
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్(వెస్ట్ మీరట్)గా పని చేస్తున్న ముత్యాల రాంప్రసాదరావు నివాసంలో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఆయన ఇంటిపైనా, సమీప బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పని చేసిన కాలంలో పెద్దఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు.
ఈయన సంపాదించిన అక్రమ ఆస్తులతో ఆయన భార్య కనకదుర్గ తణుకులో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తణుకులో రాంప్రసాదరావుకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కనకదుర్గకు సహాయకుడిగా ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు అతని ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment