
పాదయాత్రలో వైఎస్ జగన్
సాక్షి, తణుకు (పశ్చిమ గోదావరి) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ బుధవారం ఉదయం తణుకు శివారు నుంచి 182వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ ఉదయం నుంచి తణుకులో భారీ వర్షం కురుస్తోంది. ఎంతకీ తగ్గకపోవడంతో భారీ వర్షంలోనే వైఎస్ జగన్ పాదయాత్రకు బయలుదేరారు. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.
తణుకు శివారు నుంచి పాదయాత్ర నిడదవోలు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఉండ్రాజవరం మండలం పాలంగి, ఉండ్రాజవరం మీదుగా చిలకపాడు క్రాస్ రోడ్డు చేరుకున్న తర్వాత వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తర్వాత మోర్తా, దమ్మెన్ను మీదుగా నడిపల్లి కోట చేరుకున్న తర్వాత ఈరోజు పాదయాత్ర ముగుస్తోంది. జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు.