
సాక్షి, పశ్చిమ గోదావరి : నర్సాపురం పార్లమెంట్ ఓటర్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజును మర్చిపోయారని తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కరోనా మొదలు ఇప్పటి వరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించలేదని, వరదల సమయంలోను ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ఎవరి ఇంటిలో వారు వినాయకచవితి చేసుకోవాలని సూచిస్తే దానిని రఘురామ కృష్ణంరాజు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’)
పార్టీలు,మతాలకతీతంగా వైఎస్ జగన్ పాలన చేస్తుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హిందుదేవాలయాలు కూల్చి వేస్తే ఆనాడు బిజేపిలో ఉన్న రాఘురామ కృష్ణం రాజు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉన్మాది, ఉగ్రవాదిలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావని విమర్శించారు. పుష్కరాలలో అంతమంది చనిపోతే ఎందుకు మాట్లాడలేదని, కులాలా మధ్య, మతాల మధ్య చిచ్చు పెడితే తనను కేంద్రమే జైలుకు పంపిస్తుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు)
Comments
Please login to add a commentAdd a comment