కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే... | customs officer jobs | Sakshi
Sakshi News home page

కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే...

Published Thu, Apr 9 2015 3:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే...

కస్టమ్స్ ఆఫీసర్ కావాలంటే...

 టెలీకమ్యూనికేషన్స్‌లో ఎంబీఏ ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ వివరాలు తెలపండి?
 -బాలా, మహబూబ్‌నగర్
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీలోని భారతీ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్.. టెలీకాం సిస్టమ్స్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
 అర్హత: ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/ఫార్మసీలలో బ్యాచిలర్ డిగ్రీ/నాలుగు సంవత్సరాల బీఎస్సీ అగ్రికల్చరల్ సైన్స్/ ఫిజికల్/కెమికల్/ మ్యాథమెటికల్ సెన్సైస్‌లలోని ఫిజిక్స్/కెమిస్ట్రీ/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఎలక్ట్రానిక్స్ సెన్సైస్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/కంప్యూటేషనల్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/అగ్రికల్చర్‌లలో మాస్టర్స్ డిగ్రీ/ కామర్స్/ఎకనమిక్స్‌లో 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా    వెబ్‌సైట్: www.iitd.ernet.in
 పూణేలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలి కాం మేనేజ్‌మెంట్.. సిస్టమ్స్ అండ్ ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లు స్పెషలైజేషన్లుగా టెలికాం మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
 
 అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ
 ప్రవేశం: ఎస్‌ఎన్‌ఏపీ ప్రవేశ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
 వెబ్‌సైట్: www.sitm.ac.in
 నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ టెలీకమ్యూనికేషన్స్‌లో ఎంబీఏను ఆఫర్ చేస్తోంది. హెచ్‌ఆర్ అండ్ సేల్స్ స్పెషలైజేషన్‌తో కూడా ఈ సంస్థ ఎంబీఏను ఆఫర్ చేస్తోంది.
 అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్, ఐటీ)
 ప్రవేశం: క్యాట్/మ్యాట్/జీమ్యాట్/అమిటీ సంస్థ నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
 వెబ్‌సైట్: www.amity.edu
 
 కస్టమ్స్ ఆఫీసర్ కావడానికి కావాల్సిన అర్హతల వివరాలు తెలపండి?
 -శ్రీధర్, నిర్మల్
 ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)కు ఎంపిక కావడం ద్వారా కస్టమ్స్ ఆఫీసర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఐఆర్‌ఎస్‌లో ఆదాయపు పన్ను, కస్ట మ్స్, కేంద్ర ఎక్సైజ్ లాంటి విభాగాలు ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే సరుకులకు సంబంధించి పన్ను వివరాల గురించి కస్టమ్స్ విభాగం చూస్తుంది. దేశంలో తయారయ్యే వస్తువులపై పన్ను గురించి ఎక్సైజ్ విభాగం చూస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఐఆర్‌ఎస్‌లో ప్రవేశార్హత ఉంటుంది.
 యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఐండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్, ఎక్సైజ్), గ్రూప్-ఎ లాంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది.అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ. వయసు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
 
 పరీక్ష విధానం:
 యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలో 1) సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్; 2) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష; 3) పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపరుకు గరిష్టంగా 200 మార్కులు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టీవ్ విధానంలో ఉంటాయి.
 
 సిలబస్: అంతర్జాతీయ, జాతీయ వర్తమాన అంశాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్, లాజికల్‌రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్సన్ స్కిల్స్‌ప్రవేశం: ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో తొమ్మిది పేపర్లు ఉంటాయి. అన్నీ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటాయి. అభ్యర్థి మేధో సామర్థ్యాన్ని, పాలనాదక్షతను ఈ పరీక్షల ద్వారా అంచనా వేస్తారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇందులో అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు.
 
 అత్యంత క్లిష్టమైన పరీక్షగా సివిల్ సర్వీసెస్‌ను చెప్పుకోవచ్చు. దీనికోసం నిరంతర శ్రమ, అధ్యయనం తప్పనిసరి. ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన అంశాలపై పట్టు సాధించాలి. మేగజీన్లని చదవడం ద్వారా వ్యక్తిగత సామర్థ్యాలను మెరుగుపరచుకోవాలి. నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పరీక్షలో వేగాన్ని పెంచుకోవచ్చు.
 వెబ్‌సైట్: www.upsc.gov.in
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement