
రాజేంద్రనగర్: ఫుడ్ పాయిజన్‌తో ఓ చిన్నారి మృతి చెందగా మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాములు సమాచారం మేరకు... రిచ్‌మండ్ విల్లాలోని ఓ ఇంట్లో తాండూరు బషీరాబాద్ మండలానికి చెందిన శ్యామలమ్మ పని చేస్తుంది. శ్యామలమ్మ సన్ సిటీ ప్రాంతంలో తన ఇద్దరు కూతుళ్లు, అల్లుడు, కుమారుడితో కలిసి ఉంటుంది. సోమవారం విల్లాలోని ఓ ఇంట్లో జరిగిన శుభకార్యాం అనంతరం మిగిలిన చికెన్, బగారా రైస్‌ను మంగళవారం ఉదయం శ్యామలమ్మ ఇంటికి తీసుకెళ్లింది.
మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో అందరు కలిసి భోజనం చేశారు. గంట అనంతరం విరోచనాలు, వాంతులు కావడంతో స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి వెళ్లారు. చిన్న కూతురు భువనేశ్వరి(3)తో పాటు మరో కూతురు పరిస్థితి విషమించడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ భువనేశ్వరి గురువారం మృతి చెందింది. మరో కూతురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. శ్యామలమ్మతో పాటు మరో ముగ్గురు సన్ సిటీలోని సహారా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...)
Comments
Please login to add a commentAdd a comment