bashirbag
-
బషీర్ బాగ్ నిజాం కాలేజ్ లో విద్యార్థుల ఆందోళన
-
విల్లాలో విందు.. పేదింట విషాదం
రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్‌తో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాములు సమాచారం మేరకు... రిచ్మండ్ విల్లాలోని ఓ ఇంట్లో తాండూరు బషీరాబాద్ మండలానికి చెందిన శ్యామలమ్మ పని చేస్తుంది. శ్యామలమ్మ సన్ సిటీ ప్రాంతంలో తన ఇద్దరు కూతుళ్లు, అల్లుడు, కుమారుడితో కలిసి ఉంటుంది. సోమవారం విల్లాలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యాం అనంతరం మిగిలిన చికెన్, బగారా రైస్‌ను మంగళవారం ఉదయం శ్యామలమ్మ ఇంటికి తీసుకెళ్లింది. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో అందరు కలిసి భోజనం చేశారు. గంట అనంతరం విరోచనాలు, వాంతులు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లారు. చిన్న కూతురు భువనేశ్వరి(3)తో పాటు మరో కూతురు పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భువనేశ్వరి గురువారం మృతి చెందింది. మరో కూతురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శ్యామలమ్మతో పాటు మరో ముగ్గురు సన్ సిటీలోని సహారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...) -
జీఎస్టీ భవన్లో సీబీఐ దాడులు: రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు
హైదరాబాద్: బషీర్ బాగ్‌లోని జీఎస్టీ భవన్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో.. కస్టమ్స్ వింగ్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరు కలిసి పలు కంపెనీల్లో తనిఖీలు చేసినప్పుడు అడ్డగోలుగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు.. కిషన్‌లాల్, సురేష్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చదవండి: Shocking Video: స్విమ్మర్‌పై మొసలి భయంకర దాడి.. -
అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం
భీమవరం టౌన్ : బషీర్‌బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి.ఉమామేశ్వరరావు పిలుపునిచ్చారు. స్థానిక ప్యాడి మర్చంట్స్ హాల్లో ఆదివారం విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేపట్టిన వినాశకర విద్యుత్ సంస్కరణలు, అధిక విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 9 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపుతో ప్రజలు ఉద్యమించారన్నారు. ఈ ఉద్యమం మహత్తర పోరాటంగా రూపాంతరం చెందిందని చివరకు చంద్రబాబు ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో ఉద్యమకారులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించారని, ఈ పోరాటంలో రామకృష్ణ, బాలా స్వామి, విష్ణువర్థన్‌రెడ్డి ప్రాణాలు విడిచారని గుర్తు చేశారు. అమరవీరుల ఉద్యమ స్ఫూర్తి ఎన్నటికీ వృథా కాదన్నారు. ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం గతంలో మాదిరిగానే సామాన్యుల సమస్యలను గాలికి వదిలి భూములు గుంజుకోవడం, కార్మికచట్టాలను నీరుగార్చడం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, జేఎన్వీ గోపాలన్, డి.సత్యనారాయణ, బీవీ వర్మ, బి.ఆంజనేయులు పాల్గొన్నారు