రైల్వే ఇన్‌స్పెక్టర్ అరెస్ట్ | railway inspector arrested | Sakshi
Sakshi News home page

రైల్వే ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

Published Mon, Feb 16 2015 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM

railway inspector arrested

విశాఖపట్నం: లంచం తీసుకుంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కే జోజి  సీబీఐ అధికారులకు  రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏలూరు, తాడేపల్లిగూడెం మధ్య నడిచే  రైళ్లలో తినుబండారాలు అమ్ముకోవాలంటే నెలకు రూ. 6000 చెల్లించాలని ఓ వ్యక్తిని డిమాండ్ చేశాడు. ఆ వ్యక్తి అంత మొత్తం చెల్లించుకోలేనని చెప్పాడు. దానికి ఇన్‌స్పెక్టర్ముందు నెల, ఈ నెల కలిపి రూ.6000 చెల్లించమన్నాడు. ఈ విషయం విశాఖపట్నం సీబీఐ అధికారులకు సదరు వ్యక్తి తెలిపాడు. లంచం తీసుకుంటున్నప్పుడు సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ఇంట్లో సోదాలు నిర్వహించి పలు డాంక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ను అరెస్టు చేసి సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. నిందితునికి జడ్జి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement