
మంచు విష్ణు వర్ధన్
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చరిత్రాత్మకమని హీరో మంచు విష్ణు వర్ధన్ అభిప్రాయపడ్డారు. పాదయాత్ర చేసిన ఎవరూ ఇప్పటివరకూ అపజయం పాలుకాలేదని, రాజుల కాలం నాటి నుంచి ఇదే రివాజుగా వస్తోందన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిన తర్వాత విజయం సాధించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీటన్నింటిని పక్కనబెడితే రోజుకు ఐదు కిలోమీటర్లు పరిగెత్తడానికి తాను చాలా ఆయాస పడతానని, అలాంటిది 2 వేల కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేయడం మామూలు విషయం కాదన్నారు.
శుక్రవారం తణుకులోని స్ప్రింగ్ బోర్డు పాఠశాలలో మంచు విష్ణు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏపీలో ప్రస్తుత విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సివుందని, విద్యార్థికి ర్యాంకులు, మార్కులే ప్రామాణికం కాదని అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశ నుంచి పిల్లలకు విలువలు నేర్పడం వల్ల వారు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని చెప్పారు. కాగా, మంచు విష్ణు తర్వాతి చిత్రం ‘ఓటర్’ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబించేలా తెరకెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment