కదా. అందుకని నేను చదవడం లేదు’ అన్నాడు. సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది.. ‘రక్షిత్ ఏ స్టూడెంట్ అయినా మూడు చీౖచీ లను పట్టించుకోకూడదు. othersలోని ఓ.. Openionsలోని ఓ.. Outcomeలోని ఓ. నీ ఇరుగుపొరుగు వాళ్లని, వాళ్ల అభిప్రాయాలని పట్టించుకోకు. వాళ్లు నీకేం అన్నం పెట్టరు. ఫీజు కట్టరు. మీ అమ్మా నాన్నలు ఆశిస్తున్న అవుట్కమ్ని కూడా పట్టించుకోకు. అది నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉన్నదల్లా నువ్వు ఎంత కష్టపడగలవో అంత కష్టపడటం. ఇక మర్చిపోవడం గురించి. ఏదో ధ్యాస లో తల ఒంచుకుని ఒక దారిలో వెళితే మళ్లీ ఆ దారిని గుర్తు పట్టగలవా? లేవు. అదే బాగా గమనిస్తూ ఒకటికి నాలుగు సార్లు ఆ దారిలో తిరిగితే ఎప్పటికీ మర్చిపోవు. శ్రద్ధ పెట్టి నీ పాఠాలు ఒకటికి నాలుగుసార్లు చదివితే ఎందుకు మర్చిపోతావు. మర్చిపోతావేమో అని మైండ్ భయపెడుతూ మరింత బాగా చదివిస్తుంటుంది. ఇది అందరికీ ఉండే భయమే. నువ్వు ఫర్ఫెక్ట్గా ఉన్నావు. పరీక్షలు బాగా రాయి. యావరేజ్ రిజల్ట్స్ వస్తాయా, టాప్ రిజల్ట్స్ వస్తాయా నీకెందుకు? మీ మనసులో నువ్వు గిల్ట్ ఫీలవకుండా కష్టపడటమే నీకు కావలసింది. మీ అమ్మా నాన్నలకు కూడా అది అర్థమయ్యేలా చెబుతాను’ అన్నాడు సైకియాట్రిస్ట్. రక్షిత్‌కి కొంచెం ధైర్యం వచ్చింది. ‘నేను బాగా రాయగలనా?’ అని అడిగాడు. ‘కచ్చితంగా బాగా రాయగలవు. ఇంత వర్రీ అవుతున్నావంటే నీకు చాలా బాధ్యత ఉందని అర్థం. బాధ్యత ఉన్నవాడు ఎలా ఓడిపోతాడు చెప్పు’ అన్నాడు సైకియాట్రిస్ట్. ఆ తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కూడా అదే చెప్పాడు. ‘మీ అబ్బాయికి మీ బరువు సరిపోతుంది. ఇరుగుపొరుగువారి బరువు కూడా ఇవ్వకండి. మీ ఇంటి మొక్క ఎంత పెరగగలదో అంత పెరగగలదు. ఊరి చెట్లతో పోటీ పెట్టకండి. మీ మొక్కను సౌకర్యంగా సంరక్షించండి చాలు’ అన్నాడు. పరీక్షలు మరో మూడు వారాల్లో ఉండగా జరిగిన ఈ కౌన్సెలింగ్ రక్షిత్‌కు లాభించింది. అతడు పరీక్షలకు మనస్ఫూర్తిగా సిద్ధం అయ్యాడు. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
సీబీఐ వలలో ఎక్సైజ్ అధికారి
సాక్షి, పశ్చిమ గోదావరి: లంచం తీసుకుంటున్న సెంట్రల్ ఎక్సైజ్ అధికారి బుధవారం సీబీఐకి చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరిలోని తణుకులో కొమ్మోజు హరికృష్ణ ఆదిత్య కమ్యూనికేషన్ పేరుతో ఐడియా సంస్థ సిమ్‌కార్డులు అమ్మటానికి కేంద్ర ప్రభుత్వ జిఎస్టి లైసెన్స్ తీసుకున్నారు. అయితే గత ఆరునెలలుగా వ్యాపారంలో వృద్ధి లేకపోవటంతో జిఎస్టి లైసెన్స్‌ను రద్దు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించిన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ కళ్యాణ చక్రవర్తి రూ.2 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు హరికృష్ణ సీబీఐ అధికారులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు రంగంలోకి దిగారు. హరికృష్ణ సెంట్రల్ ఎక్సైజ్ అధికారి కళ్యాణ చక్రవర్తి కి రెండు వేల రూపాయలు లంచం ఇస్తుండగా సిబిఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కళ్యాణ చక్రవర్తిని సీబీఐ కోర్టుకు తరలించారు. కాగా అధికారి వేధింపులు భరించలేకే సీబీఐని ఆశ్రయించానని హరికృష్ణ తెలిపాడు. -
తూచ్...
ఈ ప్రభుత్వంలో ఎప్పుడేం జరుగుతుందో... ఎప్పుడు ఎవర్ని మార్చేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా ఉత్తర్వులిచ్చి...ఇలా రద్దు చేసేస్తున్నారు. ఉత్తర్వులకు విలువ లేకుండా తూచ్ అనేస్తున్నారు. వారం రోజుల క్రితం డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్‌గా శ్రీకాకుళం పీడీగా పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తిని నియమించారు. ఇంతలో ఏమైందో తెలియదు గాని ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఆ పోస్టులో ప్రస్తుతం గుంటూరులో డీఆర్డీఎ పీడీగా పనిచేస్తున్న ప్రశాంతిని నియమించారు. ఇలా రోజుల వ్యవధిలోనే నియామకాలు మార్చేయడం ప్రస్తుత సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఆ మధ్య డీఆర్డీఏ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న సుధాకర్‌ను ఇన్చార్జ్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతలోనే తెరవెనుక ఒత్తిళ్లు రావడంతో హుటాహుటీన ఆ పోస్టులో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజును నియమించారు. అంతకుముందు వివాదాస్పదంగా నిలిచిన పంచాయతీరాజ్ డీఈఈ శ్రీనివాస్‌కు పీఎ టూ ఎస్ఈగా నియమించారు. ఆ ఉత్తర్వులిచ్చిన నాలుగురోజుల్లోనే రద్దు చేస్తూ మరో ఉత్తర్వులిచ్చారు. దీన్నిబట్టి సర్కార్ ఇస్తున్న ఉత్వర్వులకు విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. చెప్పాలంటే నవ్వులాటగా మారిపోయింది. దంపతులిద్దరికీ కీలక పోస్టింగ్‌లు డీఆర్డీఎ పీడీగా ఢిల్లీరావు నియమితులైన రోజునే ఆయన భార్య ప్రశాంతి కోసం ఏదొక పోస్టు ఖాళీ చేయాల్సిందేనని ‘సాక్షి’ ముందే చెప్పింది. ఇప్పుడదే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీరావు దంపతులిద్దరూ గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నారు. అక్కడ డ్వామా పీడీగా ఢిల్లీరావు, డీఆర్డీఎ పీడీగా ప్రశాంతి పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అనూహ్యంగా ఢిల్లీరావు ఇక్కడ డీఆర్డీఏ పీడీగా నియమితులయ్యారు. అదే సందర్భంలో డ్వామా పీడీగా శ్రీకాకుళంలో అదే పోస్టులో పనిచేస్తున్న కళ్యాణ చక్రవర్తి నియమితులయ్యారు. దీంతో స్పౌజ్ కోటాలో జిల్లాకొస్తున్న ప్రశాంతికి ఆ స్థాయి పోస్టు జిల్లాలో కనిపించలేదు. తొలుత ఆర్డీఓగా రావాలని భావించా రు. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వెంకటరావు తన రాజకీయ సన్నిహితుల ద్వారా గట్టిగా ప్రయత్నించి బదిలీని ఆపుకొన్నారు. దీంతో అప్పటికే ఖాళీగా ఉన్న డీఆర్ఓ పోస్టుపై దృష్టి సారించారు. ఇంతలోనే విశాఖపట్నం ఏజేసీగా పనిచేసిన వై.నర్సింహారావు యుద్ధ ప్రాతిపదికన డీఆర్ఓ పోస్టింగ్ వేయించుకున్నారు. ఇక హౌసింగ్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు తప్ప మరేది ఖాళీగా లేని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో ఆమెను హౌసింగ్ పీడీగా నియమించారన్న ప్రచారం జరిగింది. అంతా అదే భావించారు. కానీ అనూహ్యంగా ప్రశాం తికి డ్వామా పీడీ పోస్టు వరించింది. పైరవీలు, ప్రయత్నాలు ఏ స్థాయిలో ఫలించాయో తెలియదు గాని కళ్యాణ చక్రవర్తికిచ్చిన ఉత్తర్వులను రద్దుచేసి ఆ స్థానంలో ప్రశాంతిని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరికీ కీలక పోస్టులు దక్కినట్టయింది. గుంటూరులో ఢిల్లీరావు డ్వామా పీడీగా పనిచేస్తే ఇక్కడ డీఆర్డీఎ పీడీగా నియమితులు కాగా, ప్రశాంతి అక్కడ డీఆర్డీఎ పీడీగా పనిచేస్తే ఇక్కడ డ్వామా పీడీగా నియమితులయ్యారు. జిల్లా మారడంతో వారిద్దరి పోస్టులు తారుమారైనట్టు అయింది. గతంలో జిల్లాలో పనిచేసినప్పుడు ఢిల్లీరావు విజయనగరం ఆర్డీఓగా పనిచేయగా, ప్రశాంతి పార్వతీపురం ఆర్డీఓగా పనిచేశారు. కొన్నాళ్ల తర్వాత ప్రశాంతి కేఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, హౌసింగ్ స్పెషలాఫీసర్ పోస్టులో కూడా పనిచేశారు. కొంపముంచిన ఆలస్యం ఈ ప్రభుత్వంలో ఉత్తర్వులకున్న విలువ ఏంటో తెలియక ఇటీవల డ్వామా పీడీగా నియమితులైన కళ్యాణ చక్రవర్తికి అనూహ్య షాక్ తగిలింది. ఉత్తర్వులిచ్చిన వెంటనే జాయిన్ అవ్వకపోవడంతో కొంపమునిగినట్టయింది. ఎప్పుడెలా ఉంటుందో తెలియకే ఇలా చేసి ఉంటారన్న వాదనలు వినిపించాయి. బదిలీ ఉత్తర్వులు వచ్చి వారం రోజులైనా చేరకపోవడంతో ఇదే అవకాశంగా తీసుకుని ప్రశాంతిని అదే పోస్టులో నియమించారని అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో జెడ్పీ సీఈఓగా నియమితులైన గనియా రాజకుమారి, డీఆర్ఓగా నియమితులైన వై.నర్సింహారావు ముందు జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు జెడ్పీ సీఈఓగా పనిచేసిన మోహనరావు ప్రయత్నాలు ముమ్మురం చేసి, మళ్లీ రిటెన్షన్ ఉత్తర్వులు తెచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హుటాహుటీన వచ్చి గనియా రాజకుమారి ఇక్కడి బాధ్యతల్ని స్వీకరించారు. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేసినా మోహనరావుకు రిటైన్షన్ వచ్చేదని, తిరిగి సీఈఓగా కొనసాగేవారని జెడ్పీలో ఇప్పటికీ చర్చ సాగుతోంది. డీఆర్ఓ వై.నర్సింహరావు విషయంలో కూడా అదే జరిగింది. వాస్తవానికి నర్సింహరావు అంతకుముందు విశాఖ అడిషనల్ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అదే పోస్టులో కొనసాగేందుకు రిటెన్షన్ వస్తుందని ఆశించారు. ఆ దృష్ట్యా మరో పోస్టు కోసం ప్రయత్నించలేదు. కానీ అకస్మాత్తుగా ఆయన కొనసాగుతున్న ఏజేసీ పోస్టులో వేరొకర్ని నియమించేశారు. దీంతో ఆయనకు పోస్టు లేని పరిస్థితి నెలకొంది. తీవ్రంగా ప్రయత్నించి అప్పటికే జిల్లాలో ఖాళీగా ఉన్న డీఆర్ఓ పోస్టింగ్‌ను వేయించుకున్నారు. ఆ ఉత్తర్వుల్ని రద్దు చేసి ఇంకొకరు వేయించుకుంటారేమోనన్న భయంతో బదిలీ ఉత్తర్వు వచ్చిన మరుసటి రోజునే విధుల్లో చేరిపోయారు. లేదంటే ఆ పోస్టులో ప్రశాంతి నియమతులయ్యే వారనే ప్రచారం జరిగిం ది.