CBI Officers
-
బాలాసోర్‌లోని ప్రమాద స్థాలానికి సీబీఐ అధికారులు
-
వాంగ్మూలంలో నేనా విషయాలు చెప్పలేదు
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలమంటూ కొన్ని పత్రికల్లో ప్రచురితమైన విషయాలు పూర్తిగా అవాస్తవమని పులివెందుల మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ చెప్పారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ అధికారులు తనను అడగని విషయాలు, తాను చెప్పని విషయాలను వాంగ్మూలంగా కొన్ని పత్రికలు ప్రచురించడాన్ని ఖండిస్తున్నానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డిల మధ్య విభేదాలు ఉన్నాయని. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని వివేకానందరెడ్డి వ్యతిరేకించారని తాను వాంగ్మూలం ఇచ్చినట్లుగా వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని తెలి పారు. ‘సీబీఐ అధికారులు పిలిస్తే గత ఏడాది ఆగస్టు 9న వెళ్లాను. వివేకానందరెడ్డి మరణించిన రోజున ఏం జరిగిందని అడిగారు. వివేకా చనిపోయారని తెలిసి ఆ రోజు ఉదయం 7.45 గంటల సమయంలో అక్కడకు వెళ్లానని, వివేకా మృతదేహం బెడ్రూంలో ఉందని చెప్పాను. అప్పటికే ప్రజలు ఎక్కువగా వస్తుండటంతో వారిని నియంత్రిస్తూ అక్కడే ఉన్నానని తెలిపాను. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తీసుకెళ్లిన తర్వాత ఇంటికి వచ్చేసినట్లు చెప్పాను. 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తే వైఎస్సార్సీపీ గెలుస్తుందని అడిగారు. వైఎస్సార్సీపీకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉందని, ఎవరు అభ్యర్థి అయినా పార్టీ గెలుస్తుందని చెప్పాను. అప్పటికే అవినాష్‌రెడ్డి విజయం కోసం వివేకా ప్రచారం చేస్తున్నారని కూడా చెప్పాను. కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ అధికారులు అడిగింది అదొక్కటే. నేను చెప్పింది ఇంతే. కానీ నన్ను అడగని విషయాలు, నేను చెప్పని విషయాలను సీబీఐ నా వాంగ్మూలంగా రాసుకోవడం దిగ్భ్రాం తికి గురి చేసింది. వివేకా జీవించి ఉంటే 2019లో కడప ఎంపీ టికెట్ ఆయనకే ఇచ్చేవారని నేను చెప్పినట్లుగా వాంగ్మూలంలో రాశారు. ఎంపీ టికెట్ వైఎస్ షర్మిలకు ఇవ్వాలని వివేకా భావించారని కూడా నేను చెప్పినట్లు పేర్కొన్నారు. వివేకా, అవి నాష్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు చెప్పానని రాసుకున్నారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవం. ఆ విషయాలేవి నన్ను అడగలేదు, నేను చెప్పలేదు’ అని వరప్రసాద్ స్పష్టం చేశారు. ‘కొందరు సీబీఐ అధి కారులు దురుద్దేశంతోనే నా పేరిట తప్పుడు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దానినే మీడియాకు లీక్ చేస్తున్నారు. ఈ కేసును, ప్రజలను తప్పుదోవ ప ట్టించేందుకే ఆ అధికారులు ఇలా నిబంధనలకు వి రుద్ధంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయడమే ఏకైక అజెండాగా ఉన్న కొన్ని పత్రికలు, టీవీ, యూట్యూబ్ చానళ్లు ఇదే అవకాశంగా తప్పుడు వార్తలు ప్రచురిస్తూ కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. సీబీఐ అధికారులు, ఆ మీడియా సంస్థలపై న్యాయపరంగా పోరాడుతాను. కుట్రలను తిప్పికొడతాము’అని వరప్రసాద్ పేర్కొన్నారు. -
వివేకా హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదు
అనంతపురం టవర్ క్లాక్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో ఎంపీ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారంలో కుట్ర పూరితంగా ఇరికించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని కల్లూరు గంగాధర్‌రెడ్డి అలియాస్ కొవ్వేటు గంగాధర్ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన అనంతపురం ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్య విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు, వాంగ్మూలాన్ని ఖండించారు. సీబీఐ అధికారులు పిలవడంతో వెళ్లి దర్యాప్తునకు సహకరించానన్నారు. ఈ సందర్భంగా విచారణకు హాజరైనట్లు సంతకం చేయాలంటూ తనతో తెల్ల కాగితంపై సంతకం పెట్టించుకున్నారని వెల్లడించారు. అంతేకానీ వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని తాను ఎలాంటి స్టేట్మెంటూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. తాను ఇచ్చిన స్టేట్మెంట్ ఆడియో, వీడియో రికార్డులు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. అందుకు ఆధారాలున్నాయి.. తనతో పాటు అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలను కేసులో ఇరికించాలనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. దీనికి కారణం వివేకానందరెడ్డి కుమార్తె సునీత, జగదీశ్వర్‌రెడ్డి అని పేర్కొన్నారు. హత్యలో ఆ ముగ్గురి ప్రమేయం ఉందని చెప్పాలంటూ జగదీశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి తనపై ఒత్తిడి తెచ్చారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. తనకు వారు రూ.20 వేల నగదు సైతం ఇచ్చారన్నారు. తాము చెప్పిన విధంగా సీబీఐ అధికారులతో చెబితే రూ.50 లక్షల డబ్బుతో పాటు కారు, తన కాలి చికిత్స ఖర్చులు భరిస్తామంటూ ప్రలోభపెట్టారని వెల్లడించారు. తన స్నేహితుడు జాఫర్ బ్యాంకు అకౌంట్‌కు జగదీశ్వరరెడ్డి రూ.40 వేలు జమ చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం సీబీఐ అధికారి రామ్‌సింగ్ రూ.20 వేలు ఇచ్చారన్నారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. అయితే తాను వారికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదన్నారు. గతంలో జగదీశ్వరరెడ్డి ద్వారా సునీత ఫోన్లో తనతో మాట్లాడారని గంగాధర్‌రెడ్డి తెలిపారు. డబ్బులిస్తాం... ఆ ముగ్గురికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బలవంతం చేశారన్నారు. జగదీశ్వరరెడ్డి, సునీత నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దస్తగిరికి డబ్బులెలా వచ్చాయి? వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై తాను సీబీఐ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చానంటూ ఈనాడు పత్రిక కథనాన్ని ప్రచురించటాన్ని గంగాధర్‌రెడ్డి ఖండించారు. ఈనాడు, సీబీఐ అధికారులపై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి గతంలో తన వద్దకు వచ్చి ఖర్చులకు కూడా డబ్బుల్లేవని, చాలా ఇబ్బందిగా ఉందని వాపోయాడన్నారు. ఫోన్లో వాట్సాప్ మెసేజ్‌లు కూడా పెట్టాడన్నారు. ఇప్పుడు అతడికి ఐస్‌క్రీమ్ పార్లర్ పెట్టేందుకు డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో విచారించాలన్నారు. -
వాంగ్మూలం వెనుక వేధింపులు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనేందుకు తాజా ఉదంతమే మరో ఉదాహరణ. నిజానిజాలు తెలుసుకోకుండా బురద చల్లడమే లక్ష్యంగా టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న రాద్ధాంతానికి ఇది మరో తార్కాణం. కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం పేరిట సీబీఐ ఆడిన డ్రామా బెడిసికొట్టింది. సీఐ శంకరయ్య, డీఎస్పీ వాసుదేవన్ చెప్పని విషయాలను వారి వాంగ్మూలాల పేరిట మీడియాలో ప్రచారం చేయాలన్న ఎత్తుగడలు విఫలం కావడంతో అనంతపురం జిల్లాకు చెందిన కల్లూరు గంగాధర్‌రెడ్డి వాంగ్మూలం పేరిట తాజాగా మరో లీక్ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. వాస్తవం ఏమిటంటే... వైఎస్ వివేకా హత్య కేసులో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నట్లు కల్లూరు గంగాధర్‌రెడ్డి గత ఏడాది నవంబర్ 29న అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన ప్రాణాలకు ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలని అనంతపురం ఎస్పీని కోరుతూ సీబీఐ అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. గంగాధర్‌రెడ్డి ఫిర్యాదులో ప్రధానాంశాలు ఇవీ.. ► టీడీపీ హయాంలో సిట్ బృందం సభ్యుడిగా ఉన్న సీఐ శ్రీరామ్ గతంలో నన్ను కడప డీటీసీకి పిలిచి చిత్ర హింసలు పెట్టారు. వైఎస్ వివేకాను హత్య చేయాలని శివశంకర్‌రెడ్డి నన్ను సంప్రదించినట్లుగా ఒప్పుకోవాలని వేధించారు. ► సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా అవే ఒత్తిళ్లు వచ్చాయి. వైఎస్ వివేకాను హత్య చేసినట్లుగా ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని డి.శివశంకర్‌రెడ్డి చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని సీబీఐ అధికారులు వేధిస్తున్నారు. ► డి.శివశంకర్‌రెడ్డితోపాటు ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు వాంగ్మూలంలో పేర్కొనాలని సీబీఐ అదనపు ఎస్పీ రామ్‌సింగ్ నాపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారు. 2021 అక్టోబరు 2, 3వ తేదీల్లో రామ్‌సింగ్ నాకు వాట్సాప్ కాల్ చేసి వివేకా హత్యకు శివశంకర్‌రెడ్డి ప్రేరేపించినట్లుగా చెప్పాలని ఆదేశించారు. ► వైఎస్ వివేకా కుమార్తె వైఎస్ సునీత నన్ను సంప్రదించారు. సీబీఐ అధికారులు చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా చేస్తే రూ.10 లక్షలు ఇవ్వడంతోపాటు నా రెండు కాళ్లూ బాగు చేయిస్తామన్నారు. ► సీబీఐ అధికారులు నన్ను కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌కు తరలించి అప్పటికే రాసి ఉన్న వాంగ్మూలంపై సంతకం చేయాలని ఆదేశించారు. అదే వాంగ్మూలాన్ని తరువాత న్యాయస్థానంలో కూడా ఇవ్వాలని ఒత్తిడి చేశారు. కానీ నాకు తెలియని విషయాలను తెలిసినట్లుగా చెప్పలేనని తిరస్కరించా. ► నాకు ప్రాణభయం ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. విచిత్ర ప్రచారం... ► ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురి కావటానికి సంబంధించి నేరాన్ని నాపై వేసుకుంటే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రూ.10 కోట్లు ఇస్తానని చెప్పాడు..’ కల్లూరు గంగాధర్‌రెడ్డి గత అక్టోబర్ 2న వాంగ్మూలం ఇచ్చినట్లు తాజాగా టీడీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చిత్రహింసలు... ► ‘వైఎస్ వివేకా హత్య కేసును నాపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తామని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అన్నట్లుగా చెప్పాలని సీబీఐ నన్ను వేధిస్తోంది. ఆయనతోపాటు ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్రమేయంతోనే హత్య జరిగిందని చెప్పాలని సీబీఐ అధికారులు చిత్ర హింసలు పెట్టారు...’ 2021 నవంబర్ 29న అనంతపురం పోలీసులకు కల్లూరు గంగాధర్‌రెడ్డి ఫిర్యాదు -
సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారు..
కడప అర్బన్: ‘వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధిస్తున్నారు. వారు చెప్పినట్లు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారు. ఆఫీసులో, ఇంటి వద్ద అవమానించారు. కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడమే మాకు శరణ్యం’ అని వైఎస్సార్ జిల్లా పులి వెందుల నివాసి, యురేనియం కార్పొరేషన్ ఉద్యోగి గజ్జల ఉదయ్‌కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మంగళవారం ఆయన కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గౌరవంగా జీవిస్తున్న సామాన్య కుటుంబం మాది. కానీ, సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పేరిట ఏడాదిగా తీవ్రంగా వేధిస్తున్నారు. ఆయన హత్య గురించి అందరికీ తెలిసినట్లుగానే మాకూ తెలిసింది. అయితే ఈ ఏడాదిలో విచారణ పేరిట నన్ను 22 సార్లు పిలిచారు. ఆరేడు సార్లు నోటీసులు ఇచ్చారు. మిగిలిన సందర్భాల్లో వాట్సాప్ కాల్ చేసి పిలిచారు. వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకంతో అన్నిసార్లూ వెళ్లాను. నాకు తెలిసిన విషయాలు చెప్పాను. కానీ సీబీఐ అదనపు ఎస్పీ రాంసింగ్ ఆయన చెప్పినట్లు చెప్పాలంటూ బెదిరిస్తూ భౌతికదాడి చేశారు. హత్య జరిగిన రోజు ఉదయం నేను, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి కలిసి శివశంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అనంతరం శివశంకర్‌రెడ్డితో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళ్లినట్లు, అక్కడ శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి ఏదో మాట్లాడుకున్న ట్లు చెప్పాలంటున్నారు. నేను ఆ రోజు ఉదయం ఎక్కడికీ వెళ్లలేదు. సురేంద్రనాథ్‌రెడ్డిని, శివశంకర్‌రెడ్డిని కలవలేదు. గంగిరెడ్డి ఇంటికి కూడా వెళ్లలేదు. చేయని పని చేసినట్టుగా చెప్పలేను. ఇదే విషయాన్ని రాంసింగ్‌కు ప్రతిసారీ చెబుతున్నాను. కానీ ఆయన చెప్పినట్లు చెప్పకపోతే నన్నూ, నా కుటుంబాన్ని ఈ కేసులో ఇరికిస్తానని బెదిరిస్తున్నారు. శనివారం బ్యాంక్ అకౌంట్స్ పేపర్లు ఇచ్చా ను. సోమవారం కూడా పిలిపించారు. వారు చెప్పినట్టు చెప్పకపోతే మా నాన్నను ఈ కేసులో ఇరికిస్తానని బెదిరించారు. కుటుంబమంతా ఆందోళనలో ఉన్నాం. మీరు వెంటనే విచారించి నిజానిజాలు తెలుసుకొని, రాంసింగ్, సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలి. అని అదనపు ఎస్పీని కోరారు. -
జీఎస్టీ భవన్లో సీబీఐ దాడులు: రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు
హైదరాబాద్: బషీర్ బాగ్‌లోని జీఎస్టీ భవన్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో.. కస్టమ్స్ వింగ్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరు కలిసి పలు కంపెనీల్లో తనిఖీలు చేసినప్పుడు అడ్డగోలుగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు.. కిషన్‌లాల్, సురేష్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చదవండి: Shocking Video: స్విమ్మర్‌పై మొసలి భయంకర దాడి.. -
సీబీఐ కేసుల్లో సాయం చేస్తామంటూ లంచాల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: తాము సీబీఐ ఉన్నతాధికారులమని పరిచయం చేసుకుని సీబీఐ కేసుల్లో సాయం చేస్తామంటూ లంచాలు డిమాండ్ చేసిన వ్యవహారంలో హైదరాబాద్ వాసి సహా ఇద్దరిని అరెస్టు చేసింది. దీనిపై జనవరి 16న సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ సహా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి నిందితులు హైదరాబాద్ నివాసి వై.మణివర్దన్ రెడ్డి, తమిళనాడులోని మధురై నివాసి సెల్వం రామరాజ్ సహా పలువురు ఇతరులు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకును మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని వారు సంప్రదించి ఢిల్లీలోని సీబీఐ ఉన్నతాధికారులుగా చెప్పుకొంటూ భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఈ ఇద్దరు నిందితులు మోసపూరితమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి సీబీఐ ప్రధాన కార్యాలయంలోని ల్యాండ్ లైన్ టెలిఫోన్ నంబర్ 011–24302700 ద్వారా ఫోన్ చేసినట్టు ఆరోపణలు తెలుస్తోంది. తమను సీబీఐ అధికారులుగా చెప్పుకొంటూ పలుమార్లు బ్యాంకు మోసం కేసులోని నిందితుడి మొబైల్‌కు ఫోన్ చేశారు. జనవరి 4న వై.మణివర్దన్‌రెడ్డి ఏకంగా గుంటూరు వెళ్లి అతణ్ని వ్యక్తిగతంగా కలిసి రెండు రోజుల్లో అడిగిన మేరకు లంచం ఇవ్వనిపక్షంలో పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. ఫిర్యాదు అందుకున్న సీబీఐ అధికారులు చెన్నైలో రెండు చోట్ల, హైదరాబాద్, మధురై, శివకాశిల్లో ఒక చోట తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అనేక మొబైల్ ఫోన్లు, నేరానికి చెందిన వాట్సాప్ సంభాషణలు, డాక్యుమెంట్లు లభించాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని, దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ శనివారం వెల్లడించింది. -
హైదరాబాద్ నుంచి లాకర్ తాళాలు తెప్పించి...
సాక్షి, గుంటూరు/ హైదరాబాద్: జాతీయ బ్యాంకులకు రూ.వందల కోట్లలో రుణాల ఎగవేతకు సంబంధించి టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులపై సీబీఐ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాయపాటికి చెందిన పలు ప్రాంతాల్లోని నివాసాలు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరు తదితర చోట్ల ఈ సోదాలు జరిగాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు...హైదరాబాద్ కావూరి హిల్స్‌లోని ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శ్రీధర్‌తోపాటు డైరెక్టర్, ప్రమోటర్ చైర్మన్‌గా ఉన్న రాయపాటి సాంబశివరావు, ఇండిపెండెంట్ నాన్–ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాస బాబ్జి, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్లో జాబితాలో చేర్చింది. జాతీయ బ్యాంకులకు రుణాల ఎగవేతకు సంబంధించి 120 బి, రెడ్‌విత్ 420, చీటింగ్, 406, 468, 477ఏ తదితర సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. తమ వద్ద తీసుకున్న రుణాన్ని ఇతర ఖాతాలకు మళ్లించారంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ప్రాంతీయ విభాగాధిపతి ఎస్.కె భార్గవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా మళ్లింపు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ తనకిచ్చిన క్రెడిట్ లిమిట్స్‌ను వాడుకుని మోసానికి పాల్పడినట్లు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తొలుత తనకిచ్చిన క్రెడిట్ లిమిట్‌ని రూ.50 కోట్ల నుంచి రూ.81 కోట్లకు పెంచుకుంది. లెటర్ ఆఫ్ గ్యారంటీ పరిమితిని రూ.100 కోట్ల నుంచి రూ.234 కోట్లకు, లెటర్ గ్యారెంటీ లిమిట్‌ను రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెంచుకుంది. ఆంధ్రాబ్యాంకు, యూకో, యూనియన్ బ్యాంక్ తదితర 14 బ్యాంకులతో కూడిన కన్సార్టియానికి కెనరా బ్యాంక్ లీడ్ బ్యాంకుగా వ్యవహరించింది. వివిధ క్రెడిట్ లిమిట్స్ నుంచి రూ.264 కోట్లకుపైగా ట్రాన్స్ట్రాయ్ వేరే ఖాతాలకు మళ్లించిందని, బ్యాంకులకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. హైదరాబాద్ నుంచి లాకర్ తాళాలు తెప్పించి... గుంటూరు లక్ష్మీపురం నాలుగో లైన్‌లోని రాయపాటి నివాసానికి మంగళవారం తెల్లవారుజామున ఐదు గంటలకు చేరుకున్న పది మంది సీబీఐ అధికారుల బృందం ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంది. రాయపాటి నివాసంలో రెండు లాకర్లు ఉండగా తొలుత మొదటి లాకర్ తనిఖీ చేశారు. రెండో లాకర్ తాళాలు హైదరాబాద్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొనడంతో తెప్పించాలని అధికారులు సూచించారు. అనంతరం రెండో లాకర్ కూడా తెరిచి అందులోని డాక్యుమెంట్లను పరిశీలించారు. రాయపాటి కుమారుడు రంగబాబుతోపాటు కుటుంబ సభ్యులను కూడా సీబీఐ అధికారులు విచారించారు. తమ ఇంట్లో డబ్బులు, వజ్రాలతోపాటు ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి, బ్యాంకులకు మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారని అయితే ట్రాన్స్ట్రాయ్ కంపెనీతో ప్రస్తుతం తమకు ఎలాంటి సంబంధం లేదని రంగబాబు పేర్కొన్నారు. తన తల్లి జీవించి ఉన్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌ట్రాయ్‌లో భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. -
జైలులో చిదంబరం కోరికల చిట్టా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 15 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని గురువారం కోర్టు ముందు హాజరుపర్చగా, ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ప్రత్యేక జడ్జి ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చిదంబరం విశ్వప్రయత్నాలు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమని న్యాయవాది కపిల్ సిబల్ ద్వారా తెలియజేశారు. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీని కోరారు. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోందనీ, ఒకవేళ చిదంబరానికి బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే సీబీఐ చిదంబరంపై నిరాధార ఆరోపణలు చేస్తోందనీ, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కపిల్ సిబల్ కోర్టుకు చెప్పారు. ఈడీకి లొంగిపోయేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారన్నారు. దీతో ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్, చిదంబరాన్ని ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు నీలిరంగు బస్సులో చిదంబరాన్ని కోర్టు నుంచి 18 కి.మీ దూరంలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చిదంబరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. 74వ పుట్టినరోజును జరుపుకోవడానికి సరిగ్గా 11 రోజుల ముందు చిదంబరం తీహార్ జైలుకు చేరుకోవడం గమనార్హం. సుప్రీంలో ఎదురుదెబ్బ అంతకుముందు ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం తిరస్కరించింది. ‘ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం సరికాదు. ఎందుకంటే ఆర్థిక నేరాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు అవకాశమున్నప్పటికీ ఈడీ చొరవ తీసుకోలేదు. మరోవైపు ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో చిదంబరానికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాక బోర్డు(ఎఫ్ఐపీబీ) ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం అనుమతులు జారీచేసింది. ఈ సందర్భంగా ముడుపులు చేతులు మారినట్లు, మనీలాండరింగ్ జరిగినట్లు సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేశాయి. ఈ కేసులో గతనెలలో చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. కార్తీ గడిపిన జైలు గదిలోనే.. సీబీఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిదంబ రానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తీహార్‌లోని జైల్ నంబర్ 7కు తరలించారు. ఈ విషయమై తీహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించామనీ, అందులో వెస్ట్రన్ టాయిలెట్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, టీవీ చూడవచ్చని వెల్లడించారు. రాత్రి భోజనంలో భాగంగా చిదంబరానికి అన్నం, పప్పు, తాలింపును అందజేస్తామన్నారు. ఉదయం 7–8 గంటల మధ్య అల్పాహారం అందజేస్తామని పేర్కొన్నారు. జైలులో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ నుంచి చిదంబరం నీరు తాగవచ్చనీ, లేదంటే క్యాంటీన్ నుంచి కొనుక్కోవచ్చని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదుచేసిన కేసులో కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన జైలు గదిలోనే ప్రస్తుతం చిదంబరాన్ని ఉంచడం గమనార్హం. చిద్దూ కోరికల చిట్టా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించడంతో చిదంబరం వెంటనే రెండు ప్రత్యేక పిటిషన్లను న్యాయస్థానంలో దాఖలుచేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున మందులతో పాటు కళ్లద్దాలను తీహార్ జైలులోకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరారు. అలాగే తాను జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిని అయినందున ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాలనీ, అందులో పాశ్చాత్య దేశాల్లో వాడే టాయిలెట్‌ను ఏర్పాటుచేసేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జైలులో తనకు తగిన భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు. చిదంబరం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అజయ్ కుమార్, ప్రత్యేక గది, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాట్లు చేయాలని తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించారు. -
సమాధుల పునాదుల పైన..
న్యూఢిల్లీ: చిదంబరంను ఉంచిన సీబీఐ ప్రధాన కార్యాలయ భవనం గురించి ఆసక్తికర కథలను సీబీఐ అధికారులు చెప్పుకుంటున్నారు. ఆ భవనం కట్టిన ప్రాంతం ఒకప్పుడు శ్మశానమని, సమాధులపై నిర్మించిన భవనం కాబట్టి వాస్తు సరిగా లేదంటున్నారు. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే ఆ భవనంలో విధులు నిర్వర్తించిన సీబీఐ డైరెక్టర్లందరూ వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కుంటున్నారని చెబుతున్నారు. డైరెక్టర్లుగా పనిచేసిన ఏపీ సింగ్, రంజిత్ సిన్హాలపై సీబీఐ కేసు పెట్టింది. విజయ్‌మాల్యా పారిపోయేందుకు వీలు కల్పించాడని అనిల్ సిన్హాపై ఆరోపణలున్నాయి. అలోక్‌వర్మ తన సహచరుడితో వివాదంతో సీబీఐని భ్రష్టు పట్టించారని విమర్శలున్న విషయం తెలిసిందే. ప్రారంభోత్సవానికి చిదంబరం ఇదే భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథుల్లో ఒకరుగా చిదంబరం వచ్చారు. 2011, ఏప్రిల్ 30న నాటి ప్రధాని మన్మోహన్æ ఈ భవనాన్ని ప్రారంభించారు. కేంద్రమంత్రి హోదాలో చిదంబరం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి సీబీఐ డైరెక్టర్ ఆ భవనాన్ని మొత్తం వారికి తిప్పిచూపించారు. ఇప్పుడు చిదంబరం బందీగా ఉన్న గెస్ట్‌హౌజ్‌లోని సూట్ నెం 5ను అప్పుడు ఆయన చూసే ఉంటారు. నేడు సుప్రీంలో విచారణ తనకు ముందస్తు బెయిల్‌ను నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరుతూ చిదంబరం దాఖలు చేసుకున్న పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారణ జరపుతుందని గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. -
ఆ నిధులు సీఎంల రాయబేరాల కోసమే..
సాక్షి, అమరావతి: ఎయిర్ ఏషియా కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపై రోజుకో అంశం వెలుగు చూస్తోంది. ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలతో రాయబేరాల కోసం ఎయిర్ ఏషియా భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు డెలాయిట్ ఇండియా ఫోరెన్సిక్ ఆడిట్ స్పష్టం చేసింది. టాటా గ్రూపు నుంచి ఎయిర్ ఏషియాకు జరిగిన రూ.22 కోట్ల అనుమానపు చెల్లింపులపై అప్పటి గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. దీనిపై కూలంకషంగా అధ్యయనం చేసిన ఆడిట్ సంస్థ.. అప్పటి ఎయిర్ ఏషియా ఇండియా సీఈఓ మిట్టు శాండిల్య ఈ మొత్తాన్ని సీఎంలు, రాజకీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడానికి వినియోగించినట్లు స్పష్టంచేసింది. విమానాలకు వినియోగించే ఇంధనం (ఏటీఎఫ్)పై ఉన్న పన్నుల భారాన్ని, ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు దళారి రాజేంద్ర దుబే సహకారంతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాండిల్య సమావేశాలు నిర్వహించినట్లు కూడా స్పష్టంచేసింది. 2016లో విడుదలైన ఈ నివేదికను అప్పుడు అన్ని జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. వెలుగులోకి తెచ్చిన మిస్త్రీ మలేసియాకు చెందిన ఎయిర్ ఏషియా.. భారత్‌లో టాటా గ్రూప్‌తో కలిసి ఎయిర్ ఏషియా ఇండియా పేరుతో విమాన రంగంలోకి అడుగు పెట్టింది. టాటా గ్రూపు నుంచి ఎయిర్ ఏషియాకు చేసిన చెల్లింపులపై అనుమానం వ్యక్తంచేసిన అప్పటి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. కానీ, నివేదిక వచ్చిన 15 రోజుల తర్వాత మిస్త్రీని పదవి నుంచి తొలగిస్తూ టాటా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ మరునాడే అంటే 2016 అక్టోబరు 25న టాటా గ్రూపు నుంచి రూ.22 కోట్ల అనుమానపు లావాదేవీలు ఎయిర్ ఏషియాకు చెందిన కంపెనీలతో జరిగినట్లు నివేదికలు స్పష్టం చేశాయంటూ టాటా బోర్డుకు మిస్త్రీ ఈ–మెయిల్ పంపడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైజనింగ్ కోసం ఏర్పాటుచేసుకున్న సింగపూర్ కంపెనీ హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్‌కు, ఈ గ్రూపునకు మధ్య కేవలం ఖాళీ కాగితాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా, వివిధ ఇన్వాయిస్ ఫార్మాట్లో చెల్లింపులు జరిగిన విషయాన్ని డెలాయిట్ నివేదిక బహిర్గతం చేసింది. హెచ్ఎన్ఆర్ ట్రేడింగ్ డైరెక్టర్‌గా ఉన్న దుబే రూ.12.28 కోట్లు తీసుకున్నారు కానీ, ఈ మొత్తాన్ని ఏ సేవలకు వినియోగించారన్నది ఎక్కడా సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. అలాగే, మరో డొల్ల కంపెనీ అయిన మీడియా ఇమిగ్రేషన్ సర్వీసెస్‌కు, శాండిల్య తండ్రికి మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కూడా ఆ ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. బాబు రాగానే భారీగా వ్యాట్ తగ్గింపు 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల్లోపే ఏటీఎఫ్‌పై వ్యాట్‌ను 16 శాతం నుంచి ఏకంగా ఒక శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం డెలాయిట్ నివేదికకు మరింత బలం చేకూరుస్తోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిర్ ఏషియా ఇండియాలో 49 శాతం వాటా ఉన్న టాటా గ్రూపు.. రాయబేరాల కోసం రూ.22 కోట్లు వ్యయం చేయగా, దాదాపు ఇంతే మొత్తం ఎయిర్ ఏషియా గ్రూపు కూడా వ్యయం చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఏషియా నేరపూరిత కుట్ర ఎయిర్ ఏషియా వ్యవహారాలతో సంబంధం ఉన్న ట్రావెల్ ఫుడ్ సర్వీసెస్ యజమాని సునీల్ కపూర్‌ను సీబీఐ అధికారులు మంగళవారం విచారించారు. క్విడ్ ప్రోకో కింద కపూర్‌ను ఎయిర్ ఏషియా డెప్యూటీ సీఈఓ బో లింగం.. కపూర్‌ను దళారీగా నియమించుకుని తమ విమానాల్లో కేటరింగ్ కాంట్రాక్టును అప్పజెప్పిందన్న అనుమానంతో సీబీఐ ఆయనను విచారణకు పిలిచింది. పౌర విమానాయాన శాఖ అధికారులు, ఎయిర్ ఏషియా ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశాలు నిర్వహించడంపై సీబీఐ అధికారులు ఈ సందర్భంగా ఆరా తీశారు. ఇదిలా ఉంటే.. 5/20 నిబంధనను సడలించేందుకు లేదా తొలగించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖలో ప్రయత్నం జరిగినట్లు దర్యాప్తు సంస్థ అధికారి ఆర్కే గౌర్ వెల్లడించారు. అంతేకాక, దళారుల ద్వారా ప్రభుత్వంలోని పలువురు అధికారులతో కలిసి ఎయిర్ ఏషియా ప్రమోటర్లు, డైరెక్టర్లు నేరపూరిత కుట్ర పన్నినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, బుధవారం విచారణకు హాజరుకావాలంటూ ఫెర్నాండెజ్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది. -
'నాకు జొమాటో, స్విగ్గీ ఫుడ్ కావాలి'
న్యూఢిల్లీ : తనకు జొమాటో, స్విగ్గీ కంపెనీలనుంచి ఆహారం తెప్పించాలని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కార్తి చిదంబరం...సీబీఐ అధికారులను కోరారు. ఇంటినుంచి వచ్చే ఆహారం తినేందుకు ప్రత్యేక కోర్టు గురువారం నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రెండు కంపెనీల్లో ఏదో ఒకదానినుంచి ఆహారం తెప్పించాలని సంబంధిత అధికారులకు విన్నవించారు. కార్తి అరెస్టు సబబే : స్వామి ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరంను సీబీఐ కస్టడీకి పంపడం సమంజసమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. న్యాయస్థానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. కార్తి తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన వాదనలు నిజాలు కావని, అందువల్లనే కార్తీని సీబీఐ కస్టడీకి కోర్టు ఆదేశించిందని ఈ సందర్భంగా చెప్పారు. లావాదేవీలన్నీ అక్రమేనంటూ కార్తి వద్ద పనిచేస్తున్న చార్టర్డ్ ఎకౌంటెంట్ ఇప్పటికే నిర్ధారించారని, అందువల్ల కార్తితోపాటు ఆయన సీఏ భాస్కర్రామను విచారించేందుకు మార్గం సుగమవుతుందన్నారు. కార్తిని విచారించడంవల్ల ఈ కేసులో చిదంబరం ప్రమేయం నిర్ధారణ అవుతుందని, ఇందువల్ల ఈ కేసును ప్రాసిక్యూషన్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమవుతుందని ఆయన వివరించారు. -
టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అరెస్ట్
నెల్లూరు, సాక్షి ప్రతినిధి/బెంగళూరు: అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని ఆదివారం సాయంత్రం బెంగళూరులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బ్యాంకులను మోసం చేసి భారీగా రుణాలు పొందిన వ్యవహారంలో కొన్నేళ్లుగా వాకాటి ఆరోపణలు ఎదుర్కొ న్నారు. ఆరోపణలు నిజమేనని నిర్ధారణ కావడంతో ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారించి, సాయంత్రం అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన వాకాటి వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్, లాజిస్టిక్స్ తదితర కంపెనీలను నిర్వహిస్తున్నారు. ఆయనకు హైదరాబాద్ షామీర్‌పేటలో రూ.12 కోట్లు విలువచేసే భవనం ఉంది. దీనిని నకిలీ డాక్యుమెంట్ల ద్వారా విలువను భారీగా పెంచేసి, రూ.250 కోట్ల రుణం కోరుతూ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. ఫైనాన్స్ కార్పొరేషన్ 2014లో రూ.190 కోట్ల రుణం మంజూరు చేసింది. అసలు, వడ్డీ చెల్లించడంలో వాకాటి నారాయణరెడ్డి విఫలం కావడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ బకాయి రూ.205.02 కోట్లకు చేరింది. దీంతో ఫైనాన్స్ కార్పొరేషన్ వాకాటి ఆస్తుల జప్తుపై దృష్టి సారించింది. రుణం కోసం ఆయన సమర్పించిన డాక్యుమెంట్లు నకిలీవని విచారణలో తేలింది. దీంతో గతేడాది మే 5న ఫైనాన్స్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. మే 12న నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరులోని ఆయన కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు నిర్వహించింది. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి విచారణ ప్రక్రియ కొనసాగించి ఆదివారం అరెస్ట్ చేసింది. ఐపీ పెట్టిన రెండు కంపెనీలు: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వీఎన్ఆర్ ఇన్ఫ్రా, వీఎన్ఆర్ రైల్ కంపెనీలు గతేడాది ఐపీ పిటిషన్ దాఖలు చేశాయి. బ్యాంకుల్లో రుణాలు వడ్డీలతో కలిపి రూ.వందల కోట్లు దాటడంతో రెండు కంపెనీలు ఐపీ(దివాలా) దాఖలు చేశాయి. మరోవైపు నెల్లూరు, బెంగళూరు, హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి వాకాటి రూ.443 కోట్ల రుణాలు పొందారు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు ఆస్తుల అటాచ్మెంట్, జప్తు ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి అరెస్ట్‌తో నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. -
ఐఎఫ్ఎస్ అధికారి ఇంట్లో సీబీఐ తనిఖీలు
తణుకు: ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్(వెస్ట్ మీరట్)గా పని చేస్తున్న ముత్యాల రాంప్రసాదరావు నివాసంలో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలోని ఆయన ఇంటిపైనా, సమీప బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. గతంలో ఎన్టీపీసీలో చీఫ్ విజిలెన్స్ అధికారిగా పని చేసిన కాలంలో పెద్దఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈయన సంపాదించిన అక్రమ ఆస్తులతో ఆయన భార్య కనకదుర్గ తణుకులో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తణుకులో రాంప్రసాదరావుకు చెందిన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కనకదుర్గకు సహాయకుడిగా ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు అతని ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టినట్టు విశ్వసనీయ సమాచారం. -
పోస్టల్ శాఖకే కుచ్చుటోపీ...!
- ముత్యాల కంపెనీతో ఉద్యోగుల ములాఖత్ - రూ.7.6 కోట్లు నష్టం చేకూర్చడంపై సీబీఐ కేసు సాక్షి, హైదరాబాద్: పోస్టల్ విభాగంలో పని చేస్తూ అదే శాఖకు కోట్లు నష్టం చేకూర్చిన అధికారులు, మరో ప్రైవేట్ కంపెనీ బాగోతం బయటపడింది. హుమాయూన్‌నగర్ పోస్టల్ ఉద్యోగులు సంస్థకు రూ.7.6 కోట్లు నష్టం తెచ్చిపెట్టారని, ప్రీషా పెరల్స్ కంపెనీతో ములాఖత్ అయి అక్రమాలకు పాల్పడ్డారని హైదరాబాద్ సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ హెచ్ఆర్ చంద్రశేఖర్ అచార్ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ పూర్తిచేసిన హైదరాబాద్ రేంజ్ సీబీఐ అధికారులు ముగ్గురు పోస్టల్ ఉద్యోగులు, ప్రీషా పెరల్స్ కంపెనీ, ఇద్దరు ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. ఇదీ తతంగం.. ఆబిడ్స్‌కు చెందిన ప్రీషా పెరల్స్ వ్యాపారం నిమిత్తం పలు రాష్ట్రాలకు ముత్యాలను పోస్టల్ శాఖ ద్వారా పంపిస్తుంది. ఈ పార్సిళ్లను హుమాయూన్‌నగర్ పోస్ట్ఆఫీస్ నుంచి వినియోగదారులకు పంపడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తెప్పించుకోవడం చేస్తోంది. అయితే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నీలేశ్ కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శైలేష్ అగర్వాల్ హుమాయూన్ నగర్ సబ్ పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న సబ్‌పోస్ట్‌మాస్టర్ ఎన్.కామేశ్వర్రావు, డిప్యూటీ సబ్ పోస్ట్ మాస్టర్ పద్మావతి, ఎస్.వెంకట స్వామితో కలసి పోస్టల్ శాఖకు నష్టం చేకూర్చేలా కుట్ర పన్నారు. ఇందులో భాగంగా సంబంధిత పెరల్స్ కంపెనీ పంపించే పార్సిళ్ల బరువును తక్కువ వెయిట్ చేయడం, అన్ని పార్సిళ్లకు ఒకే క్రమ సంఖ్యతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించినట్టు సీబీఐ గుర్తించింది. ఒక పార్సిల్‌కు సంబంధించిన వివరాలున్న ఒరిజినల్ కాపీతో పలు కలర్ జిరాక్స్ కాపీలు తీసి అన్నింటికీ ఒకే చార్జి కింద జమ చేసి అక్రమాలకు పాల్పడ్డట్టు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా 2015 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 32.91 వేల పార్సిళ్లు పంపిస్తే, వాటిని లెక్కలో చూపించకుండా 14.66 వేల పార్సిళ్లు మాత్రమే చూపించి, వాటికి డబ్బులు వసూలు చేశారని, మిగతా 18.25 వేల పార్సిళ్లను లెక్కలోకి తీసుకోకుండా నష్టం చేకూర్చినట్టు ఆధారాలు సేకరించింది. ఇలా పెరల్స్ కంపెనీతో కలసి పోస్టల్ ఉద్యోగులు రూ.7.66 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టారని సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టంచేసింది. ఈ మేరకు పీసీయాక్ట్ 1988 కింద రెడ్‌విత్ 13(2), 13(1)(డి), ఐపీసీ రెడ్‌విత్ 120–బి, 468, 471, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సీబీఐ హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టంచేశారు. -
బుచ్చి ఎస్బీఐలో గోల్డ్ లోన్ల గోల్మాల్
- పెద్దనోట్ల రద్దు సమయంలో రూ.12.40 లక్షల అవినీతి - ఇద్దరు అధికారుల మీద సీబీఐ కేసు నమోదు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నోట్ల రద్దు సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుచ్చిరెడ్డిపాళెం శాఖలో బంగారు రుణాల మంజూరు మాటున రూ.12.40 లక్షలు అవినీతి జరిగింది. ఈ విషయంపై అందిన ఫిర్యాదుతో బ్యాంకు సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ ఎం.సుల్తాన్ మొహిద్దీన్, డిప్యూటీ మేనేజర్ (ఆపరేషన్) ఐ.జె.రాజశేఖర్మీద కేసు నమోదు చేసినట్లు సీబీఐ ఎస్పీ ఆర్.గోపాలకృష్ణారావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఖాతాదారులకు, రుణగ్రహీతలకు కూడా నగదు చెల్లింపు విషయంలో రిజర్వ్ బ్యాంకు అనేక షరతులు విధించింది. దేశ వ్యాప్తంగా అనేక బ్యాంకుల్లో ఖాతాదారులు రూ.10 వేల నగదు కూడా ఉపసంహరించుకోలేక అవస్థలు పడ్డారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్బీఐలో పనిచేస్తున్న సుల్తాన్ మొహిద్దీన్, రాజశేఖర్ ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుని అవినీతికి పాల్పడ్డారు. గత ఏడాది నవంబరు 15, 25 తేదీల్లో సుల్తాన్‌కు బినామీ పేర్ల మీద డిప్యూటీ మేనేజర్ రాజశేఖర్ నాలుగు బంగారు రుణాల కింద రూ.9.70 లక్షలు మంజూరు చేశారు. మరో మూడు బంగారు రుణాలు మంజూరు చేసి ఇందుకు సంబంధించి రూ.2.70 లక్షలు కొత్త రూ.500, రూ.2000 నోట్లు అందజేశారు. ఇదే సమయంలో గత ఏడాది నవంబరు 21, నవంబరు 25వ తేదీల్లో రూ.500 పాత నోట్లు జమ చేసి సుల్తాన్‌కు మంజూరు చేసిన రెండు బినామీ రుణాలు క్లోజ్ చేశారు. ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో విశాఖపట్నం సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేశారు. బ్యాంకు ఉన్నతాధికారులు సుల్తాన్ మొహిద్దీన్ను సస్పెండ్ చేశారు. సీబీఐ అధికారులు శని, ఆదివారాల్లో ఇందుకు సంబం«ధించి బ్యాంకు రికార్డులు తనిఖీ చేశారు. ఈ సంఘటన బుచ్చిరెడ్డిపాళెంలో సంచలనం కలిగించింది. లోతుగా జరిపిన విచారణలో రూ.12.40 లక్షలు గోల్ మాల్ జరిగిందని తేల్చారు. దీంతో సుల్తాన్, రాజశేఖర్ మీద ఐపీసీ సెక్షన్ 120 ృబి రెడ్‌విత్ 420, 409, 1988 పీసీ చట్టం లోని సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)(డి) సెక్షన్ల కింద సోమవారం కేసు నమోదు చేశారు. కేసు విచారణ దశలో ఉందని ఎస్పీ గోపాలకృష్ణారావు తెలిపారు. అధికారులు ఇద్దరూ తమ చేతిలో అధికారాన్ని ఉపయోగించి అవినీతి పాల్పడ్డారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థలు, బీమా సంస్థల్లో అవినీతిపై ప్రజలు ఎస్పీ కార్యాలయం, సీబీఐ, విశాఖపట్నం చిరునామాకు నేరుగా గానీ, పోస్టు ద్వారా లేదా 1800 425 00100 టోల్‌ఫ్రీ నంబరుకు గానీ ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. -
బాపట్లలో సీబీఐ ప్రకంపనలు
8 ఏళ్ల క్రితం ఘటనపై విచారణ బాపట్ల: 8 ఏళ్ల క్రితం కొందరు నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి బాపట్ల ఐడీబీఐ బ్యాంకు నుంచి లోన్ల రూపేణా రూ.122 కోట్లు స్వాహా చేశారు. దీనిపై అంతర్గత విచార ణ జరిపిన బ్యాంకు అధికారులు ఎట్టకేలకు 181 మంది రూ.122 కోట్ల మేర బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టారని నిర్ధారించుకుని సీబీఐని ఆశ్రయించారు. కేసుకు సంబంధించి మరిన్ని అధారాలు సేకరించేందుకు సీబీఐ అధికారులు శుక్రవారం బాపట్లలో రహస్యంగా విచార ణ జరిపినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 28న 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. బాపట్ల కేంద్రంగా నడుస్తున్న కామాక్షి డెయిరీ ఫామ్ అధినేత గండూరి మల్లి కార్జునరావుతో పాటు మరికొంతమంది ముఠాగా ఏర్పడి, రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల సహకా రంతో ప్రభుత్వ భూములకు నకిలీ పత్రాలు సృష్టించారు. గుంటూరులోని చంద్రమౌళి నగర్ ఐడీబీఐ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్‌ను కలుపుకుని ఫైల్స్ కదిలించారు. 2010– 2012లో విడతల వారీగా బ్యాంకు నుంచి లోన్ల రూపేణా సొమ్ము దోచుకున్నారు. ఈ కేసులో చంద్రశేఖర్‌ను ఏ–1గా, మల్లికార్జునరావును ఏ–2గా చేర్చారు. మరో 38మందిపై కేసు నమోదైంది. సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించి వారి వద్ద నుంచి విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
మా చావుకు సీబీఐ వేధింపులే కారణం
సూసైడ్ నోట్లో బన్సల్ న్యూఢిల్లీ: సీబీఐ వేధింపుల వల్లే తన భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని.. తమనూ అలాగే వేధిస్తుండడంతో తను, తన కుమారుడు మృత్యువును ఆశ్రయిస్తున్నామని కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బీకే బన్సల్ సూసైడ్ నోట్లో ఆరోపించారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సెప్టెంబర్ 26(సోమవారం)న ఈమేరకు ఆయన లేఖ రాశారు. ఏడు పేజీల బన్సల్ లేఖను, కుమారుడు యోగేశ్ రాసిన రెండు పేజీల లేఖను బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని తమ ఫ్లాట్‌లో మంగళవారం బన్సల్, యోగేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఓ ఫార్మా కంపెనీ నుంచి లంచం తీసుకుంటుండగా జూన్‌లో బన్సల్‌ను పోలీసులు అరెస్టు చేయడం, తర్వాత ఆయన బెయిల్‌పై బయటికి రావడం తెలిసిందే. గతంలోనూ విపరీతంగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐలోని డీఐజీ, ఇద్దరు మహిళా అధికారులు, లావుగా వుండే హవల్దార్... తన అరెస్టు తరువాత భార్య, కూతురిపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డారని బన్సల్ లేఖలో ఆరోపించారు. ఈ విషయాన్ని వారు బంధువులకు, ఇంటి పక్క వారికి చెప్పుకొని ఎంతో ఆవేదన చెందారని వివరించారు. సీబీఐ అధికారులు వేధింపులు మరింత ఎక్కువ కావడంతో అవమానం భరించలేక వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆ బాధలో ఉన్న తనను, తన కుమారుడిని సైతం సీబీఐ అధికారులు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, లైవ్ డిటెక్టర్లు సైతం ఉపయోగించి తమను విచారించారని, అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పారు. కాగా తమ అధికారులపై ఆరోపణలు రావడంతో అంతర్గత విచారణకు ఆదేశించినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌర్ బుధవారం వెల్లడించారు. బన్సల్, యోగేశ్‌ల లేఖలను పోలీసులు తమకు అందజేశారని.. ఈ వివరాలన్నింటిని కోర్టుకు వివరించినట్లు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా,బన్సల్, యోగేశ్‌ల అంత్యక్రియలు బుధవారం హరియాణాలోని స్వస్థలమైన హిస్సార్‌లో పూర్తయ్యాయి. -
సీబీఐ అధికారులపై 56 కేసులు: సీవీసీ
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులపై 56 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ తెలిపింది. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వార్షిక నివేదికలో ఈ వివరాలు వె ల్లడించింది. డిసెంబర్ 31, 2015 నాటికి మొత్తం 56 కేసులకు గాను గ్రూప్ ఏ అధికారులపై 31 కేసులు, గ్రూప్ బి, సి అధికారులపై 25 కేసుల పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. 19 కేసులు నాలుగేళ్లుగా, 3 కేసులు మూడేళ్లుగా, ఐదు కేసులు రెండేళ్లుగా, ఏడు కేసులు ఏడాదికి పైగా పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ తెలిపింది. 2015లో సీబీఐ 1,135 కేసులు నమోదు చేసిందని, వీటిలో 185 లంచం కేసులు, 67 అక్రమాస్తుల కేసులు ఉన్నాయని నివేదికలో వెల్లడించింది. -
కొనసాగుతున్న ‘లిక్విడేటర్’ అరెస్టులు
సీబీఐ అదుపులో ఇద్దరు గుజరాతీయులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టుకు చెందిన లిక్విడేటర్ సొమ్మును కొల్లగొట్టిన వారికి ఉచ్చు బిగుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ శుక్రవారం మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. బ్యాంకుల నుంచి డబ్బును కొల్లగొట్టడంలో కీలక ప్రమేయముండటంతో గుజరాత్‌కు చెందిన గన్‌శ్యాం సి.జోషి, హార్దిక్ ప్రవీణ్ భాయ్ జోషిలను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచింది. న్యాయస్థానం అనుమతితో వీరిద్దరిని 14 రోజుల కస్టడీకి సీబీఐ తీసుకుంది. హైకోర్టు లిక్విడేటర్‌కు చెందిన రూ.30 కోట్లను బ్యాంకుల నుంచి మాయం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడైన దామోదర్మణి పక్కా ప్రణాళికతోనే బ్యాంకుల నుంచి డబ్బులు కొల్లగొట్టినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఖమ్మంలోని యునెటైడ్ బ్యాంకు మేనేజర్ కె.శ్రీకాంత్ కూడా నిందితులతో కుమ్మక్కైనట్లు తేలింది. తెలంగాణ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో మెరుగు శ్రీనివాసరావు ఒక అకౌంట్ ప్రారంభించి, దానిద్వారా నిధులు దోచుకున్నారు. శ్రీనివాస్ ప్రారంభించిన ఖాతా నుంచి వివిధ బ్యాంకులకు విడుతల వారీగా రూ.8.89 కోట్లు మళ్లించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి మిగిలిన నిందితులందరినీ అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు సిద్ధమవుతున్నారు. -
చోటా రాజన్ భయపడుతున్నాడు
-
రాజన్‌ను తీసుకురావటంలో సమస్య లేదు: కేంద్రం
ఇండోనేసియాతో చర్చిస్తున్నాం ♦ రెండ్రోజుల్లో బాలీకి సీబీఐ అధికారులు ♦ రెండు, మూడు ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు న్యూఢిల్లీ/జకార్తా: ఇండోనేసియాలో అరెస్ట్ అయిన అండర్‌వరల్డ్ డాన్ ఛోటా రాజన్(55)ను భారత్‌కు తీసుకురావటంలో చట్టపరమైన సమస్యలేమీ ఉండబోవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ దిశగా ఇండోనేసియా అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రెండుదేశాల్లో చట్టాలు వేర్వేరుగా ఉన్నందున.. సీబీఐ అధికారులు వీటిని పరిశీలిస్తున్నారని తెలిపారు. కాగా, ఛోటా రాజన్ అప్పగింతపై ఇబ్బందులు ఉండకపోవచ్చని ఇండోనేసియాలోని భారత రాయబారి గుర్జిత్ సింగ్ చెప్పారు. భారత అధికారులు జారీచేసిన నోటీసుపైనే చోటా రాజన్‌ను అరెస్ట్చేసినందున అతడి అప్పగింత విషయంలో ఇబ్బందులు తలెత్తవన్నారు. ‘‘ఇండోనేసియాతో నేరస్తుల అప్పగింత ఒప్పందంతోపాటు పరస్పర న్యాయ సహకార ఒడంబడిక ఉంది. ఈ కేసుతోపాటు ఇతర కేసుల్లోనూ ఇవి వర్తిస్తాయని భావిస్తున్నాం. రాజన్ అప్పగింత విషయంలో ఏ ఇతర లీగల్ డాక్యుమెంట్ అవసరమవుతుందని నేను అనుకోను’ అని గుర్జిత్ సింగ్ అన్నారు. అయితే.. దావూద్ ఇబ్రహీం నుంచి రాజన్‌కు ప్రాణహాని ఉన్నందున.. అతణ్ణి క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు రెండు మూడు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజన్‌పై ఎక్కువ కేసులు మహారాష్ట్రలో ఉన్నందున తమ పోలీసులకు అప్పగించేలా సీబీఐని కోరతామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తెలిపారు. రాజన్‌ను భారత్‌కు తీసుకు వచ్చేందుకు రెండ్రోజుల్లో సీబీఐ అధికారులు బాలీ వెళ్లే అవకాశం ఉంది. -
యార్డులో సీబీఐ విచారణ
పత్తి కొనుగోలుకు సంబంధించి రెండు రకాల రికార్డులు స్వాధీనం సాక్షి ప్రతినిధి, గుంటూరు : గుంటూరు మార్కెట్ యార్డు నుంచి సీబీఐ అధికారులు గురువారం రెండు రకాల రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తక్పట్టి, కాటా చిట్టాలను మాత్రమే స్వాధీనం చేసుకోగా, మరో మూడు ముఖ్య రికార్డులను పరిశీలన చేయలేదని తెలుస్తోంది. రైతు నుంచి నేరుగా యార్డుకు పత్తి వచ్చినప్పుడు ఎరైవల్, సేల్స్, డిస్పాచ్ రికార్డుల్లో వాటి వివరాలు నమోదు అవుతాయి. రికార్డుల ప్రకారం గుంటూరు యార్డుకు సుమారు 3 లక్షల క్వింటాళ్ల పత్తి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ, కేవలం 1600 క్వింటాళ్లే వచ్చినట్టు అక్కడి కార్మిక వర్గాలు చెబుతున్నాయి. పత్తి కొనుగోలులోని అక్రమాలను వివిధ దినపత్రికలు ప్రచురించడంతో మార్కెట్ యార్డు అధికారులు అప్రమత్తమై పత్తి యార్డుకు వచ్చినట్టుగా రికార్డులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ పనిలో ఐదుగురు కార్యదర్శులను నియమించేందుకు యార్డు ఉన్నతాధికారులు ప్రయత్నించగా, నలుగురు కార్యదర్శులు ఈ రికార్డుల తారుమారుకు అంగీకరించలేదు. రవికుమార్ అనే కార్యదర్శి ఈ తారుమారు కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని సీబీఐ అధికారులు కోరినప్పుడు యార్డులోని మరో కార్యాలయంలో ఉన్నాయని చెప్పి, రహస్యప్రాంతం నుంచి ఈ రికార్డులు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రెండు గోతాల రికార్డులను అధికారులకు చూపించగా, సీబీఐ అధికారులు ఒక బాక్సులోనే ముఖ్య రికార్డులను తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఎరైవల్, సేల్సు, డిస్పాచ్లకు సంబంధించిన రికార్డులను మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇస్సార్ అహ్మద్ ఇంతకు ముందే హైదరాబాద్ తీసుకువెళ్లారని, మొదట్లో ఈ అక్రమాలపై విచారణ జరిపినప్పడు తనతోపాటు వీటిని హైదరాబాద్ తీసుకువెళ్లారని, అందుకనే సీబీఐ అధికారులు అతి ముఖ్యమైన ఈ మూడింటిని పరిశీలన చేయలేకపోయారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. -
డీసీ చైర్మన్‌ను విచారించిన సీబీఐ
* దురుద్దేశంతోనే ఇతర బ్యాంకుల నుంచి రుణాలు * హైకోర్టుకు కెనరా బ్యాంకు నివేదన సాక్షి, హైదరాబాద్: రుణాల పేరుతో కెనరా బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో హైదరాబాద్ చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారించి సాయంత్రం 5.30కు తిరిగి జైలుకు తరలించారు. ఈ కేసులో జైల్లో ఉన్న మరో నిందితుడు వినాయక రవిరెడ్డికి మంగళవారం విచారణ సమయంలో ఛాతీ నొప్పి రావడంతో సీబీఐ అధికారులు ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చడం తెలిసిందే. ఆరోగ్యం కుదటపడటంతో బుధవారం ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోవైపు... వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డి తమ నుంచి రుణం పొందేందుకు తాకట్టు పెట్టిన ఆస్తులనే తమకు చెప్పకుండా మరో బ్యాంకుకు సైతం తాకట్టు పెట్టి అక్కడా రుణాలు పొందారని హైకోర్టుకు కెనరా బ్యాంకు నివేదించింది. వెంకట్రామిరెడ్డి, వినాయక్ రవిరెడ్డిలపై కేసులను కొట్టేయాలని కోరుతూ వారి సతీమణులు టి.మంజులారెడ్డి, టి.శాంతి ప్రియదర్శినిరెడ్డి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. కోర్టు ఆదేశం మేరకు కెనరా బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎం.చంద్రశేఖరరెడ్డి బుధవారం దానిపై కౌంటర్ దాఖలు చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న ఈ రుణాలను కంపెనీ ఆస్తి అప్పుల పట్టీలో చూపలేదని ఆరోపించారు. ‘‘పైగా దాని ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు చూపారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేశారు. ఇది విశ్వాసఘాతుకమే. వారి చర్యలు ప్రజాద్రోహం కిందకు వస్తాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ఉన్న కేసులను కొట్టేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది’’ అని అందులో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీబీఐ లోతుగా దర్యాప్తు జరిపితే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. మంజులారెడ్డి, శాంతి ప్రియదర్శినిరెడ్డిల పిటిషన్‌ను కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు. -
రైల్వే ఇన్స్పెక్టర్ అరెస్ట్
విశాఖపట్నం: లంచం తీసుకుంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కే జోజి సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏలూరు, తాడేపల్లిగూడెం మధ్య నడిచే రైళ్లలో తినుబండారాలు అమ్ముకోవాలంటే నెలకు రూ. 6000 చెల్లించాలని ఓ వ్యక్తిని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి అంత మొత్తం చెల్లించుకోలేనని చెప్పాడు. దానికి ఇన్స్పెక్టర్ముందు నెల, ఈ నెల కలిపి రూ.6000 చెల్లించమన్నాడు. ఈ విషయం విశాఖపట్నం సీబీఐ అధికారులకు సదరు వ్యక్తి తెలిపాడు. లంచం తీసుకుంటున్నప్పుడు సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ఇంట్లో సోదాలు నిర్వహించి పలు డాంక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు.