కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే ఎలా? | How to become a Customs officer? | Sakshi
Sakshi News home page

కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే ఎలా?

Published Thu, May 15 2014 2:30 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

How to become a Customs officer?

 అమెరికాలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి కోర్సుల్లో అంతర్జాతీయ విద్యార్థులకు ప్రవేశం కల్పించే పరీక్ష స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎస్‌ఏటీ). క్రిటికల్ రీడింగ్, మ్యాథమెటిక్స్, రైటింగ్ విభాగాల్లో శాట్ పరీక్ష జరుగుతుంది. క్రిటికల్ రీడింగ్ ప్రధానంగా అభ్యర్థిలోని వొకాబ్యులరీని పరీక్షించే విధంగా ఉంటుందని చెప్పవచ్చు. దీంతోపాటు వాక్య నిర్మాణం పూర్తి చేయడం, ప్యాసేజ్ కొశ్చన్స్ వంటి వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో అభ్యర్థులకు అత్యధికంగా క్వాంటిటేటివ్, కాలిక్యులేషన్‌కు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతాయి. ఇందులో కూడా మూడు ప్రత్యేక ఉప విభాగాలుంటాయి. ముప్ఫై శాతం ఎస్సేతో.. మిగతా 70 శాతం మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో జరిగే విభాగమే రైటింగ్ సెక్షన్. మల్టిపుల్ ఛాయిస్‌కు సంబంధించి ‘ఎర్రర్ ఐడెంటిఫికేషన్ కొశ్చన్స్’, ‘పేరాగ్రాఫ్ ఇంప్రూవ్‌మెంట్ కొశ్చన్స్’ అధికంగా ఉంటాయి. శాట్‌కు హాజరవాలనుకున్న అభ్యర్థులు కాలేజ్ బోర్డ్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందుబాటులో ఉన్న తేదీల్లో తమకిష్టమైన తేదీలో ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వివరాలకు:
 www.collegeboard.com, www.ets.org
 
 స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ (ఎస్‌సీఆర్‌ఏ) ఎగ్జామ్ వివరాలను తెలపండి?
 -శ్రీధర్, నిర్మల్.
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏటా స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా రైల్వే శాఖలో క్లాస్-1 హోదాలో మెకానికల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. అర్హత: ఇంటర్మీడియెట్ (మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్టుగా, ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టు) ఉత్తీర్ణత. ఎంపిక విధానం రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశ రాత పరీక్ష. ఇందులో అర్హత సాధించిన వారు రెండో దశ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల పాటు రైల్వే వర్క్‌షాప్‌లలో అప్రెంటీస్ శిక్షణనిస్తారు. ఈ సమయంలో బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మెర్సా (రాంచీ) నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీని కూడా ప్రదానం చేస్తారు. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ రాత పరీక్ష మొత్తం 600 మార్కులకు మూడు పేపర్లుగా ఉంటుంది. వివరాలు..
 
 పేపర్-1     జనరల్ ఎబిలిటీ     200
 పేపర్-2     ఫిజిక్స్    200
 పేపర్-3    మ్యాథమెటిక్స్    200
 ఇంటర్ సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి.
 ఎస్‌సీఆర్‌ఏ నోటిఫికేషన్ సాధారణంగా అక్టోబర్‌లో వెలువడుతుంది. పరీక్ష జనవరిలో ఉంటుంది.
 ఉపయోగకరమైన పుస్తకాలు: ఎస్‌సీఆర్‌ఏ సెల్ఫ్‌స్టడీ గైడ్-
 డా॥వర్మ, ఎం.కె.దీక్షిత్ అండ్ ఆర్.కె. అగర్వాల్; ఉప్‌కార్స్ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ - డా॥లాల్ అండ్ జైన్; ప్రముఖ ఇంగ్లిష్, తెలుగు దిన పత్రికలు; ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ మెటీరియల్
 వివరాలకు: www.upsc.gov.in
 
 ఎంటెక్ (పవర్ సిస్టమ్స్/పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సు వివరాలను తెలపండి?
     -మిధున్, ఆదిలాబాద్.
 ఇంజనీరింగ్‌లోని ఈఈఈ బ్రాంచ్‌కు సంబంధించిన అంశం పవర్ సిస్టమ్/పవర్ ఎలక్ట్రానిక్స్. ఇందులో పవర్ సిస్టమ్స్ రూపొందించడం, వినియోగించుకోవడం వంటి అంశాలు ఉంటాయి. ఎంటెక్ (పవర్ సిస్టమ్స్/పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్‌మిషన్, డిజిటల్ సిగ్నల్ ట్రాన్స్‌మిషన్, సెమీకండక్టర్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. జీఈ, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, బ్లూ స్టార్ ఇన్ఫోటెక్, బీఎస్‌ఎన్‌ఎల్, నోకియా, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఐబీఎం వంటివి ఈ రంగంలోని టాప్ రిక్రూటర్స్.
 ఎంటెక్ (పవర్ సిస్టమ్స్/పవర్ ఎలక్ట్రానిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్-హైదరాబాద్; వివరాలకు: www.uceou.edu/
     జేఎన్‌టీయూ-హైదరాబాద్
     వివరాలకు: www.jntuh.ac.in
     ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
     వివరాలకు: www.andhrauniversity.edu.in
 
 కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే ఎలా?
 -కార్తీక్, షాద్‌నగర్.
 కస్టమ్స్ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గాలున్నాయి. అవి యూపీఎస్సీ-సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ఎస్‌ఎస్‌సీ-కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తుంది. దీని ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్.. తదితర అఖిల భారత సర్వీస్ అధికారుల భర్తీ జరుగుతుంది. ఈ సర్వీసుల్లోని ఐఆర్‌ఎస్ (ఐఆర్‌ఎస్‌లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఇన్‌కం ట్యాక్స్ అనే రెండు విభాగాలు ఉంటాయి)కు ఎంపికకావడం ద్వారా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో కస్టమ్స్ విభాగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు హాజరు కావచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశలుగా ఉంటుంది. వివరాలకు:
 
 www.upsc.gov.in/
 స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ), నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇన్‌స్పెక్టర్ హోదాలో కస్టమ్స్ విభాగంలో కెరీర్ ప్రారంభించవచ్చు. కావల్సిన అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. ఇందుకోసం నిర్వహించే రాత పరీక్ష.. రెండు దశల్లో (టైర్ 1, టైర్ 2) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి తర్వాత దశలో పర్సనల్ ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు.
     వివరాలకు: ttp://ssc.nic.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement