పనిమనిషిపై కస్టమ్స్ అధికారి అత్యాచారం!! | Customs official accused of rape in Lucknow | Sakshi
Sakshi News home page

పనిమనిషిపై కస్టమ్స్ అధికారి అత్యాచారం!!

Published Mon, Jul 7 2014 1:45 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

పనిమనిషిపై కస్టమ్స్ అధికారి అత్యాచారం!! - Sakshi

పనిమనిషిపై కస్టమ్స్ అధికారి అత్యాచారం!!

ఉత్తరప్రదేశ్.. అత్యాచారాల రాజధాని అన్న విషయం పదే పదే రుజువవుతోంది. ఏకంగా రాష్ట్ర రాజధాని నగరం లక్నోలోనే ఓ కస్టమ్స్ అధికారి ఓ పనిమనిషిపై అత్యాచారం చేసినట్లు ఆయనపై కేసు నమోదైంది. కస్టమ్స్ శాఖలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న సుశీల్ కుమార్ అనే వ్యక్తి తమ బంధువుల ఇంట్లో పనిచేసే పనిమనిషిపై 20 రోజుల క్రితం అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు అందింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ దినేష్ యాదవ్ తెలిపారు. అతడు తనను కొన్ని నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నా.. భయం వల్ల తాను ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

బాధితురాలిని కూడా తాము ప్రశ్నించామని, ఆమెను వైద్య పరీక్షలకు పంపించామని, చట్టప్రకరాం చర్యలు తీసుకుంటామని ఎస్పీ దినేష్ యాదవ్ చెప్పారు. అయితే.. పనిమనిషి కట్టుకథలు అల్లుతోందని సుశీల్ కుమార్ అంటున్నారు. తన మేనత్తను ఆమె సరిగా చూసుకోనందుకు పనిలోంచి తీసేశామని, అందుకే ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement