శంషాబాద్ ఎయిర్పోర్టులో సురేష్ అనే వ్యక్తి వద్ద నుంచి కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన సురేష్ సామాగ్రిని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఆ బంగారాన్ని కనుగోన్నారు. దాంతో కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కస్టమ్స్ అధికారులు సురేష్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని పోలీసులకు అప్పగించారు. పోలీసులు సురేష్పై కేసు నమోదు చేశారు.