customs officer
-
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీఎత్తున బంగారం పట్టుబడింది. సుడాన్ జాతీయులైన 23 మంది మహిళలు సుడాన్ నుంచి వయా షార్జా మీదుగా జి9–458 విమానంలో గురువారం తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. లగేజీల స్కానింగ్‌లో బంగారం బయటపడడంతో అధికారులు అప్రమత్తమై మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బూట్ల అడుగున ప్రత్యేకంగా తయారు చేసిన భాగంలో పెద్దఎత్తున ఆభరణాలు సైతం బయటపడ్డాయి. మొత్తం 14 కేజీల 906 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.7.89 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నలుగురు మహిళలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. స్మగ్లర్లకు అందించేందుకే.. సుడాన్‌కు చెందిన మహిళలందరూ క్యారియర్లుగానే బంగారం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. స్మగ్లర్లకు అక్రమంగా బంగారం చేరవేసేందుకే వీరు షార్జా మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. గతంలో కూడా సుడాన్‌కు చెందిన పలువురు మహిళలు అక్రమంగా బంగారం, విదేశీ నగదుతో పట్టుబడిన కేసులున్నాయి. వీరి సెల్ఫోన్ల ఆధారంగా బంగారం స్మగ్లర్ల వివరాలను తెలుసుకునేందుకు కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
జీఎస్టీ భవన్లో సీబీఐ దాడులు: రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డ అధికారులు
హైదరాబాద్: బషీర్ బాగ్‌లోని జీఎస్టీ భవన్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో.. కస్టమ్స్ వింగ్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరు కలిసి పలు కంపెనీల్లో తనిఖీలు చేసినప్పుడు అడ్డగోలుగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో.. దాడులు నిర్వహించిన సీబీఐ అధికారులు.. కిషన్‌లాల్, సురేష్ కుమార్‌లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చదవండి: Shocking Video: స్విమ్మర్‌పై మొసలి భయంకర దాడి.. -
ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా షార్జా నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు తనిఖీలు చేశారు. అతని నుండి రూ.10 లక్షల విలువ గల 300 గ్రాముల బంగారపు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆపిల్ ఐఫోన్, పెర్ఫ్యూమ్లు, సోని ప్లేస్టేషన్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేశారు. ప్రయాణికుడిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
లంచం తీసుకుంటూ.. సీబీఐకి చిక్కిన అధికారి
హైదరాబాద్: లంచం తీసుకుంటూ కస్టమ్స్ అధికారి సీబీఐకి చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ. 4 లక్షల లంచం తీసుకుంటూ కస్టమ్స్ సూపరింటెండెంట్ సీబీఐ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనతో పాటు దీంతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఇనస్పెక్టర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేపడుతున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
‘గోల్డ్’ మ్యాన్
సాక్షి, హైదరాబాద్: దుబాయ్, మస్కట్ సహా అనేక దేశాల నుంచి గత ఏడాది దేశంలోకి అక్రమ బంగారం భారీగా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలోనే అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ కస్టమ్స్ విభాగం అత్యంత అప్రమత్తత ప్రకటించింది. వరుస తనిఖీలు చేపట్టిన అధికారులు భారీగా అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముంబై విమానాశ్రయ కస్టమ్స్ విభాగం రికార్డు స్థాయిలో దేశంలోనే అత్యధికంగా 1010 కేజీల బంగారం రికవరీ చేసింది. ఈ టీమ్‌ను లీడ్ చేసింది తెలుగు తేజం... డాక్టర్ కర్లపు కిరణ్‌కుమార్. 2010 బ్యాచ్ ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) అధికారి అయిన కిరణ్‌కుమార్ స్వస్థలం విశాఖపట్నం. ప్రస్తుతం కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయన ఫోన్ ద్వారా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు... ఏపీలోని వైజాగ్‌కు చెందిన కిరణ్‌కుమార్ తండ్రి కేడీఆర్ ఆచార్య రిటైర్ట్ ప్రభుత్వ ఉద్యోగి. తల్లి సునిత ఇప్పటికీ సర్వీసులో కొనసాగుతున్నారు. విద్యాభ్యాసం మొత్తం విశాఖపట్నం లోనే చేసిన కిరణ్ ఆంధ్రా మెడికల్ కాలే జీ నుంచి ఎంబీ బీఎస్ పూర్తి చేశారు. 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఐఆర్ఎస్కు ఎంపికై కస్టమ్స్ విభాగంలో ఉన్నారు. 2012 నుంచి ముంబైలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన రెండేళ్ళుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆల్‌టైమ్ రికార్డు... భారత్‌లో బంగారం అక్రమ రవాణా 1970ల్లోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విమానాశ్రయం అధికారులూ పట్టుకోని విధంగా గతేడాది ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఏకంగా 1010 కేజీల అక్రమ బంగారం చిక్కింది. ఢిల్లీ విమానాశ్రయంలో 600 కేజీలు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 150 కేజీలు స్వాధీనమైంది. ముంబైలో చిక్కిన టన్నుకు పైగా బంగారాన్ని కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందమే పట్టుకోవడం విశేషం. ఈ టీమ్ ఈ ఏడాది ఇప్పటి వరకు 350 కేజీలు స్వాధీనం చేసుకుంది. ఇది కూడా మిగతా ఎయిర్‌పోర్టుల్లో చిక్కిన దాని కంటే ఎక్కువే. ఒకే దఫా రెండు ఫై్లట్లలో మస్కట్ నుంచి వచ్చిన 25 కేజీల బంగారం స్వాధీనం ఈ టీమ్ పట్టుకున్న వాటిలో పెద్దమొత్తం. ముంబై ద్వారా అక్రమ రవాణా చేసే ముఠాలకు విమానం క్రూతో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది సహకరిస్తున్నారు. స్మగ్లర్ తమ వెంట తెచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలో క్రూకో, ఎయిర్పోర్ట్ సిబ్బందికో అప్పగించి బయటకు వచ్చేస్తారు. వీరికి చెకింగ్ ఉండకపోవడంతో పాటు ఏ మార్గంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై కన్నేసిన కిరణ్ టీమ్ గతేడాది ఎయిర్పోర్ట్ మేనేజర్ జగదీష్‌బాబుతో పాటు ఇద్దరు క్రూ సిబ్బందిని అరెస్టు చేశారు. స్మగ్లర్లతో పాటు వారి వెనుక వ్యవస్థీకృతంగా కథ నడిపే ఆర్గనైజర్లు, రిసీవర్లను పట్టుకున్నారు. ‘మేము తీసుకున్న చర్యలతో పాటు గతేడాది నవంబర్‌లో మారిన ఇంపోర్ట్ రెగ్యులేషన్స్‌తో ముంబై కేంద్రంగా జరిగే బంగారం అక్రమ రవాణా గణనీయంగా తగ్గింది’ అని కిరణ్‌కుమార్ అన్నారు. -
కస్టమ్స్ ఆఫీసర్ లాకర్లో రూ. 85 లక్షల నగదు!
కస్టమ్స్ శాఖలో పనిచేస్తున్నారంటే కష్టాలు తీరినట్లే అంటారు. అది నిజమనిపించేలా.. ఓ కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ బ్యాంకు లాకర్లో భారీ మొత్తం నగదు బయటపడింది. సీబీఐ సోదాలు చేస్తే, అంతా ఇంతా కాదు.. ఏకంగా 85 లక్షలు దొరికాయి. ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు.. భారీ మొత్తంలో ఆస్తులు కూడబెట్టుకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ లాకర్లు చూస్తే, వాటిలో 85 లక్షల నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తుల డాక్యుమెంట్లు కూడా బయటపడ్డాయి. దాంతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. సహదేవ్ గుప్తా అనే వ్యాపారి 8 వేల కోట్ల లావాదేవీలు చేసి, వాటి విషయంలో తప్పించుకోడానికి ఈ అధికారి సాయం తీసుకున్నట్లు సీబీఐ చెబుతోంది. ఆయన సాయం చేయడం వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 75 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐకి ఫిర్యాదు అందడంతో కస్టమ్స్ కమిషనర్ అతుల్ దీక్షిత్, డిప్యూటీ కమిషనర్ నళిన్ కుమార్ ఇద్దరి లాకర్లను తనిఖీ చేశారు. దీక్షిత్ లాకర్లలో 85 లక్షల నగదుతో పాటు గుర్గావ్, గ్రేటర్ నోయిడా, లక్నో తదితర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు పత్రాల్లో గుర్తించారు. -
కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే...
టెలీకమ్యూనికేషన్స్‌లో ఎంబీఏ ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ వివరాలు తెలపండి? -బాలా, మహబూబ్‌నగర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీలోని భారతీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.. టెలీకాం సిస్టమ్స్ మేనేజ్మెంట్లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీలలో బ్యాచిలర్ డిగ్రీ/నాలుగు సంవత్సరాల బీఎస్సీ అగ్రికల్చరల్ సైన్స్/ ఫిజికల్/కెమికల్/ మ్యాథమెటికల్ సెన్సైస్లలోని ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎలక్ట్రానిక్స్ సెన్సైస్/ఎన్విరాన్మెంటల్ సైన్స్/కంప్యూటేషనల్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/అగ్రికల్చర్లలో మాస్టర్స్ డిగ్రీ/ కామర్స్/ఎకనమిక్స్‌లో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా వెబ్సైట్: www.iitd.ernet.in పూణేలోని సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలి కాం మేనేజ్మెంట్.. సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లు స్పెషలైజేషన్లుగా టెలికాం మేనేజ్మెంట్లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ప్రవేశం: ఎస్ఎన్ఏపీ ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా వెబ్సైట్: www.sitm.ac.in నోయిడాలోని అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ టెలీకమ్యూనికేషన్స్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. హెచ్ఆర్ అండ్ సేల్స్ స్పెషలైజేషన్‌తో కూడా ఈ సంస్థ ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్, ఐటీ) ప్రవేశం: క్యాట్/మ్యాట్/జీమ్యాట్/అమిటీ సంస్థ నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. వెబ్సైట్: www.amity.edu కస్టమ్స్ ఆఫీసర్ కావడానికి కావాల్సిన అర్హతల వివరాలు తెలపండి? -శ్రీధర్, నిర్మల్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపిక కావడం ద్వారా కస్టమ్స్ ఆఫీసర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఐఆర్ఎస్లో ఆదాయపు పన్ను, కస్ట మ్స్, కేంద్ర ఎక్సైజ్ లాంటి విభాగాలు ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే సరుకులకు సంబంధించి పన్ను వివరాల గురించి కస్టమ్స్ విభాగం చూస్తుంది. దేశంలో తయారయ్యే వస్తువులపై పన్ను గురించి ఎక్సైజ్ విభాగం చూస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఐఆర్ఎస్లో ప్రవేశార్హత ఉంటుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఐండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్, ఎక్సైజ్), గ్రూప్-ఎ లాంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. పరీక్ష విధానం: యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో 1) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్; 2) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష; 3) పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపరుకు గరిష్టంగా 200 మార్కులు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టీవ్ విధానంలో ఉంటాయి. సిలబస్: అంతర్జాతీయ, జాతీయ వర్తమాన అంశాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్, లాజికల్రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సన్ స్కిల్స్ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. అన్నీ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అభ్యర్థి మేధో సామర్థ్యాన్ని, పాలనాదక్షతను ఈ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. అత్యంత క్లిష్టమైన పరీక్షగా సివిల్ సర్వీసెస్‌ను చెప్పుకోవచ్చు. దీనికోసం నిరంతర శ్రమ, అధ్యయనం తప్పనిసరి. ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. మేగజీన్లని చదవడం ద్వారా వ్యక్తిగత సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో వేగాన్ని పెంచుకోవచ్చు. వెబ్సైట్: www.upsc.gov.in -
పనిమనిషిపై కస్టమ్స్ అధికారి అత్యాచారం!!
ఉత్తరప్రదేశ్.. అత్యాచారాల రాజధాని అన్న విషయం పదే పదే రుజువవుతోంది. ఏకంగా రాష్ట్ర రాజధాని నగరం లక్నోలోనే ఓ కస్టమ్స్ అధికారి ఓ పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు ఆయనపై కేసు నమోదైంది. కస్టమ్స్ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పనిచేసే పనిమనిషిపై 20 రోజుల క్రితం అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ దినేష్ యాదవ్ తెలిపారు. అతడు తనను కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా.. భయం వల్ల తాను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాలిని కూడా తాము ప్రశ్నించామని, ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, చట్టప్రకరాం చర్యలు తీసుకుంటామని ఎస్పీ దినేష్ యాదవ్ చెప్పారు. అయితే.. పనిమనిషి కట్టుకథలు అల్లుతోందని సుశీల్ కుమార్ అంటున్నారు. తన మేనత్తను ఆమె సరిగా చూసుకోనందుకు పనిలోంచి తీసేశామని, అందుకే ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. -
కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే ఎలా?
అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి కోర్సుల్లో అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పించే పరీక్ష స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్ఏటీ). క్రిటికల్ రీడింగ్, మ్యాథమెటిక్స్, రైటింగ్ విభాగాల్లో శాట్ పరీక్ష జరుగుతుంది. క్రిటికల్ రీడింగ్ ప్రధానంగా అభ్యర్థిలోని వొకాబ్యులరీని పరీక్షించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. దీంతోపాటు వాక్య నిర్మాణం పూర్తి చేయడం, ప్యాసేజ్ కొశ్చన్స్ వంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో అభ్యర్థులకు అత్యధికంగా క్వాంటిటేటివ్, కాలిక్యులేషన్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతాయి. ఇందులో కూడా మూడు ప్రత్యేక ఉప విభాగాలుంటాయి. ముప్ఫై శాతం ఎస్సేతో.. మిగతా 70 శాతం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో జరిగే విభాగమే రైటింగ్ సెక్షన్. మల్టిపుల్ ఛాయిస్‌కు సంబంధించి ‘ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కొశ్చన్స్’, ‘పేరాగ్రాఫ్ ఇంప్రూవ్మెంట్ కొశ్చన్స్’ అధికంగా ఉంటాయి. శాట్‌కు హాజరవాలనుకున్న అభ్యర్థులు కాలేజ్ బోర్డ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందుబాటులో ఉన్న తేదీల్లో తమకిష్టమైన తేదీలో ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వివరాలకు: www.collegeboard.com, www.ets.org స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్సీఆర్ఏ) ఎగ్జామ్ వివరాలను తెలపండి? -శ్రీధర్, నిర్మల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా రైల్వే శాఖలో క్లాస్-1 హోదాలో మెకానికల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. అర్హత: ఇంటర్మీడియెట్ (మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్టుగా, ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టు) ఉత్తీర్ణత. ఎంపిక విధానం రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ రాత పరీక్ష. ఇందులో అర్హత సాధించిన వారు రెండో దశ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల పాటు రైల్వే వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్ శిక్షణనిస్తారు. ఈ సమయంలో బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెర్సా (రాంచీ) నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా ప్రదానం చేస్తారు. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ రాత పరీక్ష మొత్తం 600 మార్కులకు మూడు పేపర్లుగా ఉంటుంది. వివరాలు.. పేపర్-1 జనరల్ ఎబిలిటీ 200 పేపర్-2 ఫిజిక్స్ 200 పేపర్-3 మ్యాథమెటిక్స్ 200 ఇంటర్ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఎస్సీఆర్ఏ నోటిఫికేషన్ సాధారణంగా అక్టోబర్‌లో వెలువడుతుంది. పరీక్ష జనవరిలో ఉంటుంది. ఉపయోగకరమైన పుస్తకాలు: ఎస్సీఆర్ఏ సెల్ఫ్‌స్టడీ గైడ్- డా॥వర్మ, ఎం.కె.దీక్షిత్ అండ్ ఆర్.కె. అగర్వాల్; ఉప్కార్స్ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ - డా॥లాల్ అండ్ జైన్; ప్రముఖ ఇంగ్లిష్, తెలుగు దిన పత్రికలు; ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ మెటీరియల్ వివరాలకు: www.upsc.gov.in ఎంటెక్ (పవర్ సిస్టమ్స్/పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సు వివరాలను తెలపండి? -మిధున్, ఆదిలాబాద్. ఇంజనీరింగ్‌లోని ఈఈఈ బ్రాంచ్‌కు సంబంధించిన అంశం పవర్ సిస్టమ్/పవర్ ఎలక్ట్రానిక్స్. ఇందులో పవర్ సిస్టమ్స్ రూపొందించడం, వినియోగించుకోవడం వంటి అంశాలు ఉంటాయి. ఎంటెక్ (పవర్ సిస్టమ్స్/పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, డిజిటల్ సిగ్నల్ ట్రాన్స్మిషన్, సెమీకండక్టర్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. జీఈ, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, బ్లూ స్టార్ ఇన్ఫోటెక్, బీఎస్ఎన్ఎల్, నోకియా, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఐబీఎం వంటివి ఈ రంగంలోని టాప్ రిక్రూటర్స్. ఎంటెక్ (పవర్ సిస్టమ్స్/పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్-హైదరాబాద్; వివరాలకు: www.uceou.edu/ జేఎన్టీయూ-హైదరాబాద్ వివరాలకు: www.jntuh.ac.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం వివరాలకు: www.andhrauniversity.edu.in కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే ఎలా? -కార్తీక్, షాద్‌నగర్. కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గాలున్నాయి. అవి యూపీఎస్సీ-సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఎస్ఎస్సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తుంది. దీని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్.. తదితర అఖిల భారత సర్వీస్ అధికారుల భర్తీ జరుగుతుంది. ఈ సర్వీసుల్లోని ఐఆర్ఎస్ (ఐఆర్ఎస్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కం ట్యాక్స్ అనే రెండు విభాగాలు ఉంటాయి)కు ఎంపికకావడం ద్వారా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కస్టమ్స్ విభాగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు హాజరు కావచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశలుగా ఉంటుంది. వివరాలకు: www.upsc.gov.in/ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇన్స్పెక్టర్ హోదాలో కస్టమ్స్ విభాగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. కావల్సిన అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. ఇందుకోసం నిర్వహించే రాత పరీక్ష.. రెండు దశల్లో (టైర్ 1, టైర్ 2) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి తర్వాత దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. వివరాలకు: ttp://ssc.nic.in -
ప్రయాణికుని వద్ద నుంచి కిలో బంగారం స్వాధీనం
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురేష్ అనే వ్యక్తి వద్ద నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన సురేష్ సామాగ్రిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఆ బంగారాన్ని కనుగోన్నారు. దాంతో కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు సురేష్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సురేష్‌పై కేసు నమోదు చేశారు. -
శంషాబాద్‌లో ఘరానా మోసం
హైదరాబాద్: తక్కువ ధరకు బంగారం ఇస్తానని ఓ వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డ ఘటన గురువారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. తాను కస్టమ్స్ ఆఫీసర్నని, తన వద్ద బంగారం ఉందని మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి బోల్తా కొట్టించాడు. తక్కువ ధరకు బంగారం ఇస్తాననడంతో నమ్మిన ఆ వ్యక్తి రూ. కోటి నలబై మూడు లక్షలు అతనికి సమర్పించాడు. దీంతో అతను చడీ చప్పుడు లేకుండా ఉడాయించాడు. మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫిర్యాదు చేశాడు.