ఠాణే: లంచం తీసుకుంటున్నాడనే ఆరోపణతో గతవారం సీబీఐ అధికారులు అరెస్టు చేసిన సీనియర్ ఆదాయపన్ను అధికారిని జనవరి 13వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ మంగళవారం స్పెషల్ జడ్జి ఆదేశాలు జారీచేశారు.
వివరాలు.. పన్ను ఎగవేత కేసులో ఒక వ్యాపారికి బెయిల్ ఇప్పించేందుకు రూ.3.5 లక్షల లంచం తీసుకుంటుండగా జాయింట్ ఐటీ కమిషనర్ సంజీవ్ ఘాయ్‌ని సీబీఐ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. అప్పటినుంచి సీబీఐ కస్టడీలోనే ఉన్న అతడిని మంగళవారం ప్రత్యేక జడ్జి ఎం.సి.ఖాద్రే ముందు హాజరు పరచగా జనవరి 13 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీచేశారు. ప్రత్యేక జడ్జి ముందు సీబీఐ తరఫు న్యాయవాది విజయ్ శాలీ మాట్లాడుతూ.. నిందితుడి ఇంటి నుంచి దర్యాప్తు అధికారులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీబీఐ అధికారుల కథనం ప్రకారం.. ఐటీ అధికారి సంజీవ్ ఘాయ్ ఇంట్లో ఎప్పుడూ రెండు డజన్లకు పైగా ఐటీ ఫైళ్లు ఉంటాయి. వాటిని పరిశీలన నిమిత్తం తనతో ఉంచుకుంటున్నట్లు అతడు చెబుతాడు. సంజయ్ నిత్యం వారాంతాల్లో ఢిల్లీ వెళ్లి వస్తుంటాడు. కాగా, ఇతర ఏ కేసుల్లోనైనా లంచం తీసుకున్నాడేమో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
లంచం కేసులో ఐటీ అధికారి జైలుకి
Published Wed, Jan 1 2014 12:17 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement