హైదరాబాద్: బషీర్ బాగ్‌లోని జీఎస్టీ భవన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో.. కస్టమ్స్ వింగ్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్‌స్పెక్టర్ కిషన్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.
వీరిద్దరు కలిసి పలు కంపెనీల్లో తనిఖీలు చేసినప్పుడు అడ్డగోలుగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు.. కిషన్‌లాల్, సురేష్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment